తమిళ సినిమా: ముంబైలో చదివి,పెరిగిన మలయాళీ నటి మాళవిక మోహన్. తొలుత మాతృభాషలో నటిగా పరిచయమై ఆ తర్వాత కన్నడం, హిందీ, తమిళం అంటూ పాన్ ఇండియా నటిగా మారిపోయింది. ముఖ్యంగా తమిళంలో రజనీకాంత్ కథానాయకుడుగా నటించిన పేట చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. అందులో నటుడు శశి కుమార్‌కు భార్యగా విలక్షణ పాత్రలో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత మాస్టర్ చిత్రంలో విజయ్‌తోను, ధనుష్‌కు జంటగా మారన్ చిత్రంలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ బోల్డ్ అండ్ బ్యూటీ ప్రస్తుతం విక్రమ్ సరసన తంగలాన్ చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం కోసం చాలా కసరత్తులే చేసింది ముఖ్యంగా కర్రసాము విలువ విద్యలో శిక్షణ పొందింది. ఆ ఫొటోలను ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా అవి ట్రెండింగ్ అయ్యాయి.
(చదవండి: తెలుగులో నటించడానికి రెడీ: దుషారా విజయన్)
పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్న తంగలాన్ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంది. అయితే ఇటీవల షూటింగ్‌లో విక్రమ్ గాయాలపాలు కావడంతో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో షూటింగ్ నిలిచిపోయింది. విక్రమ్ పూర్తిగా కోలుకున్న తర్వాత తంగలాన్ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుందని చిత్రవర్గాలు పేర్కొన్నారు.
(చదవండి: కమల్ హాసన్ ఖాతాలో మరో అరుదైన అవార్డు )
కాగా ఈ చిత్రంలో విక్రం సరసన నటించిన అనుభవం గురించి నటి మాళవిక మోహన్ చెబుతూ.. తంగలాన్ చిత్రంకు సంబంధించినంత వరకు విక్రమ్ లేకపోతే తను ఈ ప్రయణాన్ని ఊహించుకోలేనని పేర్కొంది. ప్రతి సన్నివేశంలోనూ ఆయన తనకు ఎంతగానో సహకరించేవారు అని చెప్పింది. ఆయన తనే కాకుండా తన చుట్టూ ఉన్న వారంతా బాగా నటించాలని కోరుకునే నటుడు అని చెప్పింది. అలా తమలోని నటనను బయటికి తీసి ఉత్సాహపరిచే వారిని పేర్కొంది. విక్రమ్ సెట్‌లో ఎప్పుడు చాలా జాలీగా ఉంటూ కామెడీ చేస్తూ వాతావరణాన్ని ఆహ్లాదంగా మారుస్తారని నటి మాళవిక మోహన్ చెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment