
శివ, మణికాంత్, మయూరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘దాస్ గ్యాంగ్’. చిరంజీవి రాళ్ళబండి దర్శకత్వంలో మమతా రాళ్లబండి నిర్మిస్తున్నారు. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘గ్యాంగ్ నేపథ్యంలో ఇప్పటివరకూ చాలా సినిమాలు వచ్చాయి.. వాటికి పూర్తి భిన్నంగా మా చిత్రం ఉంటుంది. శివ, మణికాంత్‌ల పాత్రలు హైలెట్‌గా నిలుస్తాయి. హిందీలో గుర్తింపు తెచ్చుకున్న మయూరి మా సినిమాతో తెలుగులో పరిచయం అవుతోంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ వెంకట్, కెమెరా: గౌస్ బాషా.