వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతోంది.
‘‘మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రం ‘మట్కా’. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో వరుణ్ డిఫరెంట్ మేకోవర్‌లలో కనిపించనున్నారు. ప్రస్తుతం కాకినాడలో జరుగుతున్న షెడ్యూల్‌లో కీలక తారాగణంపై టాకీ పార్ట్‌తో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్, కన్నడ కిశోర్, రవీంద్ర విజయ్, పి. రవి శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: ఎ. కిశోర్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment