ధనుష్‌తో గొడవలు నిజమే.. ఆరేళ్లు మాటల్లేవ్‌: హీరో | GV Prakash Says Not Speaking With Dhanush for Six Years | Sakshi
Sakshi News home page

Dhanush: అవును, ధనుష్‌, నేను ఆరేళ్లు మాట్లాడుకోలేదు..

Published Sat, Apr 6 2024 3:40 PM | Last Updated on Sat, Apr 6 2024 3:54 PM

GV Prakash Says Not Speaking With Dhanush for Six Years - Sakshi

జీవీ ప్రకాశ్‌ కుమార్‌.. మల్టీ టాలెంటెడ్‌. సంగీత దర్శకుడిగా, నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా తమిళ చిత్రపరిశ్రమలో రాణిస్తున్నాడు. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా సెంచరీ సినిమాలు దాటేసిన అతడు హీరోగా దాదాపు 25 చిత్రాలు చేశాడు. ఇతడికి కోలీవుడ్‌లో ధనుష్‌ క్లోజ్‌ ఫ్రెండ్‌. కానీ గతంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగిందని.. అప్పటినుంచి వీరికి మాటల్లేవని ప్రచారం జరిగింది.

ఫ్రెండ్స్‌ మధ్య గొడవలు కామన్‌
ఎట్టకేలకు ఈ ప్రచారంపై స్పందించాడు జీవీ ప్రకాశ్‌. ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ఫ్రెండ్స్‌ అన్నాక గొడవలు సర్వసాధారణమే! అలా మా మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. చిన్నపాటి గొడవలు జరిగాయి. అలా ఆరేళ్లు మాట్లాడుకోలేదు. కానీ తర్వాత అంతా సెట్టయిపోయింది. ఫ్రెండ్‌షిప్‌ అంటేనే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి కదా.. ఆ డిస్టబెన్స్‌ తర్వాత మేమిద్దరం ఇంకా క్లోజయ్యాం.

తనతో క్రికెట్‌ ఆడటం ఇష్టం
ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తను నా కోసం అండగా నిలబడతాడు. నేను కూడా ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాను. ధనుష్‌కు ఎవరైనా నచ్చారంటే వారికోసం ఎంతవరకు వెళ్లడానికైనా సిద్ధపడతాడు. తనలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. నాకు ధనుష్‌తో క్రికెట్‌ ఆడటం అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. కాగా జీవీ ప్రకాశ్‌ వెయిల్‌ చిత్రంతో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా చిత్ర రంగప్రవేశం చేశాడు. డార్లింగ్‌ మూవీతో హీరోగా మారాడు. మదయానై కూట్టం(2013)  చిత్రం ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తాడు.

చదవండి: కీరవాణి అబ్బాయితో నా కూతురు పెళ్లి నిజమే: మాగంటి రూప

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement