
బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. త్రిశక్తి స్వరూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వలన బుద్ధి, వికాసం, విద్యాలాభం కలుగుతాయని చిలకమర్తి తెలిపారు.
మూలా నక్షత్రము రోజున అమ్మవారిని శ్వేతపద్మాన్ని అధిష్టించి, వీణ, కమండలం, అక్షరమాలను ధరించి, అభయముద్రతో విరాజిల్లే శ్రీ సరస్వతీదేవి అలంకరణలో దర్శనమిస్తుంది. ఈ దేవికున్న అనేక నామాలలో శ్రీ శారదాదేవి అతి విశిష్టమైనది. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల చేత విద్యాబుద్దులకై సరస్వతీ పూజ తప్పకుండా చేయిస్తారు. చిన్నపిల్లలకు అక్షరాభాస్యం కూడా చేస్తారు. దేవీ నవరాత్రులలో చివరి మూడు రాత్రులూ చేసే త్రిరాత్ర వ్రతం ఈరోజే ప్రారంభిస్తారు
నైవేద్యం: దద్దోజనం, పరమాన్నం, చక్కెర పొంగలి
మరోవైపు నవ దుర్గాలను పూజించే సంప్రదాయం ప్రకారం. ఏడవ రోజు కాళరాత్రి అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఈమెను ఆకుపచ్చ రంగుల దుస్తులతో అలంకరించాలి. ఉత్సవ పూజ మహా సప్తమిగా పిలువబడే ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. ఈ రోజున భక్తులు నీలపు రంగు దుస్తులను ధరించాలి. కాళరాత్రిని పూజించడం ద్వారా భక్తులు ఆపదలు, అరిష్టాల నుంచి బయటపడతారు.
"ఏకవేణి జపకర్ణి పూరానగ్నా ఖరస్థితా
లంబోష్ఠీ కర్నికాకర్ణీ తైలాచ్చ్యాక్త శరీరణీ
వామ పాదోల్లిసల్లోహలితా కంటకా భూషణా
వరమూర్దధ్వజా కృష్ణా కాళరాత్రిర్భయంకరీ"
ఎవరైనా శని దోషం వల్ల రకరకాల సమస్యలతో సతమతమవుతున్నట్లయితే.. ఈ రోజు ఆ దోషం నుంచి బయటపడటానికి చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి దేవి ని పూజించడం ద్వారా శని దోషం తొలగిపోతుంది.
కాలరాత్రి మంత్రం
ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉండి ఇబ్బంది పడుతూ.. ఆర్థిక, శారీరక, మానసిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లయితే, మీ చింతలన్నీ తొలగిపోవడానికి.. ఈరోజు దుర్గాదేవి సప్తమ రూపం కాళరాత్రి దేవిని ‘ఓం ఐం హ్రీం క్లీం’ అనే మంత్రాన్ని పఠిస్తూ పూజించండి. 108 సార్లు ‘కాలరాత్రియ నమః’ అని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా సాధకుడు దేవతతో పాటు శనీశ్వరుడి అనుగ్రహాన్ని పొందుతాడని, అతని జాతకంలో శని దోషం తొలగిపోతుందని నమ్ముతారు.
నైవేద్యం: గారెలు, కిచిడి
(చదవండి: చరిత్రలో తొలిసారి..న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో దుర్గా పూజ..!)