కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ | Makers launch countdown poster of Varun Tej from Matka | Sakshi
Sakshi News home page

కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌

Published Mon, Oct 21 2024 12:03 AM | Last Updated on Mon, Oct 21 2024 12:03 AM

Makers launch countdown poster of Varun Tej from Matka

వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించిన తాజా పీరియాడికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ‘మట్కా’. ఈ చిత్రంలో నోరా ఫతేహి, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించారు. 1958 నుంచి 1982 మధ్య జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ నాలుగు డిఫరెంట్‌ గెటప్స్‌లో కనిపిస్తారు.

కరుణ కుమార్‌ దర్శకత్వంలో డా. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మించిన ఈ చిత్రం నవంబరు 14న విడుదల కానుంది. కాగా ఆదివారం ‘మట్కా’ సినిమా రిలీజ్‌ 25 రోజుల కౌంట్‌డౌన్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. నవీన్‌ చంద్ర, అజయ్‌ ఘోష్, ‘కన్నడ’ కిషోర్, రవీంద్ర విజయ్‌ ఇతర కీలకపాత్రల్లో నటించిన ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్‌ సంగీతం అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement