దీపికా పదుకొనే (తాజా ఫోటో)
సాక్షి, సినిమా : వివాదాలు, ఆందోళనలు పద్మావత్‌ను అడ్డుకోలేకపోయాయి. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలోని ఘూమర్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అప్పట్లో అంతే వివాదాస్పదం కూడా అయ్యింది. కర్ణిసేన పాటపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో సెన్సార్ ప్యానెల్ సూచనల మేరకు దీపిక నడుమును కవర్ చేస్తూ మరో వర్షన్ పాటను మేకర్లు విడుదల చేశారు.
ఇక ఇప్పుడు చిత్రం విడులయ్యాక ఘూమర్ పాట దుమ్మురేపుతోంది. స్కేటింగ్ ఛాంపియన్ ‘మయూరి భండారి’ ఘూమర్ పాటకు ప్రదర్శన ఇచ్చారు. మంచు కోర్టులో ఆమె చేసిన ప్రదర్శనకు అద్భుతమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ‘‘నా ఈ ప్రదర్శన పద్మావత్ చిత్రానికి అంకితం. ఒక రాజస్థానీగా గర్వంతో ఈ పాటపై ప్రదర్శన ఇచ్చాను’’ అని ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతుండగా.. దీపికను ఒక్కసారి ఆ వీడియోను తిలకించమంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
కాగా, ఎన్‌బీఏ మ్యాచ్ సందర్భగా అపర్ణ యాదవ్ ఈ పాటపై ఇచ్చిన ప్రదర్శన విదేశాల్లో ఈ పాట క్రేజ్‌ను ప్రపంచం మొత్తం విస్తరింపజేసింది. ఈ ఏడాది ఛార్ట్‌బస్టర్‌లో నిలిచిన ఘూమర్ పాట.. యూట్యూబ్‌లోనూ దూసుకుపోతోంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment