కొరియర్ బాయ్ కష్టాలు | Nithin courierboy kalyan release Problems | Sakshi
Sakshi News home page

కొరియర్ బాయ్ కష్టాలు

Published Sun, Sep 13 2015 9:38 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 AM

కొరియర్ బాయ్ కష్టాలు

కొరియర్ బాయ్ కష్టాలు

సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్న తరువాత కూడా నితిన్ కు కష్టాలు తప్పడం లేదు. చాలా కాలం తరువాత మంచి మార్కెట్ సొంతం చేసుకున్న నితిన్ తను హీరోగా నటించిన 'కొరియర్బాయ్ కళ్యాణ్' మూవీ రిలీజ్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాదాపు రెండేళ్లకు పైగా ఆలస్యం అయిన ఈ సినిమా ఫైనల్గా సెప్టెంబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతుంది.

రిలీజ్ డేట్ అనౌన్స్ అయినా నితిన్ కష్టాలు మాత్రం తీరినట్టుగా కనిపించటం లేదు. గ్యాప్ దొరికింది కదా అని సినిమా రిలీజ్ను ప్లాన్ చేసుకుంటే అదే సమయంలో రిలీజ్కు రెడీ అవుతున్న రెండు డబ్బింగ్ సినిమాలు నితిన్ మార్కెట్ను ఎఫెక్ట్ చేసేలా కనిపిస్తున్నాయి. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న లేడి ఓరియంటెడ్ ఫిలిం 'మయూరి'తో పాటు జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ 'త్రిష లేదా నయనతార' సినిమాలు సెప్టెంబర్ 17న రిలీజ్ అవుతున్నాయి.

'డార్లింగ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జివి ప్రకాష్ 'త్రిష లేదా నయనతార' సినిమాతో తెలుగు మార్కెట్ మీద దృష్టిపెట్టాడు. హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నయనతార 'మయూరి' సినిమాతో భారీ ఓపెనింగ్స్ మీద కన్నేసింది. ఈ రెండు సినిమాల రిలీజ్లతో మరోసారి ఆలోచనలో పడ్డాడు నితిన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement