
కోలీవుడ్ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రస్తుతం తంగలాన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ఆరతి పాత్రలో మెప్పించనుంది. మూవీ రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్లతో బిజీగా ఉంది ముద్దుగుమ్మ. హీరో విక్రమ్‌తో కలిసి వరుసగా టూర్లు చేస్తోంది. ఈ సందర్భంగా అభిమానులతో ఆస్క్‌మాళవిక అనే అంటూ ట్విటర్ వేదికగా ఇంటరాక్షన్ నిర్వహించింది.
ఈ సందర్భంగా ఓ అభిమాని ఆసక్తికర ప్రశ్నవేశారు. 'మీరు తెలుగు ట్వీట్స్‌కు రిప్లై ఇవ్వడం లేదు మేడమ్.. ఎనీవే తంగలాన్ హిట్ అవ్వాలని ఆల్ ది బెస్ట్' అంటూ పోస్ట్ చేసింది. దీనికి మాళవిక బదులిస్తూ..' అది నిజం కాదండి. నాకు అత్యంత సన్నిహితమైన మిత్రుల్లో కొందరు తెలుగువారు కూడా ఉన్నారు. నాకు తెలుగు వాళ్లంటే చాలా ఇష్టం.. అందుకే నేను ఇప్పుడు తెలుగులో కూడా సినిమా చేస్తున్నా. మీరు నా పట్ల చాలా ప్రేమ చూపిస్తున్నారు' అంటూ రిప్లై ఇచ్చింది. అంతే కాకుండా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు మాళవిక సమాధానాలిచ్చింది. విక్రమ్ హీరోగా పా రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
Deiii not true! Some of my closest friends are Telugu! I love Telugu people..that’s why only no I’m doing a film there now ☺️ you guys give me sooo much love 🥰 https://t.co/rV2dtVMyRR
— Malavika Mohanan (@MalavikaM_) August 11, 2024