సేలం: ప్రేమించి తనను పెళ్లి చేసుకుని మోసం చేయడంతో పాటుగా రెండో పెళ్లికి సిద్ధ పడ్డాడంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సేలం వాలప్పాడికి చెందిన సరస్వతి(27), సేలం నెత్తి మేడుకు చెందిన సుకుమార్(28)లు నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుకుమార్ భార్య సరస్వతితో కలసి అక్కడే కాపురం పెట్టాడు. రెండు రోజుల క్రితం ఇంటర్వ్యూ నిమిత్తం ఢిల్లీ వెళ్తున్నట్టు చెప్పిసేలంకు వచ్చేశాడు. భర్త ఢిల్లీ వెళ్లాడని భావించిన సరస్వతికి శుక్రవారం వచ్చిన ఓ సమాచారం షాక్‌కు గురి చేసింది. ఢిల్లీ వెళ్లకుండా, సేలంకు వచ్చిన సుకుమార్ మరో యువతితో పెళ్లికి సిద్ధ పడ్డాడు. దీంతో హుటాహుటిన సేలం చేరుకున్న సరస్వతి అన్నదానం పట్టి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆదివారం జరగనున్న వివాహాన్ని అడ్డుకోవాలని విన్నవించింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.
పెళ్లి చేసుకుని మోసం చేశాడు
Published Sun, Jun 7 2015 2:29 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 AM
Advertisement
Advertisement