
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది.ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మణిశర్మ తల్లి సరస్వతి(88) ఆదివారం సాయంత్రం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మణిశర్మ సోదరుడు రామకృష్ణ నివాసంలో ఆమె కన్ను మూశారని కుటుంబ సభ్యులు తెలిపారు.
సోమవారం మధ్యాహ్నం చెన్నైలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సరస్వతి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మణిశర్మకు తమ సానుభూతిని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment