అందాల రాక్షసి బయటకొచ్చేసింది.! | Lavanya Tripathi Says No to 100 love Tamil Remake | Sakshi
Sakshi News home page

అందాల రాక్షసి బయటకొచ్చేసింది.!

Sep 4 2017 10:46 AM | Updated on Sep 17 2017 6:23 PM

అందాల రాక్షసి బయటకొచ్చేసింది.!

అందాల రాక్షసి బయటకొచ్చేసింది.!

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఈ శుక్రవారం యుద్ధంశరణం సినిమాతో నాగచైతన్యకు జోడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఈ శుక్రవారం యుద్ధంశరణం సినిమాతో నాగచైతన్యకు జోడిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తెలుగులో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోలతోనూ జోడి కడుతున్న ఈ బ్యూటీ కోలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్నారు.  కానీ లావణ్య కోలీవుడ్ ఆశలు ఇప్పట్లో తీరేలా కనిపించటం లేదు. ఈ రీమేక్ సినిమాతో తమిళనాట సక్సెస్ సాధించాలని భావించిన లావణ్య కోరిక తీరేలా లేదు.

నాగచైతన్య, తమన్నా కాంబినేషన్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 100% లవ్. ఈ సినిమాను జీవీ ప్రకాష్ హీరోగా తమిళ్లో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా హెబ్బా పటేల్ను హీరోయిన్గా తీసుకోవాలని భావించినా.. తరువాత లావణ్యత్రిపాఠినే ఫైనల్ చేశారు.

ఈ సినిమాలో కాలేజ్ అమ్మాయిగా కనిపించేందుకు స్లిమ్ అవ్వాలని నిర్ణయించుకుంది లావణ్య. కానీ ప్రస్తుతం ఈ బ్యూటీ రీమేక్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందన్న టాక్ వినిపిస్తోంది. తెలుగు సినిమాలతో బిజీగా ఉండటంతో రీమేక్ కు డేట్స్ అడ్జస్ట్ చేయలేకే ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేసిందట. దీంతో మరో హీరోయిన్ కోసం అన్వేషణలో పడ్డారు జీవీ ప్రకాష్ టీం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement