
సమంత, ఆ యంగ్ హీరోకు ఓకె చెప్తుందా..?
నాగాచైతన్యతో ప్రేమలో ఉన్న విషయం బయటికి వచ్చిన తరువాత సమంత సినిమాలు ఒప్పుకోవటం మానేసింది. జనతా గ్యారేజ్ సినిమా తరువాత చాలా రోజుల వరకు ఒక్క సినిమా కూడా సైన్ చేయలేదు సామ్. తరువాత తమిళ సినిమాలకు సైన్ చేసిన సమంత, ఈ మధ్యే ఓ తెలుగు సినిమా షూటింగ్లో పాల్గొందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా మామ అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా రాజుగారి గది 2లో.
తమిళ్లో రెండు మూడు ప్రాజెక్ట్ లకు ఓకె చెప్పిన సమంతపై ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. వరుసగా అడల్ట్ కామెడీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న కోలీవుడ్ యంగ్ హీరో జీవీ ప్రకాష్ సినిమాలో సమంత హీరోయిన్గా నటించనుందట. అయితే ఇది ఓ తెలుగు సినిమాకు రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది.
నిఖిల్ హీరోగా ఘనవిజయం సాధించిన ఎక్కడికీపోతావు చిన్నవాడా సినిమాను జీవీ ప్రకాష్ తమిళ్లో రీమేక్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో ఒక హీరోయిన్గా హన్సికను ఫైనల్ చేయగా ఇప్పుడు మరో హీరోయిన్ పాత్రకు సమంతను సంప్రదిస్తున్నారు. చేతి నిండా సినిమాలతో పాటు పెళ్లి పనులతోనూ బిజీగా ఉన్న సమంత జీవీ ప్రకాష్కు ఓకె చెపుతుందో లేదో చూడాలి.