జ్యోతిక సంభాషణలపై మండిపడుతున్న నెటిజన్లు | Jyothika Vulgar Vocabulary on GV Prakash in Nachiyaar teaser | Sakshi
Sakshi News home page

జ్యోతిక సంభాషణలపై మండిపడుతున్న నెటిజన్లు

Nov 17 2017 7:39 AM | Updated on Nov 17 2017 8:11 AM

Jyothika Vulgar Vocabulary on GV Prakash in Nachiyaar teaser - Sakshi - Sakshi - Sakshi

తమిళసినిమా: నటి జ్యోతిక సంభాషణలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తనేం మాట్లాడింది పాపం అనుకుంటున్నారా? నటి జ్యోతిక వివాహనంతరం 36 వయదినిలే చిత్రంతో నటిగా రీఎంట్రీ అయిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇటీవల తెరపైకి వచ్చిన మగళీర్‌ మట్టుం చిత్రంలోనూ ప్రధాన పాత్రను పోషించారు. చాలా కాలం తరువాత బయటి సంస్థలో నాచియార్‌ అనే చిత్రంలో నటిస్తున్నారు. హీరోగా జీవీ.ప్రకాశ్‌కుమార్‌ నటిస్తున్న ఈ చిత్రానికి బాలా దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. నటి జ్యోతిక పోలీస్‌ అధికారిణిగానూ, జీవీ.నేరస్తుడిగానూ నటిస్తున్న చిత్రం నాచియార్‌. ఇందులో జ్యోతిక పోలీస్‌స్టేషన్‌లో కొందరిపై అసభ్య పదజాలంతో తిట్టిన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.

దీంతో విమర్శకులు, నెటిజన్లు అలాంటి సంభాషణలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. పలువరు అభిమానులు దర్శకుడు బాలా చిత్రాల్లో అలాంటి సంభాషణలు చోటు చేసుకోవడం సర్వసాధారణమే అయినా జ్యోతిక లాంటి నటి వాటిని చెప్పడానికి ఎలా అంగీకరించారని దుయ్యబడుతున్నారు. ప్రచారం కోసమే చిత్రాల్లో ఇలాంటి బూతులు పొందుపరుస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెన్సార్‌ సభ్యులైనా ఇలాంటి అసభ్య సంభాషణలను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇలాఉండగా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంటున్న నాచియార్‌ చిత్రం మున్ముందు ఇంకెంత సంచలనం కలిగిస్తుందో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement