వివాదాలు, ఆందోళనలు పద్మావత్‌ను అడ్డుకోలేకపోయాయి. జనవరి 25న విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల సునామీతో విజయవంతంగా దూసుకుపోతోంది. ఇక ఈ చిత్రంలోని ఘూమర్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో.. అప్పట్లో అంతే వివాదాస్పదం కూడా అయ్యింది. కర్ణిసేన పాటపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో సెన్సార్ ప్యానెల్ సూచనల మేరకు దీపిక నడుమును కవర్ చేస్తూ మరో వర్షన్ పాటను మేకర్లు విడుదల చేశారు.