
నృత్య సమ్మోహనం
నృత్య సమ్మోహనం
సాక్షి, తిరుమల: తిరుమల ఆస్థాన మండపంలో ఆదివారం దక్షిణాది రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలైన కూచిపూడి, మోహినీయాట్టం నృత్యరూపకం అబ్బురంగా సాగింది. బెంగళూరుకు చెందిన సరస్వతి బృందం భక్తిరస సంకీర్తనలతో ఈ నృత్యరూపకాన్ని ప్రదర్శించింది. దక్షిణాది సంప్రదాయ నృత్యాలు కూచిపూడి, మోహినీయాట్టంతో కళాకారుల అభినయానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా కళాకారులకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.