
సూపర్‌స్టార్ కృష్ణ కూతురు మంజుల తొలిసారి దర్శకత్వం వహించిన ‘మనసుకు నచ్చింది’ సినిమాలో బాగా నటించి తెలుగు ప్రేక్షకులకు నచ్చేశారు ముంబై బ్యూటీ అమైరా దస్తూర్. తెలుగు తెరపైకి రాకముందే తమిళ చిత్రాల్లో నటించిన అమైరా ఇప్పుడు మరో తమిళ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జీవీ ప్రకాశ్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందనున్న ఫాంటసీ లవ్ \చిత్రంలో నటించనున్నారామె.
మూడేళ్ల క్రితం జీవీ, రవిచంద్రన్ కాంబినేషన్‌లోనే వచ్చిన తమిళ చిత్రం ‘త్రిష ఇల్లా నయనతార’తెలుగులో ‘త్రిష లేదా నయనతార’ అనే పేరుతో రిలీజైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. రాజ్ తరణ్, అమైరా దస్తూర్ జంటగా నటించిన తెలుగు చిత్రం ‘రాజుగాడు’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఇలా ఒక సినిమా రిలీజ్ కాకముందే మరో సినిమాను లైన్లో పెడుతూ స్పీడ్ పెంచారు అమైరా. అంతేకాదండోయ్. ఒక హిందీలో చిత్రంలో నటించడం కోసం ఆమె జిమ్నాస్టిక్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్నారు కూడా.
Comments
Please login to add a commentAdd a comment