
శివ, రాజ్ కందుకూరి
శివ, ఉమయ జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఆకాశవాణి విశాఖపట్టణ కేంద్రం’. ‘జబర్దస్త్’ ఫేం సతీష్ బత్తుల ఈ చిత్రంతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సైన్స్ స్టూడియోస్‌పై మర్రిమేకల మల్లికార్జున్ నిర్మించిన ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘సతీష్ ఈ చిత్రకథను నాకు ముందే చెప్పాడు. మంచి పాయింట్‌తో తీస్తున్న ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని భావించా. ఈ రోజు పోస్టర్ చూస్తుంటే మరింత నమ్మకం కలిగింది.
మల్లికార్జున్‌గారు నిర్మాతగా చేస్తున్న తొలి చిత్రమిది. ఆయనకు మంచి పేరు, డబ్బు తెచ్చి పెట్టే చిత్రమవుతుంది’’ అన్నారు. ‘‘థ్రిల్లింగ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. సతీష్‌గారు సినిమాని చక్కగా తెరకెక్కించారు. ఓ మంచి సినిమాను నిర్మించడంలో నా బాధ్యతను చక్కగా నిర్వర్తించాను’’ అన్నారు మర్రిమేకల మల్లికార్జున్. ‘‘ఈ సినిమాతో దర్శకుడిగా మారడం ఆనందంగా ఉంది. మల్లికార్జున్‌గారి సపోర్ట్ లేకపోతే ఇంత దూరం రాగలిగేవాళ్లం కాదు. సినిమా చాలా బాగా వచ్చింది’’ అన్నారు సతీష్ బత్తుల. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, కెమెరా: ఆరీఫ్.
Comments
Please login to add a commentAdd a comment