జీవీకి నయన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? | GV Prakash to romance Nayanthara? | Sakshi
Sakshi News home page

జీవీకి నయన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

Published Sat, Aug 29 2015 2:46 AM | Last Updated on Sun, Sep 3 2017 8:18 AM

జీవీకి నయన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

జీవీకి నయన గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?

 నయనతార ఈ పేరు చాలా కాలం నుంచీ ఒక సంచలనం. టాప్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకూ ఆమెతో జత కట్టాలని కోరుకుంటారు. నయనతార కూడా ఈ విషయంలో కాస్త ఉదార ధోరణినే అవలంభిస్తున్నారని చెప్పవచ్చు. ఇవాళ ప్రముఖ కథానాయికల్లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న ఏకైక నటి నయనతార. అలాంటి నాయకి స్టార్ హీరోలతోనే, ప్రముఖ దర్శకులతోనే, పెద్ద నిర్మాణ సంస్థల్లోనే నటిస్తారని చెప్పవచ్చు. కానీ నయనతార అలాంటి భేదాబిప్రాయాలకు తావివ్వడంలేదు. వర్ధమాన హీరోలతోనూ నటించడానికి సై అంటున్నారు.
 
  అయితే ఆమె కొన్ని కట్టుబాట్లను విధించుకున్నారు. తనకిష్టం అయితేనే ఎవరయినా ఆమెను కలవడానికి అనుమతిస్తారు. అలాగే కథ, తన పాత్ర నచ్చితేనే ఆ చిత్రంలో నటించడానికి అంగీకరిస్తారు. ప్రస్తుతం ఆ విధంగానే వర్ధమాన నటుడు ఆరితో మాయ చిత్రం యువ నటుడు విజయ్‌సేతుపతి సరసన నానుమ్ రౌడీదాన్ తరితర చిత్రాల్లో నటించడానికి సమ్మతించారు.ఆ ధైర్యంతోనే నటుడు జీవీ.ప్రకాష్‌కుమార్ సరసన ఆమెను నటింపజేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. నూతన దర్శకుడు ప్రసాద్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి బ్రూస్‌లీ అనే టైటిల్‌ను నిర్ణయించారు.
 
 ఇందులో నాయకి పాత్రకు నయనతార అయితే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట.అంతే కదు ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు మొదలెట్టారు. నయనతార జీవీ సరసన నటించడానికి పచ్చజండా ఊపుతారా? అన్నదే ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం. ఎందుకంటే పర్శనాలిటీ పరంగా చూస్తే జీవీకి నయనతారకు మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. కథ అందుకు తగ్గట్టుగా ఉంటే నయనతార అంగీకరించే అవకాశం ఉంటుంది. ఇక ఈ విషయం ఆమె నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement