చియాన్ విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘తంగలాన్’ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీరియాడికల్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహించాడు. పార్వతి తిరువోతు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోయినా.. పా. రంజిత్ ఓ కొత్త ప్రపంచాన్ని తెరపై చూపించాడని అందరూ ప్రశంసిస్తున్నారు.
(చదవండి: ‘తంగలాన్’ మూవీ రివ్యూ)
ఇక విక్రమ్ నటన గురించి ప్రత్యేకంగా చర్చిస్తున్నారు. తంగలాన్ పాత్రలో ఆయనను తప్పా ఇంకెవరినీ ఊహించుకోలేమని పేర్కొంటున్నారు. విజువల్స్, మ్యూజిక్ బాగున్నాయి కానీ.. కథనమే సాగదీతగా ఉందని అంటున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఓటీటీ వివరాలను వెతికే పనిలో పడ్డారు నెటిజన్స్.
రెండు నెలలు ఆగాల్సిందే..
తంగలాన్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళ్‌తో పాటు మొత్తం ఐదు భాషల్లో కలిపి రూ. 35 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే సినిమా థియేటర్స్‌లో విడుదలైన ఎనిమిది వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ లెక్కన అక్టోబర్ రెండో వారంలో తంగలాన్ ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సినిమాలను థియేటర్స్‌లో చూస్తేనే బాగుంటుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment