ప్రస్తుతం నిర్మాణంలో వున్న క్రేజీ తమిళ చిత్రాల్లో తంగలాన్ ఒకటి. హీరో విక్రమ్, దర్శకుడు పా.రంజిత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న వినూత్న కథా చిత్రమిది. హీరోయిన్ మాళవికా మోహన్, పార్వతి, పశుపతి, డేనియల్ కాల్టకిరోన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో అనూహ్యంగా విక్రమ్ ప్రమాదానికి గురికావడంతో షూటింగ్‌కు అంతరాయం కలిగింది.
అయితే తంగలాల్ చిత్ర షూటింగ్‌ను మరో 12 రోజులు నిర్వహిస్తే పూర్తవుతుందని దర్శకుడు పా.రంజిత్ వెల్లడించారు. జూన్ 15 తరువాత మళ్లీ షూటింగ్ మొదలు పెడతామని చెప్పారు. దీంతో వైద్య చికిత్స, విశ్రాంతి అనంతరం విక్రమ్ మళ్లీ ఫుల్ ఎనర్జీతో షూటింగ్‌కు సిద్ధమయ్యారు. తంగలాన్ చిత్ర షూటింగ్ శనివారం నుంచి చైన్నెలో జరుగుతోంది. ఈ విషయాన్ని మాళవికమోహన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో పేర్కొంది.
అందులో తాను ఇప్పుడు చైన్నెలో ఉన్నానని విక్రమ్‌తో కలిసి తంగలాన్ చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నానని తెలిపింది. మరో 20 రోజులు ఇక్కడే ఉంటానని కూడా తెలిపారు. ఇది కోలార్ గోల్డ్ తవ్వకాల్లోని కార్మికులు తమ అధికారం కోసం పోరాడే నేపథ్యంలో సాగే కథా చిత్రం అన్నది తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి తెరపైకి రానున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment