Chiyaan Vikram Thangalaan Movie Shooting Wrapped Up - Sakshi
Sakshi News home page

Thangalaan Movie: అద్భుతమైన జర్నీ.. ఎన్నో అనుభవాలు.. విక్రమ్‌ పోస్ట్‌ వైరల్‌

Published Thu, Jul 6 2023 2:23 PM | Last Updated on Thu, Jul 6 2023 2:46 PM

Chiyaan Vikram Thangalaan Wrapped up Shoot - Sakshi

టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీగా మారిన చిత్రం తంగలాన్‌. ఈ సినిమాలో చియాన్‌ విక్రమ్‌ నట విశ్వరూపం చూపించారని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. పార్వతీ, మాళవిక మోహన్‌ కథానాయికలుగా నటిస్తున్న ఇందులో నటుడు పశుపతి, ముత్తుకుమార్‌, హరికృష్ణన్‌, ప్రీతి, అర్జున్‌ ప్రభాకరన్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి పా.రంజిత్‌ దర్శకుడు. ఈయన చిత్రాలు చాలా భిన్నంగా సామాజిక పరమైన అంశాలతో ముడిపడి ఉంటాయి. పా.రంజిత్‌, విక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తొలి చిత్రం ఇది.

జ్ఞానవేల్‌ రాజా స్టూడియో గ్రీన్‌, పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని, కిశోర్‌కుమార్‌ చాయాగ్రహణం అందిస్తున్నారు. కోలార్‌ బంగారు గనుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఆది నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఇందులో నటుడు విక్రమ్‌ గెటప్‌ సినిమాపై హైప్‌ను పెంచుతోంది. ఇంతకు ముందెప్పుడూ చూడనటువంటి ఆయన నటనను తంగలాన్‌ చిత్రంలో చూస్తారని చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.

విక్రమ్‌ గెటప్‌ చూస్తేనే తంగలాన్‌ చిత్రం కచ్చితంగా కొత్తగా ఉంటుందని అనిపిస్తోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయింది. ఈ విషయాన్ని విక్రమ్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. 'తంగలాన్‌ చిత్రీకరణ పూర్తైంది. ఇది అద్భుతమైన ప్రయాణం. ఈ జర్నీలో మంచి వ్యక్తులతో కలిసి పని చేశాను. నటుడిగా నాకు మంచి అనుభవాలు కూడబెట్టుకున్నాను. మొదటి ఫోటో షూటింగ్‌ ప్రారంభానికి ముందు తీసినది కాగా మరొకటి 118 రోజుల షూటింగ్‌ పూర్తి చేసుకున్నాక తీసిన ఫోటో. ఈ సినిమాలో నన్ను భాగం చేసిన దర్శకుడు రంజిత్‌కు కృతజ్ఞతలు' అని రాసుకొచ్చాడు. ఈ పోస్ట్‌ ప్రస్తుతం వైరల్‌గా మారింది.

చదవండి: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement