ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి జంట తొలిసారి ఓ కార్యక్రమంలో సందడి చేశారు. హైదరాబాద్‌లో జరిగిన మూవీ షూటింగ్ ప్రారంభోత్సవానికి ఇద్దరు కలిసి హాజరయ్యారు. యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల సమర్పణలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్‌పై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.
తొలి సన్నివేశానికి నటుడు నాగబాబు కెమెరా స్విచ్చాన్ చేయగా.. హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించగా నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందించారు. నిహారిక మాట్లాడుతూ.. 'మా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో ఇప్పటివరకు వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిలింస్ చేశాం. తొలిసారి ఫీచర్ ఫిల్మ్ ప్రారంభించాం. కొత్తవాళ్లతో సినిమా చేయటం పెద్ద బాధ్యతగా భావిస్తున్నాను.' అని అన్నారు. అయితే వరుణ్- లావణ్య తమ పెళ్లి తర్వాత తొలిసారి బయట జంటగా కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. ఈనెల 1న ఇటలీలోని టుస్కానీలో సన్నిహితులు, బంధువుల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా నిర్వహించారు. ఇండియాకు తిరగొచ్చాక హైదరాబాద్‌లోనూ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment