లావణ్య ప్లేస్‌లో అర్జున్ రెడ్డి హీరోయిన్..!
తెలుగులో నాగచైతన్య, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 100% లవ్. రొమాటింక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు కోలీవుడ్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. చంద్రమౌళి తమిళ వెర్షన్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో చాలా రోజులుగా సస్పెన్స్ కొనసాగుతోంది.
ముందుగా హెబ్బా పటేల్ ను హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. కానీ చివరి నిమిషంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తుందంటూ ప్రకటించారు. అయితే లావణ్య ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టుగా ప్రకటించటంతో మరోసారి హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా అర్జున్ రెడ్డి సినిమాతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిన షాలిని పాండేనే ఈ రీమేక్ లో హీరోయిన్ గా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వరుస ఆఫర్లతో బిజీ అవుతున్న షాలిని, ఈ సినిమాతో తమిళ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.