Rajiv Menon
-
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న దర్శకుడి కూతురు, ఎంత అందంగా ఉందో!
ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు రాజీవ్‌మీనన్ ఇటీవల నటుడుగానూ అవతారమెత్తారు. ఈయన వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన విడుదలై చిత్రంలో కీలక పాత్ర ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశారు. తాజాగా వెపన్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా తాజాగా రాజీవ్‌మీనన్ వారసురాలు సరస్వతి కథానాయకిగా పరిచయం అవుతున్నారు. మూమెంట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జీఏ హరికృష్ణన్ నిర్మిస్తున్న చిత్రంలో నటి సరస్వతి కథానాయకిగా నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు సర్వం తాళమయం చిత్రంలో ఓ పాటలో నటించారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ కొత్త చిత్రంలో మరో నటి కూడా నాయకిగా నటించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. రంగనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు సెల్వరాఘవన్, యోగిబాబు, సునీల్, షైన్‌టామ్, రాధారవి, వినోదిని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దక్షిణ తమిళ రాజకీయాలను ఆవిష్కరించే ఈ చిత్ర షూటింగ్ దిండిగల్, రామనాథపురం, కొడైక్కనాల్ ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. View this post on Instagram A post shared by Krrish Siva (@krrish_siva) -
పదిహేనేళ్ల తరువాత మళ్లీ డైరెక్ట్ చేస్తున్నాడు
రాజీవ్ మీనన్.. దక్షిణాది సినిమాలను ఫాలో అయ్యే వారికి పరిచయం అక్కర్లేని పేరు. బొంబాయి సినిమాతో సినిమాటోగ్రాఫర్‌గా దేశావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రాజీవ్ మీనన్. ఆ తరువాత కూడా మణిరత్నం తెరకెక్కించిన గురు, కడలి లాంటి సినిమాలతో పాటు మార్నింగ్ రాగా లాంటి అవార్డ్ విన్నింగ్ సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించాడు. యాడ్ ఫిలిం మేకర్‌గా కూడా మంచి పేరున్న రాజీవ్ మీనన్ రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు. మెరుపు కలలు సినిమాతో దర్శకుడిగా మారిన రాజీవ్ మీనన్ తొలి సినిమాతోనే నాలుగు జాతీయ అవార్డులు సాధించి సత్తా చాటాడు. తరువాత ప్రియురాలు పిలిచింది సినిమాతో మరోసారి దర్శకుడిగా మారి జాతీయ అవార్డు సాధించాడు. దాదాపు 15 ఏళ్ల తరువాత మరోసారి తన దర్శకత్వంలో సినిమాను తెరకెక్కిస్తున్నాడు రాజీవ్ మీనన్. కోలీవుడ్ యంగ్ హీరో జివి ప్రకాష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. -
కమల్‌కు ఇళయరాజా టైటిల్!
కమల్‌హాసన్-ఇళయరాజాలది ఓ సూపర్‌హిట్ కాంబినేషన్. కానీ, దాదాపు 11 ఏళ్లుగా కమల్ నటించిన ఏ చిత్రానికీ ఇళయరాజా పనిచేయలేదు. తాజాగా వీరిద్దరూ కలిసి మళ్లీ పనిచేస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం చెన్నైలో జరిగింది. శ్రుతీహాసన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి టీకే రాజీవ్‌మీనన్ దర్శకుడు. విశేషమేమిటంటే, ఈ సినిమాకు నామకరణం ఇళయరాజానే చేశారట! పాతికేళ్ల క్రితం తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఓ చిత్రానికి ‘గుణ’ అనే టైటిల్ పెట్టింది కూడా ఇళయరాజానే. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కమల్ సినిమాకు ఇళయరాజా టైటిల్ సూచించారు. ఈ విషయాన్ని కమల్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరి ఈ సినిమా టైటిల్ ఏంటో చెప్పకుండా కమల్ సస్పెన్స్‌లో పెట్టారు.