mayuri
-
గ్యాంగ్ నేపథ్యంలో..
శివ, మణికాంత్, మయూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దాస్ గ్యాంగ్’. చిరంజీవి రాళ్ళబండి దర్శకత్వంలో మమతా రాళ్లబండి నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గ్యాంగ్ నేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి.. వాటికి పూర్తి భిన్నంగా మా చిత్రం ఉంటుంది. శివ, మణికాంత్ల పాత్రలు హైలెట్‌గా నిలుస్తాయి. హిందీలో గుర్తింపు తెచ్చుకున్న మయూరి మా సినిమాతో తెలుగులో పరిచయం అవుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: గౌస్ బాషా. -
వరదసాయంలో శానిటరీ ప్యాడ్స్ ఎక్కడ?!
ప్రశ్నించడంలోనే ప్రగతి ఉంది. ప్రశ్నిస్తేనే పరిష్కారం ఉందని నమ్ముతుంది మయూరి భట్టాచార్జీ. అస్సాంలోని లక్షాలాది మహిళల తరపున తన గళం విప్పుతోంది. విషయం ఏంటంటే.. అస్సాంలో ప్రతీ యేటా వరద తాకిడి ఉదృతంగా ఉంటుంది. ఎన్నో ప్రాంతాలు జలమయం అవుతూనే ఉంటాయి. లక్షలాది మంది నిరాశ్రయులు అవుతుంటారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందించే వరద సాయంలో నిత్యావసరాలు ప్రజలకు అందుతుంటాయి. అయితే, ఆ జాబితాలో లక్షలాది మంది మహిళలు ఎదుర్కొనే నెలసరి సమస్యకు శానిటరీ ప్యాడ్స్ ఉండితీరాల్సిందే అని రాష్ట్రప్రభుత్వాన్ని కోరుతోంది మయూరి. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ‘ఛేంజ్’(change.org)వెబ్సైట్ ద్వారా అస్సాం మహిళల తరపున పిటిషన్ దాఖలు చేసింది. దీనికి ఇప్పటి వరకు దాదాపు లక్ష మంది మయూరి భట్టాచార్జీకి సపోర్టర్స్‌గా చేరారు. మయూరి భట్టాచార్జీ ప్యాడ్స్ లేకపోవడం సమస్య కాదా..! అస్సాంలోని తేజ్‌పూర్‌కు చెందిన భట్టాచార్జీ విపత్తు సమయంలో ఆదుకునేవారికి జాబితాలో శానిటరీ ప్యాడ్లను చేర్చాలని విదేశాంగ మంత్రి హేమంత్ బిస్వా శర్మను కోరారు. మహిళలకు సహాయ శిబిరాలలో స్థానం ఇచ్చినప్పుడు, వారికి శానిటరీ ప్యాడ్ల సౌకర్యం ఉండటం లేదు. దీని వల్ల మహిళలు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ఆగస్టు 21 న ప్రచురించిన రోజువారీ వరద నివేదిక ప్రకారం, అస్సాంలో వరదలు 30 జిల్లాల్లో 56.9 లక్షలకు పైగా ప్రజలను ప్రభావితం చేశాయి. ఒక్క వస్త్రమూ శుభ్రంగా ఉండదు.. కార్యకర్త మయూరి భట్టాచార్జీ రిలీఫ్ కిట్లలో శానిటరీ ప్యాడ్లను చేర్చాలని ఛేంజ్ ద్వారా పిటిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మయూరి మాట్లాడుతూ –‘ప్రతి యేటా అస్సాంలో వరదలతో బాధపడుతున్న లక్షలాది మంది బాలికలు, మహిళల తరపును నేను ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇక్కడ వరద నీరు వచ్చినప్పుడు, ఇంట్లో ఒక్క వస్త్రం కూడా శుభ్రంగా, పొడిగా ఉండదు. ఈ మహిళలకు సహాయ శిబిరంలో స్థానం ఇచ్చినప్పుడు, వారికి శానిటరీ ప్యాడ్ల సౌకర్యం లేదు. అలాగే టాయిలెట్ల నిర్వహణ సరిగ్గా ఉండదు. ఇలాంటప్పుడు ఎంత వ్యధ.. ఈ సమస్యను అర్ధం చేసుకోరేంటి. ఈ వరదలతో మహిళలు అన్ని సమస్యలతో పాటు, శానిటరీ ప్యాడ్లు లేకపోవడం అనే ప్రధాన సమస్యనూ ఎదుర్కొంటున్నారు. ఇది ఎందుకు సమస్యగా ప్రభుత్వాలకు పట్టడం లేదు. వరదల కారణంగా కాలాలు ఆగవు. శానిటరీ ప్యాడ్లను రిలీఫ్ మెటీరియల్ జాబితాలో చేర్చడానికి మనం ఎన్నాళ్లు ఎదురుచూడాలి?!’ అని ప్రశ్నిస్తోంది మయూరి భట్టాచార్జీ. ఈ విషయమ్మీద నిరంతరం రాష్ట్ర మంత్రికి ఇ–మెయిల్ చేస్తూనే ఉంది. కానీ స్పందన రావడంలేదు. దీంతో మయూరి ఈ పిటిషన్‌ను ప్రారంభించింది. త్వరలోనే దీనికి రాష్ట్రప్రభుత్వం నుంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. విపత్తుల సమయాల్లో మహిళల నెలసరి సమస్యనూ పరిగణనలోకి తీసుకోవాలి అని మయూరి భట్టాచార్జీ చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆలోచింపజేస్తుంది. -
అనుమానాస్పద మృతి.. కొంతకాలంగా ఫోన్లో
చిలకలగూడ: అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని మృతి చెందిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... రైల్వే ఉద్యోగి గట్టు లక్ష్మీనారాయణ చిలకలగూడ రైల్వే క్వార్టర్స్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తున్నాడు. కొంతమేర శిథిలమైన మూడు అంతస్థుల భవనంలో లక్ష్మీనారాయణ కుటుంబం మాత్రమే ఉంటోంది. అతని కుమార్తె మయూరి(18) స్థానిక రైల్వే కళాశాలలో ద్వితీయ ఇంటర్ చదువుతోంది. కొంతకాలంగా ఎవరితోనో ఎక్కువ సమయం ఫోన్లో మాట్లాడుతున్న తన కుమార్తె, ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి కనిపించడం లేదని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిందని భావిస్తున్న రోజు రాత్రి 9.30 గంటలకు ఆమె ఫోన్ ఎంగేజ్ వచ్చిందని, కొంత సమయం తర్వాత మరోసారి కాల్ చేస్తే నాట్ రీచబుల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు లక్ష్మీనారాయణ ఉంటున్న భవనం సమీపంలో ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా, ఆ మృతదేహం మయూరిదేనని వారు గుర్తించారు. భవనం టెర్రస్ పైన పిట్టగోడ కేవలం మూడు అడుగులు మాత్రమే ఉందని, ఫోన్ మాట్లాడుతూ ఆమె ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెంది ఉంటుందని ప్రాథమిక దర్యాప్తులో తేలినప్పటికీ.., మృతురాలి చెప్పులు టెర్రస్‌పైనే ఉండటం, మృత దేహానికి కొద్ది దూరంలో పగిలిపోయిన సెల్‌ఫోన్ పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టామని చిలకలగూడ ఇన్స్పెక్టర్ బాలగంగిరెడ్డి తెలిపారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతి అదృశ్యం చాంద్రాయణగుట్ట: కిరాణ దుకాణానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయిన సంఘటన ఛత్రినాక పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ మోజీరాం సమాచారం మేరకు... లక్ష్మీనగర్‌కి చెందిన వీరస్వామి కుమార్తె శ్వేత(22) ఈ నెల 28న ఉదయం స్థానికంగా ఉన్న కిరాణ దుకాణానికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ప్రాంతాలలో వెతికినా ప్రయోజనం లేదు. ఈ విషయమై శ్వేత పెద్దమ్మ కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆచూకీ తెలిసిన వారు ఫోన్: 94906 16500లో సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు. -
గాయకుడు రఘు, డ్యాన్సర్ మయూరి విడాకులు
యశవంతపుర : కన్నడ గాయకుడు రఘుదీక్షిత్, డ్యాన్సర్ మయూరి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశారు. కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు ఉన్నాయి. ఏడాదిన్నర క్రితం రఘు దీక్షిత్‌పై మీటూ ఆరోపణలు వచ్చాయి. దీంతో వీరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. కొంతకాలంగా వీరు వేర్వురుగా ఉంటున్నారు. పెద్దలు నిర్ణయం మేరకు సామరస్యంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఇద్దరు విడాలకుల కోసం కోర్టులు కేసు దాఖలు చేశారు. న్యాయమూర్తి ఆరు నెలల పాటు అంటే డిసెంబర్‌కు వాయిదా వేశారు. -
పాలమూరువాసుల్ని అలరిస్తున్న మయూరి పార్క్
-
‘మయూరి’ ఉపేంద్రవర్మ కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : మయూరి పాన్‌షాప్‌ల యజమాని కుమారుడు ఉపేంద్రవర్మ చేతిలో మోసపోయానంటూ కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు (సాఫ్ట్వేర్ ఇంజినీర్) సిటీ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కలిశారు. తనకు జరుగుతున్న అన్యాయంతో పాటు తనకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో షికారు చేస్తున్న పుకార్లపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. అదనపు సీపీ (నేరాలు) షికా గోయల్‌ను సైతం బాధితురాలు కలిశారు. తన అనుమతి లేకుండా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఈమె ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం విదితమే. వీటిని పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఇది జరిగిన తర్వాత ఉపేంద్ర వర్మ సంబంధీకులు బాధితురాలికి వ్యతిరేకంగా మరికొన్ని ఫొటోలు విడుదల చేశారు. దీనిపై ఆమె పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు: బాధితురాలు ‘ఉపేందర్‌తో గతేడాది సెప్టెంబర్ 13న వివాహం జరిగింది. నన్ను పెళ్లి చేసుకొని మోసం చేశాడు. న్యాయం కోసమే వారి ఇంటికి వెళ్లాను. ఆయన భార్యతో ఎలాంటి గొడవ పడలేదు. వారు ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసి నన్ను అప్రతిష్టపాలు చేస్తున్నారు. నేను అనేక మంది నుంచి డబ్బు తీసుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు వాస్తవాలు కావు. నేను రూ. 40 లక్షలు తీసుకున్నట్లు ఆధారాలు ఉంటే బయటపెట్టాలి. వాళ్లు విడుదల చేసిన ఫొటోలు నా కాలేజ్ ఫ్రెండ్‌తో దిగినవి. అతడితో నాకు మొదట్లో అఫైర్ ఉండేది. ఆ తర్వాత మనస్ఫర్థలు రావడంతో విడిపోయాం. కాలేజ్ ఫ్రెండ్ అనే ఉద్దేశంతో అతనితో చనువుగా ఉన్నా’ అని బాధితురాలు పేర్కొన్నారు. -
ప్లీజ్ దీపిక.. ఒక్కసారి ఇది చూడు
సాక్షి, సినిమా : వివాదాలు, ఆందోళనలు పద్మావత్‌ను అడ్డుకోలేకపోయాయి. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలోని ఘూమర్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అప్పట్లో అంతే వివాదాస్పదం కూడా అయ్యింది. కర్ణిసేన పాటపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో సెన్సార్ ప్యానెల్ సూచనల మేరకు దీపిక నడుమును కవర్ చేస్తూ మరో వర్షన్ పాటను మేకర్లు విడుదల చేశారు. ఇక ఇప్పుడు చిత్రం విడులయ్యాక ఘూమర్ పాట దుమ్మురేపుతోంది. స్కేటింగ్ ఛాంపియన్ ‘మయూరి భండారి’ ఘూమర్ పాటకు ప్రదర్శన ఇచ్చారు. మంచు కోర్టులో ఆమె చేసిన ప్రదర్శనకు అద్భుతమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ‘‘నా ఈ ప్రదర్శన పద్మావత్ చిత్రానికి అంకితం. ఒక రాజస్థానీగా గర్వంతో ఈ పాటపై ప్రదర్శన ఇచ్చాను’’ అని ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుండగా.. దీపికను ఒక్కసారి ఆ వీడియోను తిలకించమంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ఎన్బీఏ మ్యాచ్ సందర్భగా అపర్ణ యాదవ్ ఈ పాటపై ఇచ్చిన ప్రదర్శన విదేశాల్లో ఈ పాట క్రేజ్‌ను ప్రపంచం మొత్తం విస్తరింపజేసింది. ఈ ఏడాది ఛార్ట్బస్టర్లో నిలిచిన ఘూమర్ పాట.. యూట్యూబ్‌లోనూ దూసుకుపోతోంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. -
ప్లీజ్ దీపిక.. ఒక్కసారి ఇది చూడు
-
మయూరిలో నాని చేయాల్సింది!
‘‘దాదాపు ఏడేళ్ల క్రితం నేను ‘చందమామ’ నిర్మించాను. అప్పుడు చాలామంది ఫోన్లు చేసి అభినందించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు అందించినా, పెద్దగా అప్లాజ్ రాలేదు. కానీ, ఇటీవల విడుదల చేసిన ‘మయూరి’కి అభినందనలు లభిస్తున్నాయి’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు. నయనతార కథానాయికగా తమిళంలో రూపొందిన ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ‘మాయ’ను తెలుగులోకి ‘మయూరి’ పేరుతో ఆయన విడుదల చేశారు. ‘‘ఈ సక్సెస్ఫుల్ మూవీని తెలుగులో విడుదల చేసే అవకాశం ఇచ్చిన తమిళ నిర్మాతలు ప్రభు, ప్రకాశ్లకు ధన్యవాదాలు. కథ మీద నమ్మకంతో నయనతార ఈ చిత్రం చేశారు’’ అని కల్యాణ్ చెప్పారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ అద్భుతంగా తీశారని ప్రభు అన్నారు. ‘‘ఈ కథను మొదట నానీకి చెప్పారు. కొత్తవాళ్లు నటిస్తే బాగుంటుందని ఆయన అనడంతో హీరోగా నాకు అవకాశం దక్కింది’’ అని ఆరి చెప్పారు. -
కొత్త సినిమాలు గురూ!
భయ మయూరి ఇప్పటివరకూ అగ్ర హీరోలతో ఆడిపాడి త న అందచందాలతో అభిమానులను అలరించిన నయనతార తొలిసారిగా తన రూట్ మార్చి నటించిన హారర్ చిత్రం ఇది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయడం మరో ప్రత్యేకత. అశ్విన్ శరవణన్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో భయపెట్టిందా? అసలు మాయ ఎవరు? మయూరి ఎవరు? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథ: మాయ (నయనతార), అర్జున్ (ఆరి) ఇద్దరికీ సినిమాలంటే ప్యాషన్. మాయ అప్పటికే జూనియర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తుంటుంది. అర్జున్‌కి దర్శకుడు కావాలని కోరిక. సినిమాల పట్ల ఉన్న ఈ కామన్ ఇంట్రెస్ట్ ఇద్దర్నీ దగ్గర చేస్తుంది. ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటారు. కాపురం హాయిగా సాగుతుంది. మాయ ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్. మాయను కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేయించి, డబ్బులు సంపాదించాలనే ఆశతో ఉన్న అర్జున్‌కు ఇది రుచించదు. అబార్షన్ చేయించుకోమని ఆమెను ఒత్తిడి చేస్తాడు. ఈ విషయంపై ఇద్దరూ గొడవపడి విడిపో తారు. అలా ఓ ఆసరా కోల్పోయి, డబ్బుల్లేక నానా అవస్థలు పడుతుంది మాయ. ఇంతలో ఆమె స్నేహితురాలు స్వాతి ‘చీకటి’ అనే సినిమా తీస్తుంది. ఈ సినిమాని ఒంటరిగా చూసి భయపడని వారికి 5 లక్షల రూపాయలు బహుమతి అని ప్రకటిస్తారు ఆ చిత్ర నిర్మాతలు. మాయ ఆ సినిమా చూడటానికి సిద్ధపడుతుంది. ఈ సినిమాలోనే మాయ తన జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు తెలుసుకుంటుంది. అ నిజాలేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కేవలం 35 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. సత్యం సూర్యన్ కెమెరా పనితనం ఈ సినిమాకు ప్లస్. ఈ సినిమాలో ఎక్కువ భాగం నెట్ మోడ్‌లో సాగుతుంది. ఓ చోట కలర్... మరో చోట బ్లాక్ అండ్ వైట్ వేరియేషన్స్‌తో ఈ సినిమాకు కొత్త అందం తీసుకొచ్చారు.. ఈ మధ్య వచ్చిన హారర్ సినిమాల తరహాలో కామెడీని ఎక్కడా చొప్పించకుండా మొత్తం హారర్ కంటెంట్ మీదే దర్శకుడు దృష్టిపెట్టాడు. కథలో ఎన్ని లోటుపాట్లున్నా దర్శకుడు అశ్విన్ భయపెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. -
భయపడనివారికి 5 లక్షలు!
ఇన్నాళ్లూ తన అందాలతో ఆకట్టుకున్న నయనతార తొలిసారిగా భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆమె తమిళంలో నటించిన హారర్ చిత్రం ‘మాయ’ తెలుగులో ‘మయూరి’గా రానుంది. అశ్విన్ శరవణన్ డెరైక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మాత సి.కల్యాణ్ తెలుగులో అందిస్తు న్నారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ఇందులో ఇద్దరు నయన తారలుంటారు. ఒకరు మయూరి, ఇంకొకరు మాయ. ఎవరైనా ఈ చిత్రాన్ని ఒంటరిగా చూస్తూ, బీపీ పెరగన ట్లయితే, 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం. ఈ సినిమా చూస్తే, ఒక ఇంగ్లీషు సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. ఇందులో నయనతార ఒక బిడ్డకు తల్లిగా నటించారు. సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటూ, అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాన్ ఎథన్ యోహాన్, ఛాయా గ్రహణం: సత్యన్ సూర్యన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోనేరు కల్పన. -
కొరియర్ బాయ్ కష్టాలు
సక్సెస్ఫుల్ హీరో అనిపించుకున్న తరువాత కూడా నితిన్ కు కష్టాలు తప్పడం లేదు. చాలా కాలం తరువాత మంచి మార్కెట్ సొంతం చేసుకున్న నితిన్ తను హీరోగా నటించిన 'కొరియర్‌బాయ్ కళ్యాణ్' మూవీ రిలీజ్ విషయంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దాదాపు రెండేళ్లకు పైగా ఆలస్యం అయిన ఈ సినిమా ఫైనల్‌గా సెప్టెంబర్ 17న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ అయినా నితిన్ కష్టాలు మాత్రం తీరినట్టుగా కనిపించటం లేదు. గ్యాప్ దొరికింది కదా అని సినిమా రిలీజ్‌ను ప్లాన్ చేసుకుంటే అదే సమయంలో రిలీజ్‌కు రెడీ అవుతున్న రెండు డబ్బింగ్ సినిమాలు నితిన్ మార్కెట్‌ను ఎఫెక్ట్ చేసేలా కనిపిస్తున్నాయి. నయనతార లీడ్ రోల్లో నటిస్తున్న లేడి ఓరియంటెడ్ ఫిలిం 'మయూరి'తో పాటు జీవి ప్రకాష్ హీరోగా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ 'త్రిష లేదా నయనతార' సినిమాలు సెప్టెంబర్ 17న రిలీజ్ అవుతున్నాయి. 'డార్లింగ్' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న జివి ప్రకాష్ 'త్రిష లేదా నయనతార' సినిమాతో తెలుగు మార్కెట్ మీద దృష్టిపెట్టాడు. హీరోయిన్ గా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న నయనతార 'మయూరి' సినిమాతో భారీ ఓపెనింగ్స్ మీద కన్నేసింది. ఈ రెండు సినిమాల రిలీజ్‌లతో మరోసారి ఆలోచనలో పడ్డాడు నితిన్.