Skating champion
-
జపాన్ స్కేటర్ మోనే చిబా అద్భుత విన్యాసాలు (ఫోటోలు)
-
మృత్యుంజయుడు: స్కేటింగ్‌లో అ‘జయ్’ పతకాల పంట..
గుంటూరు వెస్ట్ ( క్రీడలు): పేదరికం వెన్నాడుతున్నా.. వెరవకుండా కఠోర సాధనతో స్కేటింగ్‌లో మెరిశాడు ఆ యువకుడు. తక్కువ సమయంలోనే జాతీయ స్థాయిలో పతకాలు సాధించాడు. ఓ రోడ్డు ప్రమాదంలో మృత్యు అంచుల వరకూ వెళ్లినా అజేయుడై కోలుకుని మళ్లీ స్కేటింగ్ రింక్‌లోకి ప్రవేశించాడు. ఇప్పుడు గిన్నిస్ రికార్డు దిశగా అడుగులు వేస్తున్నాడు. అతడే గుంటూరుకు చెందిన పెండ్యాల హనుమంత్ అజయ్‌కుమార్. ఇదీ కుటుంబ నేపథ్యం గుంటూరుకు చెందిన అజయ్ తండ్రి వెంకట గిరిధర్. చిల్లర కొట్టులో గుమాస్తా. తల్లి శ్రీనుకాదేవి గృహిణి. అజయ్ తొలినుంచి స్కేటింగ్‌లో సత్తాచాటాడు. గత ఫిబ్రవరిలో స్థానిక కలెక్టరేట్ రోడ్డులో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపు 20 రోజులు కోమాలోనే ఉన్నాడు. వైద్యుల కృషితో ఎట్టకేలకు 3 నెలల తర్వాత కోలుకున్నాడు. ఇక స్కేటింగ్‌కు పనికిరాడన్న డాక్టర్ల మాటలను చాలెంజ్‌గా తీసుకుని మళ్ళీ సాధన మొదలెట్టి పట్టు సాధించాడు. గిన్నిస్ రికార్డు కోసం తపన స్కేటింగ్‌లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కోసం అజయ్ ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. వారి అనుమతి మేరకు ఆదివారం గుంటూరులోని బి.ఆర్.స్టేడియంలో 128 మీటర్ల సర్కిల్‌ను ఒక్క గంటలో 120 సార్లు అంటే సుమారు 15 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించాడు. గిన్నిస్ రికార్డు నిర్వాహకులు ఇచ్చిన 14 కిలోమీటర్ల దూరం కంటే ఒక కిలోమీటరు ఎక్కు అధిగమించాడు. దీనిని వీడియోగా రికార్డు చేసి పంపించాడు. అజయ్ గత విజయాలు ►2010లో చిత్తూరు జిల్లా పుత్తూరులో జరిగిన నేషనల్ మీట్లో అండర్–17, మిక్సిడ్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు. ►2015–16లో మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 2వ స్టూడెంట్ ఒలింపిక్స్‌లో 100, 500, 1000 మీటర్ల రింక్ విభాగాల్లో 3 బంగారు పతకాలు ►2016–17లో మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో జరిగిన 3వ స్టూడెంట్ ఒలింపిక్స్‌లోనూ 100, 500, 1000 మీటర్ల రింక్ విభాగాల్లో 3 బంగారు పతకాలు. 8 రాష్ట్ర స్థాయి బంగారు పతకాలు సాధించాడు. చాలా మందికి రుణ పడి ఉన్నా ఈ రికార్డు చేరుకునే వరకు నాకు చాలా మంది అన్ని విధాలుగా సహకరించారు. వారి రుణం తీర్చుకోలేనిది. నేను పోటీల్లో పాల్గొంటూనే యువతకు శిక్షణనిస్తున్నా. జాతీయ స్థాయిలో శిక్షకుడిగా స్థిరపడాలనేది నా కోరిక. అప్పుడప్పుడు ఆరోగ్యం కొంత ఇబ్బందిపెడుతున్నా. ఏదైనా సాధించాలనే తపనే నన్ను ఈస్థాయికి చేర్చింది. – పెండ్యాల హనుమంత్ అజయ్ కుమార్, నేషనల్ స్కేటర్ చదవండి: Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు! -
ప్లీజ్ దీపిక.. ఒక్కసారి ఇది చూడు
సాక్షి, సినిమా : వివాదాలు, ఆందోళనలు పద్మావత్‌ను అడ్డుకోలేకపోయాయి. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలోని ఘూమర్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అప్పట్లో అంతే వివాదాస్పదం కూడా అయ్యింది. కర్ణిసేన పాటపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో సెన్సార్ ప్యానెల్ సూచనల మేరకు దీపిక నడుమును కవర్ చేస్తూ మరో వర్షన్ పాటను మేకర్లు విడుదల చేశారు. ఇక ఇప్పుడు చిత్రం విడులయ్యాక ఘూమర్ పాట దుమ్మురేపుతోంది. స్కేటింగ్ ఛాంపియన్ ‘మయూరి భండారి’ ఘూమర్ పాటకు ప్రదర్శన ఇచ్చారు. మంచు కోర్టులో ఆమె చేసిన ప్రదర్శనకు అద్భుతమంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ‘‘నా ఈ ప్రదర్శన పద్మావత్ చిత్రానికి అంకితం. ఒక రాజస్థానీగా గర్వంతో ఈ పాటపై ప్రదర్శన ఇచ్చాను’’ అని ఆమె పేర్కొన్నారు. ఆ వీడియో ఇప్పుడు నెట్లో వైరల్ అవుతుండగా.. దీపికను ఒక్కసారి ఆ వీడియోను తిలకించమంటూ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. కాగా, ఎన్బీఏ మ్యాచ్ సందర్భగా అపర్ణ యాదవ్ ఈ పాటపై ఇచ్చిన ప్రదర్శన విదేశాల్లో ఈ పాట క్రేజ్‌ను ప్రపంచం మొత్తం విస్తరింపజేసింది. ఈ ఏడాది ఛార్ట్బస్టర్లో నిలిచిన ఘూమర్ పాట.. యూట్యూబ్‌లోనూ దూసుకుపోతోంది. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో దీపికా పదుకొనే, షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌లు ప్రధాన పాత్రలు పోషించారు. -
ప్లీజ్ దీపిక.. ఒక్కసారి ఇది చూడు
-
శ్రీవిజ్ఞకు మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి శ్రీవిజ్ఞా రెడ్డి మెరిసింది. ఇందిరాపార్క్‌లోని అంతర్జాతీయ స్కేటింగ్ రింక్‌పై జరిగిన ఈ పోటీల్లో అండర్–13 బాలికల విభాగంలో శ్రీవిజ్ఞ స్వర్ణంతో పాటు రెండు కాంస్యాలను కైవసం చేసుకుంది. ఈ విజయంతో జాతీయ స్థాయి రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. ఈ పోటీల్లో సత్తా చాటిన కె. యశ్వంత్ (1 స్వర్ణం, 1 రజతం), జాహ్నవి (1 స్వర్ణం, 3 కాంస్యాలు), ఎం. నిత్యారెడ్డి (3 స్వర్ణాలు, 1 రజతం), రితేశ్ (1 స్వర్ణం, 2 రజతాలు)లు కూడా రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. తమిళనాడులోని చెన్నైలో జనవరి 27 నుంచి 31 వరకు ఈ జాతీయ చాంపియన్‌షిప్ జరుగుతుంది. -
మెరుగుపడుతున్నప్పటికీ...
గ్రెనోబుల్ (ఫ్రాన్స్): స్కీయింగ్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్న ఫార్ములావన్ దిగ్గజం మైకేల్ షుమాకర్ ఆరోగ్య పరిస్థితి స్వల్పంగా మెరుగుపడుతోందని అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్లు తెలిపారు. అయితే ఓవరాల్‌గా పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని, క్రితం రాత్రి తనకు రెండో శస్త్ర చికిత్స నిర్వహించినట్టు చెప్పారు. అత్యంత కీలకమైన ఈ చికిత్సకు ముందు డాక్టర్లు షుమాకర్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మాజీ చాంపియన్ కోమాలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ తను విషమస్థితిలోనే ఉన్నాడని, అయితే స్వల్పంగానైనా అతడు మెరుగుపడుతున్న తీరు ఆశ్చర్యంగా ఉందని, మున్ముందు పరిస్థితిపై మాత్రం అంచనాకు రాలేమని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ హెడ్ జీన్ ఫ్రాంకోయిస్ పయేన్ అన్నారు.