Rajiv Menon Daughter Saraswathi Menon Turns As A Heroine - Sakshi
Sakshi News home page

హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న దర్శకుడి కూతురు

Published Thu, Aug 3 2023 10:55 AM | Last Updated on Thu, Aug 3 2023 12:18 PM

Rajiv Menon Daughter Saraswathi Menon Turns As A Heroine - Sakshi

ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు రాజీవ్‌మీనన్‌ ఇటీవల నటుడుగానూ అవతారమెత్తారు. ఈయన వెట్రిమారన్‌ దర్శకత్వంలో రూపొందిన విడుదలై చిత్రంలో కీలక పాత్ర ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశారు. తాజాగా వెపన్‌ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా తాజాగా రాజీవ్‌మీనన్‌ వారసురాలు సరస్వతి కథానాయకిగా పరిచయం అవుతున్నారు.

మూమెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై జీఏ హరికృష్ణన్‌ నిర్మిస్తున్న చిత్రంలో నటి సరస్వతి కథానాయకిగా నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు సర్వం తాళమయం చిత్రంలో ఓ పాటలో నటించారు.

కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ కొత్త చిత్రంలో మరో నటి కూడా నాయకిగా నటించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. రంగనాథన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు సెల్వరాఘవన్‌, యోగిబాబు, సునీల్‌, షైన్‌టామ్‌, రాధారవి, వినోదిని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దక్షిణ తమిళ రాజకీయాలను ఆవిష్కరించే ఈ చిత్ర షూటింగ్‌ దిండిగల్‌, రామనాథపురం, కొడైక్కనాల్‌ ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement