దీపావళి సెలబ్రేషన్స్‌లో వరుణ్‌-లావణ్య.. దంపతులు! | Varun Tej, Lavanya Tripathi Celebrate First Diwali Post Marriage - Sakshi
Sakshi News home page

Varun Tej- Lavanya Tripathi: అత్తారింట్లో దీపావళి జరుపుకున్న లావణ్య త్రిపాఠి, ఫోటో వైరల్‌

Nov 13 2023 9:43 AM | Updated on Nov 13 2023 10:31 AM

Varun Tej, Lavanya Tripathi First Diwali Celebration Post Marriage - Sakshi

దీంతో కొత్త జంట సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయి దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుంది. మెగా ఇంటి కోడలిగా వచ్చిన లావణ్య.. అత్తారింట్లోనే పండగ వేడుకలు జరుపుకుంది.

టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌- లావణ్య త్రిపాఠి తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంతో పదిలపర్చుకున్నారు. నవంబర్‌ 1న ఇటలీలో ఇరు కుటుంబాలు, అతి దగ్గరి బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. సెలబ్రిటీల కోసం నవంబర్‌ 5న హైదరాబాద్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ వేడుక కూడా నిర్వహించారు. వీరి పెళ్లి వీడియో ఓటీటీలో ప్రసారం కానుందని ప్రచారం జరగడంతో మెగా ఇంటి వేడుకను ఇంట్లో కూర్చుని చూసేయొచ్చని ఫ్యాన్స్‌ ఎగిరి గంతేశారు. కానీ అంతలోనే అదంతా వుట్టి పుకారేనని తేలడంతో అభిమానుల ఆశలపై నీళ్లు గుమ్మరించినట్లైంది.

వీరు పెళ్లి చేసుకున్న తర్వాత వచ్చిన తొలి పండగ దీపావళి. దీంతో కొత్త జంట సాంప్రదాయ దుస్తుల్లో రెడీ అయి దీపావళిని సెలబ్రేట్‌ చేసుకుంది. మెగా ఇంటి కోడలిగా వచ్చిన లావణ్య.. అత్తారింట్లోనే పండగ వేడుకలు జరుపుకుంది. వరుణ్‌ షేర్వాణీ ధరించగా లావణ్య చీర కట్టులో మెరిసిపోయింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: తండ్రి కాబోతున్న యంగ్‌ హీరో నిఖిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement