వ‌రుణ్‌- లావ‌ణ్య‌ల రిసెప్ష‌న్‌లో మెగాస్టార్ సంద‌డి | Newlyweds Varun Tej And Lavanya Tripathi Reception In Hyderabad, Videos Trending On Social Media - Sakshi
Sakshi News home page

VarunLav Wedding Reception: వ‌రుణ్‌తేజ్‌- లావ‌ణ్య‌ల రిసెప్ష‌న్‌.. టాలీవుడ్ సెల‌బ్రిటీల హాజ‌రు

Published Sun, Nov 5 2023 8:39 PM | Last Updated on Mon, Nov 6 2023 9:38 AM

Newlyweds Varun Tej, Lavanya Tripathi Reception - Sakshi

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్, అందాల రాక్ష‌సి లావ‌ణ్య త్రిపాఠి వైవాహిక బంధంలో అడుగుపెట్టారు. త‌మ ప్రేమకు పునాదులు ప‌డ్డ ఇట‌లీలోనే పెళ్లి చేసుకున్నారు. న‌వంబ‌ర్ 1 వీరి వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. అయితే ఈ పెళ్లి సంబ‌రాల్లో మెగా, అల్లు కుటుంబాలు స‌హా అత్యంత ద‌గ్గ‌రి బంధుమిత్రులు మాత్ర‌మే హాజ‌ర‌య్యారు. దీంతో పెళ్లికి రాలేక‌పోయిన‌వారి కోసం నేడు(న‌వంబ‌ర్ 5న‌) హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు.

మాదాపూర్‌లోని ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ వ‌రుణ్‌-లావ‌ణ్య‌ల రిసెప్ష‌న్ జ‌రుగుతోంది. ఈవేడుక‌కు ప‌లువురు ప్ర‌ముఖుల‌తో పాటు టాలీవుడ్ సెల‌బ్రిటీలు అంతా విచ్చేశారు. సునీల్‌, నాగ‌చైత‌న్య స‌హా త‌దితురులు రిసెప్ష‌న్‌కు హాజ‌ర‌వ‌గా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చ‌ద‌వండి: నాన్న చ‌నిపోయాక గానీ నేను చేసిన త‌ప్పేంటో తెలిసిరాలేదు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement