భయపడనివారికి 5 లక్షలు! | Bring Nayantara, No Need Of 5 Lakhs | Sakshi
Sakshi News home page

భయపడనివారికి 5 లక్షలు!

Published Tue, Sep 15 2015 10:39 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

భయపడనివారికి 5 లక్షలు!

భయపడనివారికి 5 లక్షలు!

ఇన్నాళ్లూ తన అందాలతో ఆకట్టుకున్న నయనతార తొలిసారిగా భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆమె తమిళంలో నటించిన హారర్ చిత్రం ‘మాయ’ తెలుగులో ‘మయూరి’గా రానుంది. అశ్విన్ శరవణన్ డెరైక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మాత సి.కల్యాణ్ తెలుగులో అందిస్తు న్నారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది  సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ఇందులో ఇద్దరు నయన తారలుంటారు. ఒకరు మయూరి, ఇంకొకరు మాయ.

ఎవరైనా ఈ చిత్రాన్ని ఒంటరిగా చూస్తూ, బీపీ పెరగన ట్లయితే, 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం. ఈ సినిమా చూస్తే, ఒక ఇంగ్లీషు సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. ఇందులో నయనతార ఒక బిడ్డకు తల్లిగా నటించారు. సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటూ, అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాన్ ఎథన్ యోహాన్, ఛాయా గ్రహణం: సత్యన్ సూర్యన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోనేరు కల్పన.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement