
‘హే రప్పా... రప్పా... రప్పా... రప్పా... యురేఖ... కూర్చుంటే ఏదీ రాదు... నిలబడి చూస్తుంటే కాదు... కలబడితే నీదే దునియా అంతా..’ అంటూ మొదలవుతుంది ‘మట్కా’ సినిమాలోని ‘తస్సాదియ్యా...’ సాంగ్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ఇది. నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు.
కరుణ కుమార్ దర్శకత్వంలో డా. విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమాలోని ‘తస్సాదియ్యా...’పాట లిరికల్ వీడియోను గురువారం విడుదల చేశారు. ఈ చిత్రం సంగీతదర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపరిచిన ఈపాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా మనోపాడారు. ‘ఎవ్వడిని అడగొద్దంట... జీవితమే నేర్పిస్తుంది అంతా... తస్సాదియా..’ అంటూ సాగుతుందీపాట.
Comments
Please login to add a commentAdd a comment