పదిహేనేళ్ల తరువాత మళ్లీ డైరెక్ట్ చేస్తున్నాడు | Gv Prakash with Rajiv menon | Sakshi
Sakshi News home page

పదిహేనేళ్ల తరువాత మళ్లీ డైరెక్ట్ చేస్తున్నాడు

Published Sun, Nov 20 2016 11:54 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

పదిహేనేళ్ల తరువాత మళ్లీ డైరెక్ట్ చేస్తున్నాడు

పదిహేనేళ్ల తరువాత మళ్లీ డైరెక్ట్ చేస్తున్నాడు

రాజీవ్ మీనన్.. దక్షిణాది సినిమాలను ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. బొంబాయి సినిమాతో సినిమాటోగ్రాఫర్గా దేశావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజీవ్ మీనన్. ఆ తరువాత కూడా మణిరత్నం తెరకెక్కించిన గురు, కడలి లాంటి సినిమాలతో పాటు మార్నింగ్ రాగా లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించాడు. యాడ్ ఫిలిం మేకర్గా కూడా మంచి పేరున్న రాజీవ్ మీనన్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

మెరుపు కలలు సినిమాతో దర్శకుడిగా మారిన రాజీవ్ మీనన్ తొలి సినిమాతోనే నాలుగు జాతీయ అవార్డులు సాధించి సత్తా చాటాడు. తరువాత ప్రియురాలు పిలిచింది సినిమాతో మరోసారి దర్శకుడిగా మారి జాతీయ అవార్డు సాధించాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత మరోసారి తన దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజీవ్ మీనన్. కోలీవుడ్ యంగ్ హీరో జివి ప్రకాష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement