saraswathi
-
పవన్ సార్ ఇప్పుడేమంటారు? చంద్రబాబును ప్రశ్నించే ధైర్యం పవన్ కు లేదు
-
ఏడో రోజు చదువుల తల్లి సరస్వతిగా .. త్రిరాత్ర వ్రతం..!
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.మూలా నక్షత్రము రోజున అమ్మవారిని శ్వేతపద్మాన్ని అధిష్టించి, వీణ, కమండలం, అక్షరమాలను ధరించి, అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదాదేవి అతి విశిష్టమైనది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్దులకై సరస్వతీ పూజ తప్పకుండా చేయిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభాస్యం కూడా చేస్తారు. దేవీ నవరాత్రులలో చివరి మూడు రాత్రులూ చేసే త్రిరాత్ర వ్రతం ఈరోజే ప్రారంభిస్తారునైవేద్యం: దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలిమరోవైపు నవ దుర్గాలను పూజించే సంప్రదాయం ప్రకారం. ఏడవ రోజు కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజించడం ద్వారా భక్తులు ఆపదలు, అరిష్టాల నుంచి బయటపడతారు."ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరణీ వామ పాదోల్లిసల్లోహలితా కంటకా భూషణా వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ"ఎవరైనా శని దోషం వల్ల రకరకాల సమస్యలతో సతమతమవుతున్నట్లయితే.. ఈ రోజు ఆ దోషం నుంచి బయటపడటానికి చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి దేవి ని పూజించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది.కాలరాత్రి మంత్రంఎవరి జాతకంలోనైనా శని దోషం ఉండి ఇబ్బంది పడుతూ.. ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, మీ చింతలన్నీ తొలగిపోవడానికి.. ఈరోజు దుర్గాదేవి సప్తమ రూపం కాళరాత్రి దేవిని ‘ఓం ఐం హ్రీం క్లీం’ అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించండి. 108 సార్లు ‘కాలరాత్రియ నమః’ అని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సాధకుడు దేవతతో పాటు శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతాడని, అతని జాతకంలో శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు.నైవేద్యం: గారెలు, కిచిడి(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!) -
హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న దర్శకుడి కూతురు, ఎంత అందంగా ఉందో!
ప్రముఖ ఛాయాగ్రహకుడు, దర్శకుడు రాజీవ్‌మీనన్ ఇటీవల నటుడుగానూ అవతారమెత్తారు. ఈయన వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన విడుదలై చిత్రంలో కీలక పాత్ర ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశారు. తాజాగా వెపన్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా తాజాగా రాజీవ్‌మీనన్ వారసురాలు సరస్వతి కథానాయకిగా పరిచయం అవుతున్నారు. మూమెంట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జీఏ హరికృష్ణన్ నిర్మిస్తున్న చిత్రంలో నటి సరస్వతి కథానాయకిగా నటిస్తున్నారు. ఈమె ఇంతకుముందు సర్వం తాళమయం చిత్రంలో ఓ పాటలో నటించారు. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ కొత్త చిత్రంలో మరో నటి కూడా నాయకిగా నటించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. రంగనాథన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు సెల్వరాఘవన్, యోగిబాబు, సునీల్, షైన్‌టామ్, రాధారవి, వినోదిని తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దక్షిణ తమిళ రాజకీయాలను ఆవిష్కరించే ఈ చిత్ర షూటింగ్ దిండిగల్, రామనాథపురం, కొడైక్కనాల్ ప్రాంతాల్లో శరవేగంగా జరుపుకుంటోంది. View this post on Instagram A post shared by Krrish Siva (@krrish_siva) -
సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట తీవ్ర విషాదం
టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది.ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మణిశర్మ తల్లి సరస్వతి(88) ఆదివారం సాయంత్రం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్ను మూశారని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సరస్వతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మణిశర్మకు తమ సానుభూతిని ప్రకటించారు. -
విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన మహోత్సవం
-
రెండు నదులు.. రెండు రంగులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలుస్తాయి. గోదావరి తెలంగాణలోని మంచిర్యాల మీదుగా, ప్రాణహిత నది మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా నుంచి వచ్చి కాళేశ్వరం వద్ద కలుస్తోంది. దీంతో రెండు నదులు కలవడంతో మూడవ నదిగా సరస్వతి నది ఉద్భవిస్తుంది. దీనినే గుప్త నదిగా పిలుస్తారు. బుధవారం గోదావరి వరద నీరు లేత నీలిరంగులో, ప్రాణహిత వరద నీరు లేత ఎరుపు రంగుల్లో కనిపించి చూపరులను ఆకర్షించింది. రెండు నదులు ఒకేచోట రెండు రంగుల్లో వేర్వేరుగా కనిపించడంతో కాళేశ్వరానికి వచి్చన భక్తులు ఆసక్తిగా తిలకించారు. – కాళేశ్వరం -
Yamini Saraswathi: యామినీ విలాసం
కాస్త పొట్టి ఆకారం! తెల్లగా మెరిసిపోయే బిళ్లంచు ఖద్దరు ధోవతి; నాజూగ్గా కట్టుకున్న తీరు.అంతే తెల్లని జుబ్బా, రింగులు తిరిగిన ముంగురులు. ముఖానికే అందమిచ్చే కళ్ల జోడు. మనిషి అసలే అందగాడు. ఆహార్యం ఇంకా అందాన్ని రెట్టింపు చేస్తుంటుంది. భుజాల మీద కప్పుకున్న పండిత శాలువా, అదీ ఎరుపు లేదా ఆకుపచ్చ రంగుల్లోవే. నడక లోనూ నాజూకుతనం. మాటలో సుకుమార్యం. సౌహార్దం, కాసింత సున్నిత హాస్యం అప్పుడప్పుడూ పండిత కవి మిత్రులతోనైతే వ్యంగ్యా స్త్రాలు సంధించే నైజం. డిగ్రీలో గణితమే ప్రధానాంశమైనా, తాత్కాలిత గణిత ఉపాధ్యాయుడిగా అక్కడ క్కడే కొలువు చేసినా, ఆయన అభిమాన మంతా తెలుగు సాహిత్యం మీదే. అందుకే ప్రాచీన నవీన రచనలెన్నింటినో ఆపోశన పట్టారు. ఊరక చదివింది కాదు, వాటిలోని ప్రశస్తమైన పద్యగద్యాలు, ఆసక్తికర సన్ని వేశాలు, సంభాషణలు, పద్యాలు చలోక్తులూ వంటివెన్నింటినో పుక్కిట బట్టారు. సందర్భాలకు తగినట్టుగా వాటిని ప్రయోగించేవారు. అలాగే ఆధునిక కవులనూ, రచయితలనూ, రచనలనూ తన మనోమందిరంలో నిక్షిప్తం చేసుకున్నాడు. ఈ ‘సాహిత్య వ్యసనం’ ఎంతగా మారిపోయిందంటే ఉమ్మడి రాష్ట్రంలో ఏ మూల సాహిత్య సభ జరిగినా తన హాజరు ఆవశ్యం ఉండేలా చూసుకునేవారు. ఆ రీతిగా ఎందరో కవులు, పండితులు, రచయితలు, రచయిత్రులతో పరిచయం పెంచుకున్నారు. ప్రాచీనులలో కవిత్రయము, శ్రీనాథ పోతనలు, ప్రబంధ కవులూ మిక్కిలి అభి మానం. పదకర్తలంటే ప్రత్యేక గౌరవం. మొదట్లో శతకం వంటి రచనలు చేసినా తర్వాత వచనరచయితగా, రూపాంతరం చెందారు. అతివ–అభిజాత్యం నవలతో మొదలైన ఆయన రచనా ప్రస్థానం స్వతంత్ర నవలలు, పలు పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలలు ముద్రణ పొందడంతో యావదాంధ్రలో ఆయన పేరుపొందారు. ఆయనే యామినీ సరస్వతి. ఇది కలంపేరు. సరస్వతి ఆయన భార్యపేరు. ఆయన అసలు పేరు డీవీ సుబ్బారావు. కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ ఫిర్కాలోని జిల్లేళ్ల గ్రామం స్వస్థలం. ఆగస్టు 3, 1941న జన్మించారు. కానీ సాహిత్య సంచారానికీ, రచనా రంగానికీ నంద్యాలనే ఆవాసం చేసు కున్నారు. నండూరు రామకృష్ణమాచార్య, గుంటూరు శేషేంద్రశర్మ, కొండవీటి వెంకట కవి, బేతవోలు రామబ్రహ్మం, డాక్టర్ సినారె వంటి ప్రముఖులెందరితోనే పరిచయం ఏర్పర్చుకుని నిత్య చర్చలు జరిపేవారు. నంద్యాల నూతన సారస్వత సంఘం కార్యదర్శిగా పని చేశారు. దాదాపు యాబై పైగా నవలలు, వంద కుపైగా కథలు రాశారు. తన రచనా వ్యాసం గంతోనే కొండవీటి వెంకటకవికి, దాసరి నారాయణరావుకు సహరచయితగా మారారు. సినీ, టీవీ రచయితగా పేరొందారు. టీవీలో విశ్వామిత్ర సీరియల్‌కి, సినిమాకు రచయితగా, తాండ్రపాపారాయుడు, విశ్వనాథనాయకుడు సినిమాలకు సహరచయితగా పనిచేశారు. సాహిత్యారాధన కోసం స్వగ్రామంలో తనకున్న ఆస్తులను కరిగించేశారు. 2004 సెప్టెంబర్ 5న ఆప్తులను, ఆత్మీయులను, హిత మిత్రులను వదిలి కీర్తిశేషులయ్యారు. రాయల సీమలో పేరెన్నికగన్న నవలా రచయితల్లో యామిని ఒకరు. కానీ రచనా రంగంలో అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల కంటే కర్నూలు వెనుకబడినందున కాబోలు ఆయనకు రావలసినంత పేరు రాలేదనే చెప్పాలి. సాహిత్యరంగంలో ఒకరికి పేరు రావడానికీ, మరొకరికి పేరు రాకపోవడానికీ మధ్య నడిచే బోలెడు కథల బాగోతంలో చిక్కిన బడుగు రచయితల్లో యామిని కూడా ఒకరయ్యారని చెప్పడం సబబు. - దినకర్, విశ్రాంత తెలుగు పండితుల -
400 చిత్రాల్లో నటించిన సీనియర్ నటి కన్నుమూత
సీనియర్ నటి జెమినీ సరస్వతి ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. ఈమె వయస్సు 94 ఏళ్లు. కారైకుడికి చెందిన జెమినీ సరస్వతి 5వ తరగతి చదువుతున్న వయసులోనే నాట్యంపై ఆసక్తితో, సినిమాల్లో నటించాలనే ఆశతో చెన్నైకి వచ్చారు. చంద్రలేఖ చిత్రం ద్వారా డాన్సర్‌గా పరిచయమయ్యారు. ఈమె అసలు పేరు సరస్వతి. జెమినీ సంస్థ నిర్మించిన చంద్రలేఖ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయడంతో జెమినీ సరస్వతిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత కాదల్ పడుత్తుమ్ పాడు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో పలు చిత్రాల్లో నటించారు. 400 చిత్రాల్లో, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో అలరించారు. కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆమె.. ఇటీవల శ్వాసకోస సంబంధిత సమస్య అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈమెకు దక్షిణామూర్తి, సెల్వరాజ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. సరస్వతి మరణానికి పలువురు సినీ ప్రముఖు లు సంతాపం వ్యక్తం చేశారు. చదవండి: పెళ్లికి రెడీ అయిపోయిన లవ్ బర్డ్స్ నయన్-విఘ్నేష్ -
అక్షర పండుగ.. వసంత పంచమి
తాడేపల్లిగూడెం రూరల్: ప్రతీ చిన్నారి జీవితంలోనూ బారసాల ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో అంతే ప్రాముఖ్యత అక్షరాభ్యాసానికి ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలతో దేవాలయాల్లో ‘ఓనమాలు’ దిద్దించేందుకు ఆసక్తి చూపుతారు. అందులోనూ మేధా సరస్వతీ దేవి ఆలయం అంటే మరింత విశిష్టతను సంతరించుకుంటుంది. తెలంగాణలోని బాసర తర్వాత పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వీరంపాలెం శైవక్షేత్రంలో అనేకమంది దేవతామూర్తులు నిలయమయ్యారు. ఈ ప్రాంగణంలోనే బాసర తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న మేధా సరస్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు. సామూహిక అక్షరాభ్యాసాలకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు తమ పిల్లలతో ఇక్కడికి తరలివస్తుంటారు. ఆ తరుణం రానే వచ్చింది. అదే వసంత పంచమి. దీనిలో భాగంగానే ఈ నెల 30వ తేదిన పెద్ద సంఖ్యలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించేందుకు వీరంపాలెం శైవక్షేత్రం సిద్ధమవుతోంది. రెండో దక్షిణకాశీగా వెలుగొందుతోంది వీరంపాలెం శ్రీబాలాత్రిపుర సుందరీ విద్యా, వైద్య, ఆధ్యాత్మిక పీఠం. ఇక్కడ శివరాత్రికి ఎంత ప్రాముఖ్యత ఉందో వసంత పంచమికి అంతే ప్రాముఖ్యత ఉంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ మేథా సరస్వతీ అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన రోజుగాను, అమ్మవారి జన్మదినోత్సవంగాను వసంత పంచమి, శ్రీపంచమిగా పేర్కొనవచ్చు. మాఘమాసంలో వచ్చే శుక్ల పంచమి రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. బాసర తర్వాత వీరంపాలెం మే«ధా సరస్వతీ ఆలయంలో పవిత్రమైన రోజుల్లో వందలాది మంది చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. మేధస్సుకు ప్రతిరూపంగా చెప్పబడే దక్షిణామూర్తి అభిముఖంగా ఉండే ఇక్కడ సరస్వతీ అఖండ జ్ఞాన సిద్ధితో పాటు మంచి మేధస్సును సైతం అందిస్తుందని భక్తుల విశ్వాసం. 30న ప్రజ్ఞా సరస్వతీ హోమం వసంత పంచమి సందర్భంగా ఈ నెల 30వ తేదీన అఖండ ప్రజ్ఞా సరస్వతీ హోమం నిర్వహించనున్నాం. హోమంలో పాల్గొనే భక్తులు ముందుగా తమ గోత్రనామాలను నమోదు చేయించుకోవాలి. భక్తుల రాకను పురస్కరించుకుని వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. –గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి, శ్రీబాలాత్రిపుర సుందరి పీఠం, వీరంపాలెం, తాడేపల్లిగూడెం మండలం -
దర్శకుడు ధవళ సత్యంకు మాతృవియోగం
విప్లవ చిత్రాల దర్శకునిగా ఎంతో పేరు సంపాదించారు దర్శకుడు ధవళ సత్యం. శనివారం ఉదయం నర్సాçపూర్లో ఆయన తల్లి సరస్వతి (86) తుది శ్వాస విడిచారు. ఆమెకు నలుగురు కుమారులు. ముగ్గురు కుమారులు చిత్ర పరిశ్రమలో కొనసాగుతున్నారు. ఒక కుమారుడు నర్సాపూర్‌లో కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. సరస్వతి అంత్యక్రియలు శనివారం నర్సాపూర్‌లో నిర్వహించారు. -
నీవే నేను! నీవే నేను!
సాహిత్య మర్మరాలు ఒక రోజున సంస్కృత కవి దిగ్గజాలైన దండి, భవభూతి, కాళిదాసు– ముగ్గురూ రాజవీథిలో నడచి వెళుతూ ఉన్నారు. మాటల మధ్య ‘మన ముగ్గురిలో ఎవరు ఎవరి కంటే ఎంత గొప్పవారు?’ అన్న మాట వచ్చింది. ‘ఈ విషయాన్ని గురించి మనలో మనం మాట్లాడుకోవటమెందుకు? అమ్మవారినే అడుగుదాం రండి!‘ అన్నాడు కాళిదాసు. ముగ్గురూ దగ్గరలోనే ఉన్న సరస్వతీదేవి ఆలయానికి వెళ్లారు. కాళిదాసు అమ్మవారిని స్తుతించాడు. అమ్మ ప్రత్యక్షమైంది. కాళిదాసు భక్తిపురస్సరంగా ఆమెకు నమస్కారం చేసి ‘అమ్మా! మాలో ఎవరు గొప్పవారు?’ అని అడిగాడు. శారదాదేవి చిద్విలాసంగా నవ్వి, ‘కవిర్దండీ కవిర్దండీ, భవభూతిస్తు పండితః– దండి ముమ్మాటికీ మహాకవి. భవభూతి అచ్చమైన పండితుడు’ అన్నది. ఆ తీర్పును విన్న కాళిదాసు అపరిమితమైన ఆగ్రహంతో ‘కోహం రండే?– అట్లా ఐతే మరి నేనెవరినే?’ అని అడిగాడు. భారతీదేవి ప్రశాంతంగా నవ్వి, ‘త్వమేవాహం త్వమేవాహం న సంశయః – నాయనా! వీరిద్దరితో నీకు పోలిక ఎందుకోయీ? అతడు కవి. ఇతడు పండితుడు. నేను అరవై నాలుగు కళలకు అధిష్ఠాన దేవతను. నీవే నేను. నీవే నేను. ఇందులో సందేహ మెంత మాత్రమూ లేదు’ అన్నది. ఆ నిర్ణయాన్ని విన్న ఆ ముగ్గురు మహాకవులు అమ్మకు అంజలి ఘటించారు. దండి, భవభూతి, కాళిదాసులకు సంబంధించి ప్రచారంలో ఉన్న వృత్తాంత మిది. -డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణ మూర్తి -
సాధ్వి సరస్వతి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, జంషెడ్పూర్ : గోవధను నిరోధించేందుకు జీవితఖైదుతో కూడిన కఠిన చట్టాన్ని తీసుకురావాలని వీహెచ్‌పీ నేత సాధ్వి సరస్వతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గోవధను నియంత్రిస్తూ పలు రాష్ట్రాలు చట్టాలు చేసినా జాతీయస్థాయిలో కేంద్రం సరైన చట్టాన్ని తీసుకువచ్చి పకడ్బందీగా అమలు చేయాలని ఆమె కోరారు. కేరళలో హిందూ కార్యకర్తలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని తనపై ఏప్రిల్ 30న కేసు నమోదు చేసినా తాను తన కార్యకలాపాలను కొనసాగిస్తానని సాధ్వి సరస్వతి స్పష్టం చేశారు. కేరళలో జరిగిన హిందూ సమ్మేళనం కార్యక్రమంలో హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హిందూ జాగరణ్ మంచ్ కార్యక్రమంలో పాల్గొన్న సాధ్వి సరస్వతి తనపై కేసులున్నా తనను అవి నిరోధించలేవన్నారు. బీఫ్ తినడంపై తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై తన ఫేస్బుక్ పేజీలో 600 మందికి పైగా వ్యక్తులు తనను ట్రోల్ చేశారని చెప్పారు. జాప్యం నెలకొన్నా అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగి తీరుతుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. -
పోలీసుల అదుపులో ఏడో నిందితుడు..
పార్వతీపురం : గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద ఉన్న ఐటీడీఏ పార్క్ సమీపంలో ఈ నెల 7న జరిగిన నవ వరుడు గౌరీశంకరరావు హత్యకేసు కొత్త మలుపు తిరిగింది. కట్టుకున్న భర్త గౌరీశంకరరావును (మేనమామ) కడతేర్చాలని తన ప్రియుడు శివ సహకారంతో విశాఖపట్నానికి చెందిన రౌడీమూకతో ఒప్పందం కుదుర్చుకున్న భార్య పథకం ప్రకారం భర్తను చంపించిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్యకేసుకు సంబంధించి ఏఎస్పీ దీపిక పాటిల్ విచారణలో కొత్త విషయాలు వెలుగు చూశాయి. పెళ్లి అయిన తర్వాత చంపించడానికి పథకం పన్నడమే కాకుండా పెళ్లికి ముందు కూడా బెంగళూరులో పనిచేస్తున్న సమయంలో గౌరీశంకరరావును హత్య చేయించేందుకు సరస్వతి ఒప్పందం కుదుర్చుకున్నట్లు విచారణలో తెలిసింది. ఈ వివరాలను ఏఎస్పీ దీపిక పాటిల్ శుక్రవారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే సరస్వతి విశాఖపట్నంలోని సాయిసుధ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నప్పుడు కల్యాణి అనే స్నేహితురాలు పరిచయమైంది. ఆమె సహకారంతో రాజాన శ్రీనివాసరావు అనే వ్యక్తిని పరిచయం చేసుకొని తన మేనమామ గౌరీశంకరరావును బెంగళూరులో హతమార్చేందుకు లక్ష రూపాయలకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా సరస్వతి తన ప్రియుడు శివ వద్ద రూ. 25 వేలు తీసుకొని శ్రీనివాసరావుకు అడ్వాన్స్‌గా చెల్లించింది. ఆ తరువాత మరోసారి రూ. 11వేలు అందజేసింది. ఈ రెండు పేమెంట్లు ఆన్లైన్లో తేజ్ యాప్ ద్వారా శ్రీనివాసరావుకు చేరాయి. అనంతరం మరో 14 వేల రూపాయలను చేతికి నేరుగా అందజేసింది. అయితే డబ్బులు తీసుకున్న రాజాన శ్రీనివాసరావు తన తల్లికి బాగోలేకపోవడంతో పథకాన్ని అమలు చేయలేకపోయాడు. దీంతో సరస్వతికి తన మేనమామ గౌరీశంకరరావుతో వివాహం జరిగిపోయింది. ఎలాగైనా తన భర్తను చంపాలని ప్రియుడు శివతో చర్చించి విశాఖపట్నానికి చెందిన రౌడీషీటర్ రామకృష్ణతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తర్వాత పథకం ప్రకారం ఈ నెల 7న తోటపల్లి ఐటీడీఏ పార్క్ వద్ద దాడి చేసి గౌరీశంకర్‌ను హత్య చేశారు. ఈ కేసులో ఇప్పటికే సరస్వతితో పాటు హత్యకు పాల్పడిన శివ , గోపి, రామకృష్ణ, బంగార్రాజు, కిశోర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ముందుగా హత్యచేసేందుకు సుపారి తీసుకొని పథకం పన్నిన శ్రీనివాసరావును విశాఖపట్నంలో శుక్రవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకొని 7వ నిందితుడిగా కేసు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ రాంబాబు, గరుగుబిల్లి ఎస్సై హరిబాబునాయుడులు పాల్గొన్నారు. -
మలుపు తిరుగుతున్న నవ వరుడు హత్యకేసు
పార్వతీపురం : గరుగుబిల్లి మండలం తోటపల్లి రిజర్వాయర్ వద్ద ఐటీడీఏ పార్క్ సమీపంలో ఇటీవల జరిగిన నవ వరుడు హత్యకేసు ఉదంతం మలుపు తిరుగుతోంది. కట్టుకున్న భార్యే... భర్తను హతమార్చడానికి పన్నిన పన్నాగాన్ని పోలీసులు చేధించారు. అయితే నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులకు కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఇంతవరకు మృతుడి భార్య సరస్వతి, ప్రియుడు శివకుమార్ కలిసి విశాఖకు చెందిన గుండాలతో హత్య చేయించినట్లు తెలిసింది. తాజాగా మరో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. మృతుడు గౌరీశంకర్ భార్య సరస్వతికి బెంగళూరులో ఒక స్నేహితురాలు ఉంది. సరస్వతి భర్త గౌరీశంకరరావు కూడా బెంగళూరులోనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే సరస్వతి తన స్నేహితురాలితో కలసి బెంగళూరులోనే తన భర్త గౌరీశంకర్‌ను హతమార్చేందుకు వివాహానికి ముందే పథకం రచించినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు విశ్వసనీయ సమాచారం.దీంతో పార్వతీపురం ఏఎస్పీ ఆదేశాల మేరకు బెంగళూరులో ఉన్న సరస్వతి స్నేహితురాలిని కూడా విచారించడానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే బెంగళూరులో హత్య చేయడం కుదరకపోవడంతో విశాఖకు చెందిన రౌడీలతో జిల్లాలో హత్య చేయించారు. వివరాల్లోకి వెళితే...శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కడకెళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి అదే మండలం చిట్టిపుడివలస గ్రామానికి చెందిన యామక గౌరీ శంకరావుతో గత నెల 28న వివాహం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని సర్వీసింగ్‌కు ఇచ్చేందుకు ఇరువురూ పార్వతీపురం వచ్చారు. కొద్దిగా చీకటిపడుతున్న సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇనుప రాడ్లతో శంకర్రావు తలపై మోదారు. దీంతో తీవ్ర రక్తస్రావమై శంకర్రావు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. అతని భార్య సరస్వతే దుండగులకు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించిందని పోలీసులు వివరించారు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు జాగ్రత్తపడ్డ నిందితురాలు దుండగులు దారికాచి తన భర్తను చంపేశారని, మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లారంటూ పోలీసుల వద్ద మొసలికన్నీరు కార్చింది. హత్య జరిగిన స్థలాన్ని, సరస్వతిని కలిసి విచారించిన ఎస్పీకి ఎక్కడో అనుమానం వచ్చింది. పార్వతీపురం నుంచి జిల్లా కేంద్రానికి తిరిగి వెళ్తున్న సమయంలో ఓ ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు అనుమానితుల్ని విచారించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఎస్పీ అనుమానం మరింత బలపడింది. గణపతినగరం స్టేషన్‌కు తరలించి కూపీ లాగగా వారు అసలు విషయాన్ని వెల్లడించారు. ఇష్టంలేని పెళ్లి వల్లే భర్త శంకర్రావును భార్య హత్య చేయించిందని తెలిసి ఎస్సీ షాక్ అయ్యారు. స్నేహితుడు శివ సలహా తీసుకున్న సరస్వతి... భర్తను చంపేందుకు వైజాగ్‌కు చెందిన రౌడీషీటర్ గోపీకి సుపారీ ఇచ్చినట్లు విచారణలో తేలింది. పార్వతీపురం ఐటీడీఏ పార్క్ వద్ద శంకర్రావును హత్యచేసింది తామేనని ఆ ముగ్గురూ ఒప్పుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆసుపత్రిలో కోలుకున్న సరస్వతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
భర్తని చంపించిన కేసులో సంచలన నిజాలు
-
హత్యకేసులో ఫేస్బుక్ ప్రేమికుడు అరెస్ట్
సాక్షి, విజయనగరం టౌన్: ఇటీవల విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి ఐటీడీఏ పార్క్ సమీపంలో భర్త గౌరీశంకర్‌ను హతమార్చిన భార్య సరస్వతి ఫేస్బుక్ లవర్ మడ్డు శివను పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి బెంగుళూరు వెళ్తున్న శివను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జిల్లా ఎస్పీ పాలరాజు శనివారం మీడియా సమావేశంలో తెలిపారు. పెళ్లైన తొమ్మిది రోజులకే భర్తను మట్టుబెట్టిన కేసులో భార్య సరస్వతితో పాటు ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. గౌరీశంకర్ హత్య జరిగిన నాటి నుంచి మడ్డు శివ పరారీలో ఉన్నాడు. అతడి కోసం అన్నికోణాల్లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నిందితుడు రాష్ట్రం దాటి వెళ్తుండగా పక్కా సమాచారంతో అతడిని పట్టుకున్నారు. -
నీకేమి అపకారం చేశాం...
సాక్షి, విజయనగరం టౌన్ / వీరఘట్టం: విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన నవ వరుడి హత్యకేసు కీలక మలుపు తిరిగింది. గరుగుబిల్లి మండలం ఐడీడీఏ పార్కు వద్ద సోమవారం రాత్రి బైక్‌పై వెళ్తున్న కొత్తగా పెళ్లయిన జంటపై ఆటోలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసి అందులో భర్తను ఇనుపరాడ్డుతో బలంగా కొట్టి హత్యచేసిన విషయం విధితమే. అయితే ఇది నగల కోసం దొంగలు చేసిన పని కాదని, ఇష్టం లేని పెళ్లి చేయడంతో భార్యే ప్రియుడితో కలిసి పథకం ప్రకారం హత్య చేసిందని జిల్లా ఎస్పీ జి.పాలరాజు మంగళవారం వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. దుండగులను పట్టుకునేందుకు రంగలోకి దిగిన పోలీసులు నలుమూలల వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. పెదమానాపురం వద్ద సోమవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో అనుమానాస్పదంగా కొందరు వ్యక్తులు ఆటోలో వెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో విచారణ చేయడంతో మెరుగు గోపి, సారిపల్లి రామకృష్ణ, గుర్రాల బంగార్రాజు, ఆటోడ్రైవర్ దేవరాపల్లి కిశోర్ నిజాన్ని అంగీకరించారు. సరస్వతి ఫేస్బుక్లో పరిచయమైన మడ్డు శివ అలియాస్ ఆది అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ నేపథ్యంలో మేనమామ అయిన గౌరీశంకరరావుతో ఇష్టం లేని పెళ్లి జరగడంతో భర్తను హతమార్చి ప్రియుడికి చేరుక కావాలని నిర్ణయించుకుంది. ఇందు కోసం శివ ద్వారా సరస్వతి విశాఖపట్నానికి చెందిన గోపీని కలిసి భర్తను హత్య చేస్తే బంగారం ఇస్తానని తెలిపింది. ముందుగా రూ.8వేలు నగదు, బంగారు ఉంగరం ఇచ్చింది. శివ మరో రూ.10వేలు అడ్వాన్సుగా ఇచ్చాడు. పథకం ప్రకారం వారు ఆటోలో కాపుకాసి ఉన్న ప్రదేశానికి రాగానే భర్తతో బైక్‌పై వెళ్తున్న సరస్వతి లఘుశంక తీర్చుకునేందుకు వెళతానని బైక్ దిగి పక్కకు వెళ్లింది. వెంటనే దుండగులు గౌరీశంకర్‌పై ఇనుపరాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. విచారణలో నేరం అంగీకరించడంతో నిందితులు ఉపయోగించిన ఫోన్లు, ఆటో, బంగారు ఆభరణాలు, ఇనుపరాడ్డు స్వాధీనపరుచుకున్నారు. నిశ్చేష్టులైన అత్తమామలు తమ కుమారుడిని కోడలే హత్య చేయించందన్న విషయం తెలియడంతో మృతుని తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. కట్టుకున్నవాడిని కడతేర్చడానికి నీకు చేతులు ఎలా వచ్చాయంటూ సరస్వతిపై మండిపడ్డారు. మంగళవారం స్వగ్రామం చిట్టపుడివలసకు వచ్చిన గౌరీశంకర్ మృతదేహం వద్ద తల్లిదండ్రులు భోరున విలపించారు. పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి కాని ఇలా భర్తనే పాశవికంగా మట్టుపెట్టడానికి చేతులెలా వచ్చాయని ప్రశ్నించారు. చిన్నతనం నుంచీ తాత గారి ఇంటి వద్దే ఉండి చదువుకుంటూ, అన్ని అవసరాలకూ బావ (భర్త గౌరీ శంకర్) ఇచ్చే డబ్బులతోనే జల్సాలు చేసిన సరస్వతి చివరకు తిన్న ఇంటి వాసాలే లెక్కపెట్టిందని గ్రామస్తులు వ్యాఖ్యానించారు. -
లక్షలు పాయె.. బహుమతి రాకపాయె!
చిత్తూరు : మోసానికి ఆకాశమే హద్దుగా మారింది. మోసపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. తాజాగా చిత్తూరు జిల్లా బి.కోత్తకోటలో ఇలాంటి సంఘటనే శనివారం వెలుగులోకి వచ్చింది. బి.కొత్తకోట నందిశెట్టి వీధికి చెందిన కె.సరస్వతి, బి.హరిశ్చంద్రప్రసాద్ అక్కాతమ్ముళ్లు. సరస్వతి రెండేళ్ల క్రితం ఉపాధి కోసం కువైట్‌కు వెళ్లగా హరి స్థానికంగా క్షౌర వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సరస్వతి కువైట్‌లో వివా సిమ్ కార్డు తీసుకుంది. మార్చి 28న వివా కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగి పేరుతో ఆమెకు ఫోన్ వచ్చింది. మీరు వినియోగిస్తున్న నంబరుకు రూ.44.70 లక్షల నగదు, 10 తులాల బంగారం, ఒక ఐఫోన్ బహమతి వచ్చిందంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. ఈ విషయాన్ని ఆమె బి.కొత్తకోటలో ఉన్న తమ్ముడు హరికి ఫోన్లో చెప్పగా ఇలాంటి వాటిని నమ్మవద్దన్నాడు. అయినా బహుమతి వచ్చింది నిజమేనని నమ్మి కువైట్ నుంచే రూ.80 వేలను వారు చెప్పిన ఖాతాకు జమ చేసింది. తర్వాత హరి కూడా వరుసగా రూ.35 వేలు, రూ.45,150, రూ.45,200, రూ.45 వేలు, రూ.50 వేల చొప్పున నాలుగుసార్లు, రూ.20 వేలు, రూ.52 వేలు, రూ.30 వేలు, రూ.10 వేలు, రూ.25 వేలు చొప్పున ఐదుసార్లు మొత్తం రూ.7.13 లక్షలను బి.కొత్తకోట బ్యాంకుల నుంచి ఫోన్లో చెప్పిన ఖాతాలకు జమ చేశాడు. నగదు జమ చేసి నెల గడిచినా బహుమతి సొమ్ము అందలేదు. దీంతో హరి వివా కంపెనీ ఉద్యోగులుగా చెప్పుకొన్న ఇద్దరు వ్యక్తుల నంబర్లకు హరి ఫోన్ చేయగా ఇంకో రూ.1.75 లక్షలను బ్యాంకులో జమ చేస్తే బహుమతిగా వచ్చిన నగదు పంపిస్తామని చెప్పడంతో అనుమానం వచ్చింది. తాను నగదు డిపాజిట్ చేసిన బ్యాంకు ఖాతాలు కువైట్‌కు చెందినవా కాదా అని తెలుసుకునేందుకు స్థానిక ఓ బ్యాంకు అధికారిని సంప్రదించగా అవి గోరఖ్‌పూర్ బ్యాంకుకు చెందినవిగా గుర్తించారు. దీంతో మోసపోయామని గ్రహించి స్థానిక ఎస్ఐ మల్లికార్జునను ఆశ్రయించాడు. కువైట్ టెలికం రెగ్యులేటరీ అథారిటీ పేరిట సరస్వతికి అందిన లేఖలు, ఎప్పుడెప్పుడు ఎంత నగదును జమ చేసింది తెలుపుతూ ఆ వివరాలు అందజేశాడు. వీటిని పరిశీలించిన ఎస్ఐ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. -
పరుగుల రాణికి కాళ్లు, చేతులు లేకపోతేనేం....
న్యూఢిల్లీ: ‘నాకు పట్టరానంత కోపం, ఆవేశం వచ్చేది. అంతలోనే బాధ, భయం, కలత, కలవరం కలిగింది. నాకే ఎందుకు ఇలా అయింది. నేనేమి తప్పుచేశాను. ఏదో తప్పు చేశానేమోనన్న ఆలోచన. కర్మ ఫలం కాబోలు! అనే నిర్లిప్తత. ఊహు, దొంతర్లుగా దొర్లిపోతున్న ఇలాంటి ఆలోచనలను, అనుమానాలను పక్కన పెట్టాల్సిందే. విలువైన సమయం జారిపోకుండా జీవితంలో ముందుకు సాగాల్సిందే, పైకి రావాల్సిందే అన్న పట్టుదలతో నా జీవితం మళ్లీ చిగురించింది’ ఈ మాటలు శాలిని సరస్వతి ఇటీవల ఫేస్బుక్లో వ్యక్తం చేసినవి. ఆమె కాంబోడియాకు వెళ్లినప్పుడు అనూహ్యంగా జబ్బు పడ్డారు. అత్యంత అరుదైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్తో ఆమె శరీరంలో ఒక్కో అవయవం చచ్చుపడి పోవడం ప్రారంభమైంది. వెంటనే ఆమె చికిత్స కోసం కాంబోడియా ఆస్పత్రిలో చేరారు. సకాలంలో జబ్బు నయం కాకపోవడంతో ఒక కాలు, ఆ తర్వాత మరోకాలు. ఒక చేయి, ఆ తర్వాత మరోచేయి శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు తొలగించాల్సి వచ్చింది. రెండు కాళ్లు, రెండు చేతులు లేకుండా ఒట్టి పోయిన జీవితం తనకే ఎందుకంటూ నాటి పరిస్థితుల్లో మానసికంగా తాను అనుభవించిన బాధను, ఆందోళనను, ఆ పరిస్థితిని జయంచేందుకు తీసుకున్న దఢనిశ్చయాన్ని, జయంచానన్న ఆత్మ సంతప్తిని చెప్పేందుకు ఫేస్బుక్లో ఆమె తన భావాలను ఈ మాటల్లో వ్యక్తం చేశారు. రెండు కాళ్లు, రెండు చేతులు లేకపోతేనేమీ ఆమె ఇప్పుడు ఎన్నో అవార్డులు అందుకున్న ప్రముఖ బ్లేడ్ రన్నర్ శాలినీ సరస్వతి. ఆమె గతేడాది బెంగళూరులో జరిగిన ప్రతిష్టాకరమైన ‘టీసీఎస్ 10కే రేస్’లో పాల్గొనడమే కాకుండా రెండు గంటల్లో ఆ రేస్‌ను పూర్తి చేయడం ద్వారా దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పుడు 32 ఏళ్లున్న శాలినికి ఐదేళ్ల క్రితమే పెళ్లియింది. పెళ్లైన కొత్తలో విహార యాత్రకు కాంబోడియా వెల్లడంతో దురదష్ణవశాత్తు జబ్బు దాపురించింది. అప్పుడు ఆమెకు పూర్తి అండగా నిలిచిన ఆమె భర్త ప్రశాంత్ చౌడప్ప ఆ తర్వాత ఆమె బ్లేడ్ రన్నర్‌గా రాణించడానికి కూడా ఎంతో సహాయపడ్డారట. శాలిని 2013లో మొదటిసారి కత్రిమ కాళ్లను ధరించారు. ఇంట్లో మూలకు కూర్చొని కష్ణా రామా అంటూ బతకడం ఆమెకు దుర్భరం అనిపించింది. కాళ్లకు బ్లేడ్స్ ధరించి నడవడం ప్రారంభించారు. కోచ్‌ల దగ్గర ప్రత్యేక శిక్షణ పొంది రన్నింగ్ రేసుల్లో పాల్గొనడం ప్రారంభించారు. ‘జీవితంలో నాకు కాళ్లు ఉంటేనేమీ లేకపోతేనేమీ నా నిర్ణయాలు నాకుంటాయి. నా ఆశయాలు నాకుంటాయి. ఒక పర్వతం ఎక్కి దిగితే ఎక్కాల్సిన మరో పర్వతం కనిపిస్తుందంటారు. ఆ మాటేమోగానీ నేను జీవించి ఉన్నంత వరకు పరుగెత్తుతూనే ఉంటాను. పరుగాపను. పరుగెత్తుతున్నప్పుడు రెక్కలు కట్టుకొని గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. ఎంతో ఆనందం వేస్తోంది. ఆనందంకన్నా జీవితం మరేముంటుంది’ అన్న పదాలతో ఆమె ముగించిన ఫేస్‌బుక్‌ను ఇప్పటికే పది లక్షల మంది చదివారు. -
భార్యపై కత్తితో దాడి చేసిన భర్త
పుట్లూరు (శింగనమల) : పుట్లూరు మండలంలోని గొల్లపల్లిలో సర్వస్వతి అనే మహిళపై ఆమె భర్త దాడి చేసిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. మద్దలపల్లి గ్రామానికి చెందిన రమేష్, గొల్లపల్లి గ్రామానికి చెందిన సరస్వతికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో నాలుగేళ్లుగా సరస్వతి పుట్టింటి వద్దే ఉంటోంది. భార్యపై అనుమానంతో రమేష్ ఆదివారం కత్తితో దాడి చేశాడు. దాడిని అడ్డుకోబోయిన సరస్వతి అక్క చంద్రకళ కూ స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన సరస్వతిని తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్సకోసం అనంతపురానికి తీసుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తహసీల్దార్‌కు షోకాజ్ నోటీసు
గుత్తిరూరల్ : సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన సమాచారం ఇవ్వని తహసీల్దార్ సరస్వతికి రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ నుంచి మంగళవారం నోటీసులు జారీ అయ్యాయి. పట్టణానికి చెందిన దుర్గా ప్రసాద్‌రెడ్డి పట్టణంలో ఎన్ని మీ సేవ కేంద్రాలు ఉన్నాయి? వాటి నిర్వాహకుల పేర్లు, ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహిస్తున్నారా? లేదా తగిన ఆధారాలతో ఇవ్వాలని గత ఏడాది ఆగష్టు 17, తిరిగి ఆగష్టు 23న రెండు మార్లు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగారు. తహసీల్దార్ తమ వద్ద సమాచారం లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఫిర్యాదుదారుడు ఆర్డీఓకు అప్పీల్ చేశారు. ఆర్డీఓ నుంచి కూడా సరైన సమాధానం రాకపోవడంతో రాష్ట్ర కమిషన్‌కు అప్పీలు చేశాడు. స్పందించిన కమిషన్ విచారణ నిమిత్తం ఈనెల 27న అనంతపురం ఆర్డీఓ కమిషన్ ఎదుట హాజరుకావాలని షోకాజ్ నోటీసులు జారీ చేశారని ఫిర్యాదుదారుడు దుర్గాప్రసాద్‌రెడ్డి తెలిపారు. -
మధుకర దీక్ష బాసరకే ప్రత్యేకత
-
మహిళ మృతదేహం లభ్యం
వజ్రకరూరు: మండల పరిధిలోని చాయాపురం గ్రామ సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువలో మహిళ మృతదేహాన్ని వజ్రకరూరు పోలీసులు శనివారం రాత్రి గుర్తించారు. వజ్రకరూరు ఎస్ఐ జనార్ద¯ŒS నాయుడు తెలిపిన వివరాల మేరకు..పెంచలపాడు గ్రామానికి చెందిన సరస్వతి (26), ఆమె భర్త నాగభూషణంలు కొనకొండ్ల సమీపంలో పొలాన్ని కౌలుకు తీసుకొని మిరప సాగు చేస్తున్నారు. మిరప పంటకు శుక్రవారం నీరు పెడుతుండగా డీజిల్ ఇంజ¯ŒS ఆగిపోయింది. సరస్వతి ఇంజి¯ŒSలోకి డీజిల్ పోస్తూ ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హంద్రీనీవా కాలువలోకి కాలుజారి పడిపోయింది. మృతదేహాన్ని శనివారం రాత్రి చాయాపురం వద్ద గుర్తించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మనిషి మూడు రకాల రుణాలతో జన్మిస్తాడు
శంకర విజయేంద్ర సరస్వతి రాజమహేంద్రవరం కల్చరల్ : ప్రతి మనిషి దేవరుణం, రుషి రుణం, పితృరుణం అనే మూడు రకాల అప్పులతో జన్మిస్తాడని కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారి శంకర విజయేంద్రసరస్వతి అన్నారు. రాజమహేంద్రవరం నగరంలోని నందం గనిరాజు సెంటరులో కందుకూరి శివానందమూర్తి సత్సంగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన అనుగ్రహ భాషణం చేశారు. తపస్సు ద్వారా దేవతల రుణాన్ని, వేదాధ్యయనం ద్వారా రుషి రుణాన్ని, సంతానం ద్వారా పితృరుణాన్ని తీర్చుకోవాలన్నారు. దారేషణ, ధనేషణ, పుత్రేషణ అనే తాపత్రాయాలతో మనిషి జీవితం గడుపుతాడు కానీ, సత్సంగాన్ని మనిషి అలవరుచుకోవాలని హితవు చెప్పారు. ఆత్మనియంత్రణ, ఆత్మపరిశోధన చాలా అవసమని, ఆత్మానుభూతి కలిగితే, ఇక లోకంతో పని ఉండదన్నారు. సర్వసంగ పరిత్యాగం అందరికీ కుదరదని, దేశభక్తి, దైవభక్తి, సంస్కృతభాషాభిమానం, సదాచారంపై ఆసక్తి తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. సత్సంగం నిర్వాహకులు వాడ్రేవు మల్లపరాజు దంపతులు, వాడ్రేవు వేణుగోపాల్ దంపతులు, ప్రముఖ ఆడిటర్ వి.భాస్కరరామ్, డాక్టర్ టీవీ నారాయణరావు, ప్రముఖ న్యాయవాది మామిడన్న శేషగిరిరావు పాల్గొన్నారు. వేద విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి హాజరైన వేదవిద్యార్థులతో శంకర విజయేంద్ర సరస్వతి ముఖాముఖి మాట్లాడారు. అగ్నికార్యమంత్రాలు విద్యార్థులు చదువుతుంటే ఆసక్తిగా విన్నారు. మేధావీ భూయాసం, తేజస్వీభూయాసం ఇత్యాదులను పలుకుతున్నప్పుడు, వేళ్లతో శిరస్సును, ఇతర అంగాలను ఎలా తాకాలో చూపించారు. -
సేవాపథంలో షష్టిపూర్తి
కోనసీమలో తొలి మహిళా వైద్యురాలు గోటేటి సరస్వతి సత్యసాయిబాబా ఆదర్శంగా 60 ఏళ్లుగా వైద్యసేవలు గుర్తింపుగా విశ్వమాత ఈశ్వరమ్మ జీవనసాఫల్య పురస్కారం అమలాపురం టౌ¯ŒS : ఆమె పుట్టపర్తి భగవా¯ŒS సత్యసాయి సేవా మార్గంలోనే అరవై ఏళ్లుగా అడుగులు వేస్తున్నారు. వృత్తి రీత్యా వైద్యురాలైన ఆమె ఆ వృత్తి ద్వారానే ప్రజలకు ఉచిత సేవలు అందించారు. అమలాపురంలోనే కాదు.. కోనసీమలో తొలి మహిళా వైద్యురాలిగా డాక్టర్ గోటేటి సరస్వతి ఈ ప్రాంతంలో అందరికీ సుపరిచితురాలే. అందుకే ఆమెను భగవా¯ŒS సత్యసాయి బాబా తల్లి విశ్వమాత ఈశ్వరమ్మ జీవన సాఫల్య పురస్కారం వెతుక్కుంటూ వచ్చి వరించింది. పుట్టపర్తి సత్యసాయి సేవా సంస్థలు 60 ఏళ్లుగా వివిధ రూపాల్లో సేవలు అందిస్తున్న వారిని రెండు తెలుగు రాష్ట్రాల్లో నలుగురిని ఈ పురస్కారాలకు ఎంపిక చేస్తే అందులో ఒకరు డాక్టర్ సరస్వతమ్మ. రాజమహేంద్రవరంలో గల సత్యసాయి సేవా మందిరంలో సత్యసాయి సేవా సంస్థల రెండు రాష్ట్రాల అధ్యక్షుడు ఎ¯ŒSజీ చలం చేతుల మీదుగా డాక్టర్ సరస్వతమ్మ గురువారం ఈ జీవన సాఫల్య పురస్కారం అందుకున్నారు. డాక్టర్ సరస్వతమ్మ కూడా రాష్ట్ర సత్య సాయి సేవా సంస్థల్లో అనేక కీలక పదవులు చేశారు. సత్యసాయి బాబాకు అత్యంత విశ్వసనీయంగా ఉన్న వ్యక్తుల్లో సరస్వతమ్మ ఒకరు. అమలాపురం నుంచి సేవా ప్రస్థానం అమలాపురం యరమ్రిల్లివారి వీధిలో నివసిస్తున్న ఆమె 1955 నుంచి పట్టణంలో ఆస్పత్రి నిర్వహిస్తూ ప్రజల నుంచి నామమాత్రపు ఫీజలతో ఎన్నో ఏళ్లు వైద్య సేవలు అందించారు. అప్పటి నుంచే సర్వతిమ్మ పుట్టపర్తి సత్యసాయి బాబా చేస్తున్న సేవలకు ప్రభావితురాలై తాను కూడా ఆ సేవా మార్గాన్నే ఎంచుకున్నారు. తన ఆస్పత్రి ద్వారా కొన్నాళ్లు ఉచిత వైద్యం అందించి పుట్టపర్తికి వచ్చే యాత్రికులకు అక్కడి ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు అందించారు. రాష్ట్రవ్యాప్తంగా సత్యసాయి సేవా సంస్థలు నిర్వహించే ఉచిత వైద్య శిబిరాల్లో సేవలు అందించారు. ప్రస్తుతం 83 ఏళ్ల వయసుతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటూ సత్యసాయి సేవా సంస్థల ద్వారా సేవలు అందిస్తున్నారు. అమలాపురంలో నిర్మించిన సత్యసాయి కళ్యాణ మండపం, సత్యసాయి సేవా మందిరం నిర్వహణ బాధ్యతలను కూడా ఆమె నిర్వర్తిస్తున్నారు. జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ఆమెను అమలాపురంలో పలువురు ప్రముఖులు శుక్రవారం సత్కరించారు. సరస్వతమ్మ ఇంటికి సత్యసాయి.. సత్యసాయి భక్తురాలైన డాక్టర్ సరస్వతమ్మ ఇంటికి 1964 ప్రాంతంలో సత్యసాయి బాబా స్వయంగా వచ్చారు. ఆమె ఇంటి నుంచే బాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పటంతో పాటు డాక్టర్‌గా సరస్వతి చేస్తున్న వైద్య సేవలను కొనియాడారు. 1986 ప్రాంతంలో బీజేపీ నేత, మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి కూడా ఆమె ఇంటికి వచ్చి చేస్తున్న సేవలకు కితాబు ఇచ్చారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కూడా సరస్వతి చేస్తున్న సేవలకు మెచ్చి ఆమె ఇంటికి స్వయంగా వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు. మృగ్యమైన సేవాభావం ‘మా రోజుల్లో వైద్య వృత్తి చేపట్టిన వారిలో వ్యాపార దృక్పథం ఉండేది కాదు. వారిలో సేవా భావం ఉండేది. ఆస్పత్రి నిర్వహణ, సిబ్బంది జీతాల కోసం రోగుల నుంచి నామమాత్రపు ఫీజులు తీసుకునే వా’రని జీవన సాఫల్య పురస్కారం అందుకున్న డాక్టర్ సరస్వతమ్మ అన్నారు. పురస్కారం అందుకున్న సందర్భంగా ’సాక్షి’ శుక్రవారం అమలాపురంలోని ఆమె స్వగృహంలో కలసి మాట్లాడినప్పుడు నాడు...నేడు వైద్య సేవల్లో ఉన్న వ్యత్యాసాన్ని ఆవేదనాభరితంగానే వివరించారు. ‘అప్పట్లో నా వద్దకు వచ్చే రోగుల ఆర్థిక స్థితిగతులను కూడా గమనించే దాన్ని. ఫీజుగా వారిచ్చినంత మేము పుచ్చుకున్నంత అన్నట్లుగా డబ్బులు తీసుకునేవాళ్లం. నేనైతే వైద్యం చేసి ఇన్ని డబ్బులు ఇవ్వమని ఎప్పుడూ అడగలే’దని ఆమె చెప్పారు. రోగులు పేదోళ్లైతే వెళ్లేటప్పుడు రిక్షాకు డబ్బులిచ్చి పంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. – డాక్టర్ సరస్వతమ్మ -
సరస్వతీ సమర్చనే అవధానం
ధూళిపాళ మహాదేవమణి ఘనంగా ద్విగుణిత అష్టావధానం రాజమహేంద్రవరం కల్చరల్ : చదువుల తల్లి వాణిని కనుల ముందు ఆవిష్కరించే సరస్వతీ సమర్చనే అవధానమని పద్యకళాతపస్వి డాక్టర్ ధూళిపాళ మహాదేవమణి అన్నారు. జనభావన, విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం పీఠంలో అవధాని తాతా శ్రీనివాస రమా సత్యసందీప్ నిర్వహించిన ద్విగుణిత అష్టావధానంలో మహాదేవమణి అవధాన సంచాలకునిగా వ్యవహరించి ప్రసంగించారు. అలరించిన అష్టావధానం శతావధానాలు, ద్విశతాధానాలు చేసిన ఉద్దండప్రతిభావంతులు సంధించిన సాహితీ, అస్తశస్త్రాలను నూనూగు మీసాల సందీప్ సమర్థంగా ఎదుర్కొన్నారు. నిషిద్ధాక్షరి పద్మవ్యూహాలను లాఘవంగా దాటుతూ, ఛందోనియమాలను పాటిస్తూ, యతిప్రాసల లెక్కలను కట్టుతప్పకుండా ద్విగుణిత అష్టావధానాన్ని పూర్తి చేశారు. అవధానానికి అధ్యక్షుడిగా వ్యవహరించిన ఉమర్ అలీషా సభను వర్ణిస్తూ ఒక పద్యం చెప్పమన్నారు. ‘సమరసభావాత్మకమై– సుమనస్సుజ్ఞేయమగుచు, సూఫీ మయమై–ఉమరాలీషా నెలవై–అమలంబుగ ఈ సభ అలరుచుండెన్’అని సందీప్ వర్ణించారు. నవ్వులు పూయించిన అప్రస్తుతాలు పద్యపూరణాలు సీరియస్‌గా సాగుతున్నాయి. అప్రస్తుత ప్రసంగంచేసే వెంకట లక్ష్మి ఒక సందేహం లేవనెత్తింది. ‘అవధానిగారూ! మా వీధిలో అందరికీ కుక్కలున్నాయి. అందరూ ఇంటిముందు ‘కుక్క ఉన్నది జాగ్రత్త’ అని బోర్డుపెట్టుకున్నారు. మా ఇంట కుక్కలేదు. నేను ఏమని బోర్డుపెట్టుకోవాలి?’ అవధాని సమాధానం చెబుతూ ‘వెంకటలక్ష్మి ఉన్నది’ అని బోర్డు పెట్టుకుంటే చాలునన్నారు. మహ్మద్‌ఖాదర్ ఖాన్ తన వంతు ప్రశ్నగా ‘అవధానిగారూ! వేంకటేశ్వరస్వామికి, మాకు బంధుత్వంఉంది, ఏమిటో చెబుతారా?’ అనడిగారు. వేంకటేశ్వరస్వామి బీబీనాంచారమ్మను చేపట్టాడని అవధాని సమాధానం ఇచ్చారు. పాత్రలు–పాత్రధారులు శతావధానిని ఫుల్లాభట్ల నాగ శాంతి స్వరూప, ద్విశతావధానిని ఆకెళ్ల బాలభానులు నిషిద్ధాక్షరి. మంగళంపల్లి పాండురంగ విఠల్, పద్యకవి తిలక ఎస్వీ రాఘవేంద్రరావులు సమస్య. చిరువోలు విజయ నరసింహారావు, ఎస్పీ గంగిరెడ్డిలు దత్తపది, ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, ఓలేటి బంగారేశ్వరశర్మలు వర్ణన, సప్పా దుర్గాప్రసాద్, రామచంద్రుని మౌనికలు ఆశువు, ఖాదర్‌ఖాన్, వెంకట లక్ష్మిలు అప్రస్తుత ప్రసంగం. తిరిగి నాగశాంతి స్వరూప, వెంకటలక్ష్మిలు ఘంటావధానం . ప్రసాదవర్మ వారగణనం. అవధానం సంచాలకత్వం– డాక్టర్« దూళిపాళ మహాదేవమణి. ఆశీస్సులు–చింతలపాటి శర్మ -
నృత్య సమ్మోహనం
నృత్య సమ్మోహనం సాక్షి, తిరుమల: తిరుమల ఆస్థాన మండపంలో ఆదివారం దక్షిణాది రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, మోహినీయాట్టం నృత్యరూపకం అబ్బురంగా సాగింది. బెంగళూరుకు చెందిన సరస్వతి బృందం భక్తిరస సంకీర్తనలతో ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించింది. దక్షిణాది సంప్రదాయ నృత్యాలు కూచిపూడి, మోహినీయాట్టంతో కళాకారుల అభినయానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కళాకారులకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. -
ఆ స్థితికి సిగ్గు పడుతున్నా..
‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూలో నటి ఊర్వశి శారద ఆవేదన ఊర్వశి శారద సినీ రంగంలో ఓ ట్రెండ్ సెట్టర్. దాదాపు 350కిపైగా సినిమాలు, 60ఏళ్ల సినీ ప్రస్థానం, విభిన్నమైన పాత్రలు. మూడుసార్లు జాతీయ ఉత్తమనటిగా అవార్డు సొంతం చేసుకున్నారు. స్వతహాగా తెలుగునటి అయిన శారదను మలయాళ పరిశ్రమ అక్కున చేర్చుకుంది. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధించిన శారద ఆర్షవికాస పరిషత్ సంస్థ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడానికి విజయవాడ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు.. సాక్షి : సరస్వతి అయిన మీరు శారదగా ఎలా మారారు? శారద : సినిమా రంగంలో అప్పటికే ఇద్దరు సరస్వతులు ఉన్నారు. అందువల్ల శారదగా మారాల్సి వచ్చింది. సాక్షి : సీనియర్ నటిగా మీకు రావాల్సిన అవార్డులు రాలేదంటారు. నిజమేనా? శారద : ప్రేక్షకుల అభిమానాన్ని మించిన అవార్డు లేదు కదా.. సాక్షి : మీరు తెలుగువారైనా మీలోని ప్రతిభను గుర్తించినవారు మలయాళీలు కదా? శారద : మలయాళీలు స్నేహప్రియులు. వారు ఇప్పటికీ నన్ను అమ్మ, అక్క అనే పిలుస్తారు. సాక్షి : నేటి సినిమాలను చూస్తే మీకేమనిపిస్తుంది? శారద: చాలా సందర్భాల్లో సిగ్గుపడుతుంటాను. కుటుంబ సమేతంగా చూడదగిన సినిమాలు లేవు. హీరోకు పూర్తి డ్రస్సులు.. హీరోయిన్లకు పీలికలు. సాక్షి : నేటి సినిమాల్లో మెలోడీలకు స్థానం లేదన్న దానిపై మీ కామెంట్ శారద : నిజమే. నేటి సినీ సాహిత్యం చాలా సందర్భాల్లో గుర్తుకురావడమే లేదు. సాక్షి : శారద సినీనటి కాకుంటే ఏమయ్యేవారు? శారద : ప్రశ్నే లేదు. శారద సినిమాల కోసమే పుట్టింది. శారద ఊపిరి సినిమానే.. సాక్షి : మీరు గర్వపడే సందర్భం.. శారద : ఒకే సినిమా పలు భాషల్లో నటించినప్పుడు అన్ని భాషల్లోనూ ప్రధాన పాత్ర పోషించడం సాక్షి : ఎన్టీఆర్ అవార్డు గురించి చెప్పండి శారద : నా జీవితంలో మరిచిపోలేని సంఘటన ఎన్టీఆర్ అవార్డు అందుకోవడమే. ఎన్టీఆర్ మహానటుడు. ప్రతిభను గుర్తించడం ఆయన నైజం. సాక్షి : ఐదు భాషల్లో నటించిన మీకు ఏ భాష సౌకర్యంగా ఉంటుంది? శారద : భాషా భేదమేమీ లేదు. ఏ భాషలోనైనా ప్రతిభ ఆధారంగానే అవకాశం దక్కింది. సాక్షి : నటిగా మీరు పొందిన అనుభూతి? శారద : అభిమానులు నన్ను అన్ని సంద ర్భాల్లోనూ తోబుట్టువుగా భావించారు. ‘సాక్షి’ తొలినుంచి నన్ను అభిమానిస్తూనే ఉంది. టీమ్ మొత్తానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. -
నాటాలో సరస్వతికి ఫస్ట్ ర్యాంక్
అమలాపురం టౌన్ : కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్(నాటా) ప్రవేశ పరీక్షలో తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన కల్వకొలను సరస్వతి స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించింది. నాటా’లో ప్రవేశానికి ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకూ దశలవారీగా జరిగిన పరీక్షల్లో సరస్వతి 126 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. తద్వారా హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సీటు సాధించింది. అమలాపురం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కల్వకొలను తాతాజీ కుమార్తె అయిన సరస్వతి చిన్ననాటి నుంచి చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తూ రాణిస్తోంది. రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించిన ఆమెను పలువురు పట్టణ ప్రముఖులు అభినందించారు. -
సరస్వతికి మగ బిడ్డ
జూలో మగ పిల్లకు జన్మనిచ్చిన ఖడ్గమృగం బహదూర్‌పురా: నెహ్రూ జూలాజికల్ పార్కులోని ఖడ్గమృగం సరస్వతి శుక్రవారం ఒక మగ పిల్లకు జన్మనిచ్చింది. కాన్పూర్ జూ నుంచి మూడేళ్ల క్రితం జంతువు మార్పిడిలో భాగంగా సరస్వతి, సూరజ్ అనే ఖడ్గ మృగాలను జూకు తీసుకువచ్చారు. జూకు వచ్చే నాటికే గర్భంతో ఉన్న సరస్వతి శుక్రవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం బుల్లి ఖడ్గం మృగం బరువు 50 కిలోల ఉందన్నారు. జూపార్కు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 6న బుల్లి ఖడ్గమృగానికి నామకరణం చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
పెళ్లి చేసుకుని మోసం చేశాడు
సేలం: ప్రేమించి తనను పెళ్లి చేసుకుని మోసం చేయడంతో పాటుగా రెండో పెళ్లికి సిద్ధ పడ్డాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సేలం వాలప్పాడికి చెందిన సరస్వతి(27), సేలం నెత్తి మేడుకు చెందిన సుకుమార్(28)లు నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుకుమార్ భార్య సరస్వతితో కలసి అక్కడే కాపురం పెట్టాడు. రెండు రోజుల క్రితం ఇంటర్వ్యూ నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పిసేలంకు వచ్చేశాడు. భర్త ఢిల్లీ వెళ్లాడని భావించిన సరస్వతికి శుక్రవారం వచ్చిన ఓ సమాచారం షాక్‌కు గురి చేసింది. ఢిల్లీ వెళ్లకుండా, సేలంకు వచ్చిన సుకుమార్ మరో యువతితో పెళ్లికి సిద్ధ పడ్డాడు. దీంతో హుటాహుటిన సేలం చేరుకున్న సరస్వతి అన్నదానం పట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం జరగనున్న వివాహాన్ని అడ్డుకోవాలని విన్నవించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు. -
ప్రభుత్వ ఆస్పత్రిలో బాలింత మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణం బంధువుల ఆరోపణ ఆత్మకూరు : స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన సరస్వతి(24) అనే బాలింతరాలు జిల్లా కేంద్రంలోని సర్వజనాస్పత్రిలో మంగళవారం తెల్లవారు జామున మృతి చెందింది. అక్కడి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆమె మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. వారం రోజుల కిందట గర్భిణి అయిన సరస్వతిని ప్రసవం కోసం కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఆమె ఇద్దరు ఆడపిల్లల(కవలలు)ను ప్రసవించింది. అప్పటికి ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సోమవారం ఆమెను పరీక్షించిన వైద్యులు రక్తం తక్కువగా ఉందని, రక్తం ఎక్కించాలని సూచించారు. దీంతో ఆమెకు రక్తం ఎక్కించారు. అప్పటి నుంచి ఆమె అస్వస్థతకు గురైంది. తీవ్ర ఆయాసంతో బాధపడుతోంది. విషయం వైద్యులకు తెలుపగా వారు ఇంజక్షన్లు వేశారు. ఆయాసం తగ్గకపోగా మరింత ఎక్కువై మంగళవారం తెల్లవారుజామును 3 గంటల సమయంలో ఆమె మృతి చెందిందని బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై వైద్యులను ప్రశ్నించగా ‘మేం.. ఏంచేయాలి’ అని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని వారు ఆరోపించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లనే సరస్పతి మృతి చెందిందని వారు వాపోయారు. మొదటి కాన్పులో సరస్వతికి ఆడపిల్ల పుట్టింది. రెండవ కాన్పులోనూ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. తల్లిలేని ఆ పిల్లలను చూసి.. వారి ఆలనాపాలనా ఎవరు చూస్తారంటూ బంధువులు, గ్రామస్తులు విలపించారు. హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చు... గైనిక్ ఇన్చార్జ్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం : సరస్వతి మృతికి కారణంగా హార్ట్ ఫెయిల్యూర్ కావచ్చునని అనంతపురం ప్రభుత్వాస్పత్రి గైనిక్ ఇన్చార్జ్ హెచ్ఓడీ డాక్టర్ షంషాద్‌బేగం తెలిపారు. ప్రసవం కోసం ఆమె ఈనెల 6న ఆస్రత్రిలో చేరిందన్నారు. రక్త పరీక్షలు చేయగా ఆమెకు 8.4 హెచ్‌బీ ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెకు రక్తాన్ని ఎక్కించాం. అనంతరం సిజేరియన్ చేయగా ఇద్దరు కవల ఆడపిల్లలు పుట్టారు. మరుసటి రో జు ఆమె దగ్గు, ఆయాసం వస్తోందని తెలిపింది. ఫిజిషియన్ సలహా మేరకు మరోసారి రక్తాన్ని ఎక్కించాం. పరిస్థితి సీరియస్ కావడంతో ఏఎంసీకి మార్చాం. అ యినా దురదృష్టవశాత్తు ఆమె ఆరోగ్య క్షీణించి మృతి చెందింది. గ్రామీణ ప్రాంతాల నుంచి అనీమియా కేసులు అధికంగా వస్తున్నాయని డాక్టర్ వివరించారు. -
ఆ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటాను
శారద... అసలు పేరు సరస్వతి...ఆమె వయసు ఏడుపదులు అని చెబితేనే గాని నమ్మలేని లావణ్యరూపం...ఆధ్యాత్మిక ప్రపంచంలో హాయిగా గడుపుతూ...మిత్రులతో సంతోషంగా క బుర్లు చెబుతూ...జీవిత ప్రయాణం కులాసాగా కొనసాగిస్తున్నారు...చెట్లంటే ప్రాణంపెట్టే శారద చెట్లను నాటమని ఉద్యమించుదామనుకుంటున్నారు...చెన్నై సరస్వతీ వీధిలో ఉంటున్న శారదను కలిసినపున్పడు ఎన్నో ఆసక్తికరమైన, విషయాలను వివరించారు. కాశ్మీర్లో ఆది శంకరాచార్యుల పీఠం, సూళ్లూరుపేట దగ్గర దర్గా, కన్యాకుమారి రాక్ మెమోరియల్, పెనుగొండ యోగివేమన సమాధి వంటి ప్రదేశాలకు వెళ్లి ధ్యానం చేయడమంటే చాలా ఇష్టం. భక్తి, జ్ఞాన, వైరాగ్య భావనలు కలగాలని ప్రార్థిస్తాను. ఎందుకంటే ఎవరి తలరాతనైనా ఆయనే కదా మార్చేది. ప్రస్తుతం ఖాళీ ఉంటే అంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో గడుపుతాను.కాకినాడలో ఒక పూజారి ఉన్నారు. ఆయన నన్ను ‘అక్కయ్య’ అని అప్యాయంగా పిలుస్తారు. ఆయనకు, నాకు ఏం ఋణమో తెలీదు మరి. నేను ఏనాడో చేసిన పుణ్యమే ఇదంతా అనుకుంటాను. వైరాగ్యం, భక్తి, స్నేహం... వీటిని అలవర్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాను. అందువల్ల సమయం హాయిగా గడుస్తోంది. నేను ‘గొప్పదాన్ని’ అనే భావనే లేదు నాకు. ప్రస్తుతం ఒక మళయాళ సినిమాలో నటిస్తున్న సినీనటి శారద, పలకరించడంతోనే హాయిగా కడుపునిండుగా నవ్వుతూ మాట్లాడటం ప్రారంభించారు.‘‘నేను సినిమా కంటే బయట ప్రపంచంతో ఎక్కువ కాంటాక్ట్‌లో ఉన్నాను. వాళ్లని కలవటం వల్ల నేనే ఏదీ మిస్ అవ్వట్లేదు. అది ఒక రకమైన ఎనర్జీని ఇస్తుంది. ఇంతకాలంగా అంటే సుమారు 50 సంవత్సరాలుగా నా స్నేహితులతో నా యాత్ర చక్కగా సాగిపోతోంది. వాళ్లంతా వారి వారి ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు నన్ను ఆహ్వానిస్తుంటారు. వాళ్లు చూపించే అభిమానాన్ని నేను తోసెయ్యలేకపోతున్నాను. ఏడుపదుల వయసులో ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అందువల్ల ప్రస్తుతం ఫంక్షన్లకి వెళ్లడం ఇబ్బంది అవుతోంది. నాకు చిన్నతనంలో నుంచే ఆధ్యాత్మికత అలవాటైందనుకుంటాను. తెనాలిలో రెండు వందల ఏళ్లనాటి చర్చ్ ఒకటి ఉంది. నా చిన్నతనంలో అక్కడ ఆడుకునేదాన్ని. ఇంకా... మా చుట్టుపక్కల కూడా అందరూ ఆధ్యాత్మిక సంబంధీకులు ఉండేవారు. వారి దగ్గర మడి, ఆచారం, దైవ చింతన చూసి చిన్నతనం నుంచే చూశాను. ఆ ధోరణి నాకు తెలియకుండా అప్పుడే ‘నాకు’ అలవడి ఉంటుందనుకుంటాను. ఇప్పటికీ పురాతన దేవాలయాలకు వెళ్లడమంటే ఇష్టం. చర్చ్‌కి కూడా వెళ్తాను. ఆ ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఏదో వైబ్రేషన్స్ వస్తుంటాయి. మనం ఎప్పుడూ చిన్నవాళ్లమే. అన్నీ తెలుసుకోవాలి అనుకుంటేనే ఎదుగుతాం. శంకరాచార్యులు, నారద మునీంద్రులు, నా తల్లిదండ్రులు, నన్ను పెంచిన అమ్మమ్మ, పెద్దమ్మ, నాకు చదువు నేర్పిన గురువులు.. వీరు నా గురువులు. ధ్యానాన్ని ఇష్టపడతాను. ఈశ్వరుడు, హనుమంతుడు, అమ్మవార్లను ఎక్కువ ధ్యానిస్తాను.ఇప్పటికీ నన్ను స్త్రీ పక్షపాతి అంటారు మగవాళ్లు. నేను స్త్రీని కనుక ఆ పక్షపాతం ఉంటుందంటాను నేను. నా అభిమానుల్లో కూడా స్త్రీలే ఎక్కువ. ఆ విషయం గురించి వారితో తర్కం జరుగుతున్నంతసేపు నాకు హాయిగా ఉంటుంది. మంచి మనుషులతో కలసి మాట్లాడుతుంటే, వాళ్ల దగ్గర నుంచి కొన్ని నేర్చుకోవచ్చు, కొన్ని నేను చెప్పవచ్చు. నేను అటువంటి వారితో కలవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తాను. . నేను 35 సంవత్సరాల క్రితం మాంసాహారం మానే శాను. అలాగని తినద్దని ఇతరులకు చెప్పను. ఒకసారి గుల్బర్గా - హైదరాబాద్ మార్గ మధ్యంలో ఉన్న మాణిక్యేశ్వరీదేవి ఆశ్రమానికి వెళ్లాను. ఆవిడ ఏ ఆహారమూ తీసుకోకుండా ధ్యానంలో ఉంటారు. ఎప్పుడో గాని బయటకు రారు. ఆ రోజున అనుకోకుండా బయటకు రావడం నా అదృష్టంగా భావిస్తాను. ఆవిడ నా దగ్గరకు వచ్చి, ‘ఈ రోజు నుంచి నువ్వు మాంసాహారం మానేసై’ అన్నారు. నేను మారు మాట్లాడకుండా మానేశాను. అప్పటి నుంచి నాకు హాయిగా ఉంది. భోజనం చేసేటప్పుడు, ‘అది లేదు ఇది లేదు’ అనే బాధ లేదు. నేను మానేసినందువల్ల, నా పక్కన కూర్చుని ఎవరైనా ఏది తింటున్నా ఆ వాసన నాకు రాదు. అది ఆ తల్లి వరం. అది మానేసిన దగ్గర నుంచి జీర్ణసమస్య లేకుండా పోయింది. బయట ఏది పడితే అది తినట్లేదు. ఏవి పడితే అవి తినడం, ఆసుపత్రికి వెళ్లడం ‘నాకు’ అవసరమా!!! ఇంటి భోజనాన్ని ఇష్టపడతాను. ఉదయాన్నే ఉసిరిపచ్చడి, ఆకుకూరల వంటలు తింటాను.మహానటి కన్నాంబగారు ఒకసారి నన్ను ‘నువ్వు నా అంతదానివి అవుతావు’ అని ఆశీర్వదించారు. ఆ తీపి జ్ఞాపకాలు నిరంతరం నెమరువేసుకుంటూ ఉంటాను. సూర్యకాంతమ్మగారు మా మీద చూసిన అనురాగం 50 సంవత్సరాల తర్వాత కూడా గుర్తు తెచ్చుకుంటున్నాను. వారు నాకు ఒక రకమైన గెడైన్స్. నేను సినిమాలో బరువైన పాత్రలు వేస్తాను కానీ, చిన్నతనంలో మాత్రం బాగా అల్లరిపిల్లను. ఇప్పుడు ఏది లేకపోయినా, ‘లేదు’ అనే మాట నా నోటి నుంచి రాదు.. దానివల్ల కూడా నా శరీరం నేను చెప్పినట్లు వింటోందనుకుంటాను. భోజనం రెండు గంటల్లో అరిగిపోవాలన్నది నా లక్ష్యం. కొంత వయసు వరకు తినడానికి బతకాలి, ఆ తరవాత బతకడానికి తినాలి. నేను ఇప్పడు రెండో స్టేజ్‌లో ఉన్నాను. ఏదైనా తినాలనిపించినా కొద్దిగానే తిని ఎక్కువ తిన్నట్లు అనుభూతి చెందుతాను. ఆ మనస్తత్వం అలవాటు చేసుకుంటే అదే ఆరోగ్యం. నిమ్మకాయ, అల్లం రసం కలిపిన రసం ఈ వేసవిలో తీసుకుంటాను. నా లక్ష్యం... చెట్ల పట్ల బాధ్యతను తెలియచేసేలా నేను ఓ కార్యక్రమం చేయాలనుకుంటున్నాను.రోడ్లు వెడల్పు చేయడం కోసం, బిల్డింగులు కట్టడం కోసం పెద్ద పెద్ద వృక్షాలను నేలమట్టం చేసేస్తున్నారు. ‘తీసిన చోట మళ్లీ ఒక చెట్టు నాటండి. నెల రోజుల పాటు చెంబుడు నీళ్లు పోయాలి. నేను భిక్ష అడిగినట్లు అడుగుతున్నాను’. చెట్ల వల్ల అనేక రోగాలు దూరమవుతాయి. చెట్లు కూలిపోతే నా ప్రాణం విలవిలలాడిపోతుంది. మా ఇంటి ముందు చెట్టు పడిపోయిన ప్పుడు మూడు రోజులు అన్నం తినలేకపోయాను. పొల్యూషన్ వల్ల రోగాలు వస్తాయి. చె ట్లు రోగాలు రాకుండా నిరోధిస్తాయి. నేను తులసి చెట్లు ఎక్కువ నాటుతాను. తులసి అనేది ఋషుల వృక్షం. అది 24 గంటలూ ప్రాణవాయువునిచ్చే చెట్టు. చెట్లను నరకవద్దని నేను వేడుకుంటున్నాను. ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడం, బాగుచేసుకోవడం రెండూ మన చేతుల్లోనే ఉంది. ప్రకృతి మనకు ద్రోహం చేయదు. ప్రకృతికి మనమే చేటు చేస్తున్నాం. ‘అందరూ కుండీలో తులసిని పెంచండి, దాని గాలిని పీల్చి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి’ అని నేను కోరుకుంటున్నాను. ఇది నేను ఆచరిస్తున్నాను.ఆర్టిస్టునైనా నేను స్త్రీని, మనిషిని. అందరూ చల్లగా ఉండాలని కోరుకునేవాళ్లలో ఒకదాన్ని నేను. మనం చెబితే పిల్లలు ఆచరిస్తారు. యువతరం ఆచరిస్తుంది. అలాగే జరగాలని కోరుకుంటున్నాను. - డా. పురాణపండ వైజయంతి, సాక్షి, చెన్నై -
రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్
-
ఆర్ట్ లవ్లీ.. సుకాంత్ పాణిగ్రాహి
ఆర్ట్ డెరైక్టర్- బాలీవుడ్: సినిమా అనేది ఓ ఆర్ట్.. ఆ కళను మరింత అందంగా చూపించేది మాత్రం ఆర్ట్ డెరైక్టరే. తన పనితనంతో ఆర్ట్ డెరైక్షన్ను సినిమా పబ్లిసిటీకి బ్రాండ్‌గా మార్చిన కళాదర్శకుడు సుకాంత్ పాణిగ్రాహి. ఆయన మొదటి సినిమా ‘గంగాజల్’ నుంచి నిన్నమొన్నటి ‘నోవన్ కిల్డ్ జెస్సికా, ఏక్ థా టైగర్..’ వరకు ఆర్ట్ డెరైక్షన్ వహించిన డజను సినిమాలు చూస్తే తెలుస్తుంది ఆ కళాతపన. మాదాపూర్ హెచ్ఐసీసీలో శనివారం ప్రారంభమైన ఆగస్ట్ ఫెస్ట్‌కి సుకాంత్ ఆత్మీయ అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’కు హలో చెప్పారు. నేను పుట్టి పెరిగింది.. ఒడిశాలోని ఓ పల్లెటూరులో. నేను మొదటిసారి ఆర్ట్ చూసింది మా అమ్మ వేసిన ముగ్గులోనే. మా ఊరి పరిసరాలు నాకు కళాత్మకంగా కనిపించేవి. వీటి మీద మనసై.. చదువుపై దృష్టి పెట్టలేకపోయా. కళలు కడుపు నింపుతాయా అని ఎందరన్నా నేను మారలేదు. చలో ముంబై.. సినిమాల్లో పనిచేయాలని.. పదహారో ఏట ముంబైకి వచ్చేశాను. ఇండస్ట్రీ తెలియదు.. దొరికిన పని చేయడం.. ఫుట్‌పాత్‌పై గడపడం ఇదే పని. ఆ కష్టాల్లో ఎన్నో కోణాలు కనిపించాయి. డ్రగ్స్ వలలో చిక్కుకున్న పిల్లలను చూశాను. సినిమాకు వర్క్ చేయాలన్న నా లక్ష్యం బలంగా లేకపోతే.. నేనూ ఆ రొంపిలో కూరుకుపోయేవాడినేమో. ఆ టైంలోనే సినిమాల్లో పనిచేసే ఓ వ్యక్తి కలిశాడు. స్టూడియోకి తీసుకెళ్లాడు. స్వీపర్ టు కార్పెంటర్ ఇండస్ట్రీలో స్వీపర్‌గా మొదలైన నా ఉద్యోగం క్లీనర్, టీ బాయ్, లిఫ్టర్, వెల్డర్, కార్పెంటర్, ఆర్ట్ అసిస్టెంట్ ఇలా సాగి.. ఆర్ట్ డెరైక్టర్‌గా నిలబెట్టింది. ఈ ప్రయూణానికి ఎనిమిదేళ్లు పట్టింది. కళాదర్శకుడిగా నా మొదటి సినిమా గంగాజల్. నన్ను నేను ప్రూవ్ చేసుకున్న సినిమా. అక్కడి నుంచి చక్ దే ఇండియా, న్యూయార్క్, దేవ్ డి, చిల్లర్ పార్టీ.. ఇలా ప్రతి సినిమా నా నేమ్కార్డ్ను సుస్థిరం చేసిందే! మాఫియా ఫౌండర్.. సినిమాలతో బిజీగా ఉంటూనే ఖాళీ టైంలో లైక్‌మైండెడ్ పీపుల్‌తో సృజనాత్మక కార్యక్రమాలు చేయడానికి ‘మాఫియా’ను స్థాపించాను. కఅఊఐఅ.. అంటే ‘మ్యూజిక్, ఆర్ట్, ఫిల్మ్ మేకింగ్.. ఇంట్రెస్టెడ్ ఆజా’ అని! ఈ మూడు కళల్లో ఆసక్తి ఉన్న వాళ్లమంతా ఓ గ్రూప్‌గా ఏర్పడి లీజర్ ఉన్నప్పుడల్లా ప్రోగ్రామ్స్ చేస్తుంటాం. నో పీవోపీ.. నో ప్లాస్టిక్.. నా తొలి సినిమాలకు ప్లాస్టర్ ఆఫ్ పారీస్, ప్లాస్టిక్‌ను ఉపయోగించి సెట్లు వేశాను. వాటితో పని అయిపోయాక తిరిగి చూసుకుంటే.. నేను పర్యావరణాన్ని పొల్యూట్ చేస్తున్నాననిపించింది. తర్వాతి చిత్రం నుంచి పీవోపీ, ప్లాస్టిక్‌కు గుడ్ బై చెప్పేశాను. భూమిలో తేలికగా కలిసిపోయే మెటీరియల్‌తోనే సెట్స్ వేయడం మొదలుపెట్టాను. పదిహేనేళ్ల అనుబంధం.. హైదరాబాద్‌తో నాకు పదిహేనేళ్ల అనుబంధం ఉంది. కె. రాఘవేంద్రరావు ‘మంజునాథ’ సినిమా కోసం ఫస్ట్‌టైమ్ హైదరాబాద్ వచ్చాను. ఇక్కడి ఫుడ్, వాతావరణం బాగా నచ్చుతాయి. ఇప్పటి వరకు నేను చూసిన సిటీ క్లీన్ అండ్ గ్రీన్‌గా ప్రశాంతంగా ఉంది. వ్యర్థానికి అర్థం చెబుతా సుకాంత్ ఆర్ట్ డెరైక్టరే కాదు శిల్పి కూడా. ఈ వేస్ట్, ప్లాస్టిక్‌తో రకరకాల శిల్పాలను చేశాడు. పర్యావరణ ప్రేమికుడిగా మారిన సుకాంత్ ప్రభుత్వానికి ఓ వినతి చేస్తున్నాడు. భూమిలో కలసిపోని చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా.. దానికో స్థలం కేటాయించాలంటున్నాడు. ఆ ప్రదేశాన్ని తాను ఓ కళానిలయంగా మారుస్తానని చెబుతున్నాడు. ఆ వ్యర్థానికి ఓ రూపాన్నివ్వడమే కాక.. దాన్నో వర్క్‌షాప్‌గా మలుస్తానంటున్నాడు. ఆ ప్రాంతాన్ని ఎకో ఫ్రెండ్లీ టౌన్‌షిప్‌గా మార్చి.. కళలకు, పర్యావరణానికి ఓ వేదికగా మలచాలనుకుంటున్నాడు. - సరస్వతి రమ -
నిఘా నై
భైంసా, న్యూస్‌లైన్ : చదువుల తల్లి సరస్వతీ క్షేత్రానికి రోజూ 10 వేల నుంచి 20 వేల వరకు భక్తులు అక్షర శ్రీకారాల కోసం వస్తుంటారు. మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఆంధ్రా, రాయల సీమ ప్రాంతాల నుంచి.. జిల్లావాసులతోపాటు హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మూలా నక్షత్రం, వసంత పంచమి, గురు పౌర్ణమి, శివరాత్రోత్సవాలు, శరన్నవరాత్రులు వంటి ముఖ్య రోజుల్లో లక్షల్లో భక్తులు వస్తారు. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు దర్శించుకుంటారు. అటువంటి బాసరలో భద్రత మాత్రం కరువైంది. తిరుమల బ్రహ్మోత్సవాలపై ఉగ్రవాదులు కుట్రపన్ని పేలుళ్లకు పాల్పడేందుకు ప్రణాళిక సిద్ధం చేసిన విషయం విధితమే. తమిళనాడులో పోలీసులకు చిక్కిన ఉగ్రవాది ఇచ్చిన సమాచారంతో చిత్తూరు జిల్లా పుత్తూరులో ఇద్దరు ముష్కరులను అరెస్టు చేశారు. ఉగ్రవాదుల లక్ష్యం బ్రహ్మోత్సవాలు నిర్వహించే ప్రాంతాలు కావడంతో బాసర భద్రతపై పోలీసులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. దసరా నవరాత్రుల్లో నిర్వహించబోయే బ్రహ్మోత్సవాలు శరన్నవరాత్రుల వేడుకల్లో పాల్గొనే వేలాది మంది భక్తులను ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నారన్న అనుమానాలు ఈ సంఘటన బలం చేకూరుస్తోంది. ఇలాంటి సమయంలో బాసరలోనూ భద్రత పెంచి భక్తులకు భయపడకుండా భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. భద్రత డొల్ల బాసర మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో ఉంది. బాసర రైల్వేస్టేషన్ ఆంధ్ర, ధర్మాబాద్ రైల్వేస్టేషన్ మహారాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నాయి. బాసరకు రావాలంటే రోడ్డు మార్గం కంటే రైలు మార్గమే సులువు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు ప్రధానంగా రైల్వేస్టేషన్ నుంచే బాసర ఆలయానికి చేరుకుంటారు. నిత్యం రైల్వేస్టేషన్ రద్దీగా ఉంటుంది. రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాలు లేవు. తనిఖీలు చేసే వారు లేరు. మరణాయుధాలు తీసుకొచ్చి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. అనుమానితులను గుర్తించి వారిని విచారించే సిబ్బంది లేరు. రైళ్ల నుంచి ఎవరు వస్తున్నారు? ఎవరు పోతున్నారు? ఎటు వెళ్తున్నారు? అని దృష్టిసారించడానికి తగిన పోలీసు, రైల్వే సిబ్బంది లేరు. తాజాగా భద్రత పటిష్టంగా లేకపోవడంతోనే బాసర ప్రధాన ఆలయం ముందు వ్యాపారం చేసుకునే వ్యాపారితోపాటు తన భార్య, కొడుకు తమ ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇదంతా కూడా రెక్కీ నిర్వహించి పథకం ప్రకారమే చేసినట్లు తేలింది. ఈ హత్యకు పాల్పడింది మహారాష్ట్రకు చెందిన పార్ధీ ముఠాగా వెల్లడైంది. అంటే వీరు రైల్వేస్టేషన్ నుంచే నేరుగా వచ్చి హత్య చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. భద్రత ఉంటే వ్యాపారి కుటుంబం హత్యకు గురై ఉండేవారు కాదేమో. సీసీ కెమెరాలు ఉం టే అనమానితుల చిత్రాలు పరిశీలించే అవకాశం ఉంటుంది. రాకపోకలు సాగించే వివరాలు కూడా నమోదు చేస్తే బావుం టుంది. రైల్వేస్టేషన్ నుంచి ఆలయ మార్గమధ్యలో వాహనాలను రోడ్డుపైనే నిలిపివేయడం వల్ల ఎవరినీ గుర్తు పట్టని పరిస్థితి ఉంది. వాహనాలకు కూడా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి. స్నాన ఘట్టాల వద్ద కూడా పోలీస్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసి నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. అదనపు బలగాలు అవసరం బాసర ఆలయం చుట్టూ ఫెన్సింగ్ లేదు. కనీసం ప్రహరీ లేదు. పోలీసులు పహారా ఉండరు. ఆలయంలోకి ఎటువైపు నుంచైనా రాకపోకలు సాగించే వీలుంది. ఆలయంలో కర్రలు పట్టుకుని హోంగార్డులే విధులు నిర్వహిస్తారు. పోలీసులు మాత్రం పహారా ఉండరు. రెండు ముఖద్వారాలు ఉంటే బావుంటుంది. ఒకటి రావడానికి.. మరొకటి పోవడానికి.. భక్తులు ఆలయానికి రక్షణ కల్పించాలని అధికారులకు సూచిస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని మహిళా భక్తులు కోరుతున్నారు. ఆలయం చుట్టూ పోలీసులతో పహారా నిర్వహించేటట్టు చూడాలి. ఇంత పెద్ద ఆలయం బాసర పోలీస్‌స్టేషన్, ముథోల్ సర్కిల్ పరిధిలోకి వస్తుంది. సర్కిల్ ఇన్స్పెక్టర్ ముథోల్‌లోనే ఉంటారు. భైంసా డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ సర్కిల్లో ఉన్న బాసర పోలీస్‌స్టేషన్‌లో అదనపు స్థాయి అధికారులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాసరలోనే సర్కిల్ స్థాయి అధికారి ఉండేలా చర్యలు చేపట్టాలి. బాసర ఆలయ ప్రాంగణంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. ఆలయం కోసం అదనపు బలగాలను మోహరించాలి. {పస్తుతం బాసరలో ఒక ఎస్సై, ఇద్దరు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక రైటర్, ఎస్హెచ్ఓ ఒకరు, కానిస్టేబుళ్లు 21 మంది ఉన్నారు. ఈ పోలీస్ స్టేషన్‌కు ఒక వాహనం కేటాయించారు. 29 మంది సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఉత్సవాలు నిర్వహించే ప్రతిసారి అదనపు బలగాలను బాసర పంపుతున్నారు. నిత్యం వేల సంఖ్యలో భక్తులు వచ్చే ఈ క్షేత్రంపై అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. లక్షల సంఖ్యలో రాకపోకలు కొనసాగే అమ్మవారు కొలువుదీరిన బాసర రైల్వే కేంద్రంలోనూ ఆ శాఖ తమ సిబ్బందిని పెంచుకోవాలి. రైల్వే పోలీస్ కేంద్రం ఏర్పాటు చేసి సర్కిల్‌స్థాయి అధికారిని నియమిస్తే రైలు మార్గం గుండా వచ్చేవారి కదలికలపైన దృష్టి సారించవచ్చు. చంద్రబాబు హయాంలో 2002లో గోదావరి పుష్కరాలు జరగ్గా అప్పుడు బాసరలో ఐఏఎస్ స్థాయి అధికారిని, డీఎస్పీ స్థాయి అధికారిని నియమించాలని ప్రతిపాదించారు. 2014 సంవత్సరంలో మళ్లీ గోదావరి పుష్కరాలు వస్తున్నా ఇంతవరకు ఆ ప్రతిపానదలు నెరవేర లేదు. ఆలయం లోపలికి సెల్, కెమెరాలను నిషేధించాలి. ఫొటోలు తీసుకుని రెక్కీ నిర్వహించి సంఘటనలకు పాల్పడే అవకాశం ఉంది. కనీసం మంచిర్యాల గుడిపేట వంటి బెటాలియన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే బావుంటుంది. ఏదైన సంఘటన జరిగినపుడు అయినా వారిని వాడుకునే అవకాశం ఉంటుంది. ఒక ఫైరింజన్‌ను కూడా ఏర్పాటు చేయాలి. ప్రముఖంగా మహారాష్ట్రకు ఈ ప్రాంతం సరిహద్దు కావడంతో భద్రత దృష్ట్యా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇక్కడికి వచ్చే భక్తులు సూచిస్తున్నారు.