
కోలీవుడ్ చిన్నవాడు జీవి
లో బడ్జెట్ సినిమాలతో కోలీవుడ్లో స్టార్ ఇమేజ్ కోసం ప్రయత్నం చేస్తున్న యంగ్ హీరో జీవి ప్రకాష్. ముఖ్యంగా రీమేక్ సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ యువ నటుడు మంచి విజయాలు సాధిస్తున్నాడు. టాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ప్రేమ కథాచిత్రం సినిమాను తమిళ్లో డార్లింగ్ పేరుతో రీమేక్ చేసిన మంచి విజయం సాధించాడు. ఆ తరువాత కూడా యూత్ను ఆకట్టుకునే కథాంశాలతో దూసుకుపోతున్న ఈ యంగ్, హీరో ఇప్పుడు మరో రీమేక్ మీద కన్నేశాడు.
ఇటీవల నిఖిల్ హీరోగా తెరకెక్కిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా సినిమాను కోలీవుడ్లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు జీవి. పెద్ద నోట్ల రద్దు సమయంలో రిలీజ్ అయి కూడా మంచి కలెక్షన్లు సాధించిన ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రీమేక్ రైట్స్ కోసం చాలా మంది హీరోలు ప్రయత్నించారు. ఫైనల్గా ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న జీవి, త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాడు.