మయూరిలో నాని చేయాల్సింది! | nani missed Mayuri movie chace | Sakshi

మయూరిలో నాని చేయాల్సింది!

Sep 25 2015 10:58 PM | Updated on Sep 3 2017 9:58 AM

మయూరిలో నాని చేయాల్సింది!

మయూరిలో నాని చేయాల్సింది!

దాదాపు ఏడేళ్ల క్రితం నేను ‘చందమామ’ నిర్మించాను. అప్పుడు చాలామంది ఫోన్లు చేసి అభినందించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు అందించినా,

‘‘దాదాపు ఏడేళ్ల క్రితం నేను ‘చందమామ’ నిర్మించాను. అప్పుడు చాలామంది ఫోన్లు చేసి అభినందించారు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలు అందించినా, పెద్దగా అప్లాజ్ రాలేదు. కానీ, ఇటీవల విడుదల చేసిన ‘మయూరి’కి అభినందనలు లభిస్తున్నాయి’’ అని నిర్మాత సి. కల్యాణ్ అన్నారు.

నయనతార కథానాయికగా తమిళంలో రూపొందిన ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ ‘మాయ’ను తెలుగులోకి ‘మయూరి’ పేరుతో ఆయన విడుదల చేశారు. ‘‘ఈ సక్సెస్‌ఫుల్ మూవీని తెలుగులో విడుదల చేసే అవకాశం ఇచ్చిన తమిళ నిర్మాతలు ప్రభు, ప్రకాశ్‌లకు ధన్యవాదాలు. కథ మీద నమ్మకంతో నయనతార ఈ చిత్రం చేశారు’’ అని కల్యాణ్ చెప్పారు. దర్శకుడు అశ్విన్ శరవణన్ అద్భుతంగా తీశారని ప్రభు అన్నారు. ‘‘ఈ కథను మొదట నానీకి చెప్పారు. కొత్తవాళ్లు నటిస్తే బాగుంటుందని ఆయన అనడంతో హీరోగా నాకు అవకాశం దక్కింది’’ అని ఆరి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement