Producer C.Kalyan
-
దిల్రాజును తప్పుదారి పట్టించారు, దుష్ప్రచారం చేస్తున్నారు : సి. కల్యాణ్
సినిమా షూటింగ్స్ నిలిపివేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు జరగలేదని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ అన్నారు. దిల్‌రాజు, సి. కల్యాణ్ ప్యానెల్ వేరు వేరే కాదని, నిర్మాతలు కొంతమంది దిల్ రాజును తప్పుదారి పట్టించారని ఆరోపించారు. దిల్ రాజుతో తనను పోలుస్తూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఇప్పటివరకు సుమారు 80 చిన్న సినిమాలు తీశానని, ఎవరిని మోసం చేయలేదని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. చిన్న సినిమా లేకపోతే సినీ పరిశ్రమ మూతపడుతుంది. మోనోపలి వల్ల పరిశ్రమ నాశనం అవుతుంది. ప్రొడ్యూసర్ గిల్ట్ మాఫియా వల్ల మొత్తం నాశనం అవుతుంది. గిల్డ్‌లో 27 మంది సభ్యులున్నారు. నిర్మాతల మండలిలో 1200 మంది సభ్యులున్నారు. గిల్డ్ సభ్యుల సమస్యలనే నిర్మాతల మండలి పరిష్కరించింది. 2019లో మేం వచ్చిన దగ్గరి నుంచి ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. ఎవరు సంస్థకు న్యాయం చేస్తారో వారిని గెలిపించుకోండి. నేను ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. కానీ 30 సంవత్సరాల అనుబంధంతో నిర్మాతల మండలిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకొచ్చా. ప్రొడ్యూసర్ గిల్డ్ , నిర్మాతల మండలిని కలిపేందుకు ప్రయత్నం చేశా. అధ్యక్ష పదవి మోజులో నా ప్రయత్నాన్ని నీరుగార్చారు అంటూ చెప్పుకొచ్చారు. కాగా రేపు(ఫిబ్రవరి 19)న తెలుగు నిర్మాతల మండలి ఎలక్షన్స్ జరగనున్నా సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సి. కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. -
భయపడనివారికి 5 లక్షలు!
ఇన్నాళ్లూ తన అందాలతో ఆకట్టుకున్న నయనతార తొలిసారిగా భయపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఆమె తమిళంలో నటించిన హారర్ చిత్రం ‘మాయ’ తెలుగులో ‘మయూరి’గా రానుంది. అశ్విన్ శరవణన్ డెరైక్ట్ చేసిన ఈ చిత్రాన్ని నిర్మాత సి.కల్యాణ్ తెలుగులో అందిస్తు న్నారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది సి.కల్యాణ్ మాట్లాడుతూ ‘‘ఇందులో ఇద్దరు నయన తారలుంటారు. ఒకరు మయూరి, ఇంకొకరు మాయ. ఎవరైనా ఈ చిత్రాన్ని ఒంటరిగా చూస్తూ, బీపీ పెరగన ట్లయితే, 5 లక్షల రూపాయలు బహుమతిగా ఇస్తాం. ఈ సినిమా చూస్తే, ఒక ఇంగ్లీషు సినిమా చూసిన ఫీల్ కలుగుతుంది. ఇందులో నయనతార ఒక బిడ్డకు తల్లిగా నటించారు. సినిమా థ్రిల్లింగ్‌గా ఉంటూ, అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది ’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: రాన్ ఎథన్ యోహాన్, ఛాయా గ్రహణం: సత్యన్ సూర్యన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోనేరు కల్పన.