
ప్రేమించుకున్న మాట వాస్తవమే.. ప్రేమలో ఉన్నారంటూ వార్తలు రావడమూ నిజమే.. కానీ ఎన్నడూ అవును, మేమిద్దరం లవ్‌లో ఉన్నాం అని బయటకు చెప్పలేదు వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి. అయినా సరే వీరి ప్రేమను ఇట్టే పసిగట్టేశారు అభిమానులు. మొత్తానికి కొంతకాలం పాటు ప్రేమపక్షుల్లా విహరించిన ఈ జంట గతేడాది పెళ్లి బంధంతో ఒక్కటైంది. ఇకపోతే వరుణ్ 'ఆపరేషన్ వాలంటైన్' సినిమాతో వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇటు లావణ్య 'మిస్ పర్ఫెక్ట్' వెబ్ సిరీస్‌తో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించనుంది.
ఆడపడుచు కట్నంగా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో లావణ్యకు ఆడపడుచు కట్నం గురించి ఓ ప్రశ్న ఎదురైంది. మీరు నిహారికతో ఎంతో సరదాగా ఉంటారు. మరి మీ పెళ్లి సమయంలో ఆమెకు ఆడపడుచు కట్నం ఏమైనా ఇచ్చారా? అని యాంకర్ అడిగాడు. దీనికి లావణ్య త్రిపాఠి స్పందిస్తూ.. అలా ఏమీ ఇవ్వలేదని తెలిపింది. నిహారికకు కట్నంగా డబ్బులేమీ ఇవ్వలేదని, అయితే తను కుటుంబసభ్యురాలు కాబట్టి తనకోసం ఏదైనా చేస్తానంది. మంచి కథతో వస్తే నిహారిక బ్యానర్‌లో నటించడానికి సిద్ధమని తెలిపింది. ఫ్యామిలీ కాబట్టి ఒక్క రూపాయి తీసుకోకుండా ఫ్రీగా యాక్ట్ చేస్తానని చెప్పుకొచ్చింది లావణ్య.
చదవండి: హనుమాన్‌కు పెరిగిన వసూళ్లు.. ఇప్పటిదాకా ఎంతొచ్చాయంటే?
Comments
Please login to add a commentAdd a comment