Telugu Indian Idol 2: Aiyyan Pranthi Wins Applause from GV Prakash - Sakshi
Sakshi News home page

అయన్ ప్రణతి ‘మాష్టారు..మాష్టారు’ పాటకు జీవీ ప్రకాశ్‌ ఫిదా

Published Tue, Apr 4 2023 7:27 PM | Last Updated on Tue, Apr 4 2023 8:09 PM

Telugu Indian Idol 2: GV Prakash Impressed To Ayan Pranathi Song - Sakshi

ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమ్‌ అవుతున్న ‘ఇండియన్‌ ఐడల్‌ 2’కి విశేష స్పందల లభిస్తోంది. . ఈ షో ద్వారా తమ గాన ప్రతిభతో వరల్డ్ సెలబ్రిటీలు మారుతునారు మన కంటెస్టెంట్స్. ముఖ్యంగా 14 ఏళ్ల అయ్యన్ ప్రణతికి రోజురోజూకూ ఫాలోయింగ్ పెరిగిపోతుంది. ఆమె ముద్దు, ముద్దుగా శ్రవణానందంగా పాడిన సార్ చిత్రంలోని ‘మాష్టారు..మాష్టారు’ పాటతో ఆమె తెలుగువారందరకీ బాగా చేరువయ్యింది. సంగీతకారులను మెప్పించింది. ఎంతలా అంటే ఆ పాట కంపోజ్ చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ ప్రత్యేకంగా ప్రణతిని మెచ్చుకునేంత. భవిష్యత్తులో గాయనిగా ఆమె అద్భుతంగా రాణిస్తుందని జడ్జెస్ సైతం కితాబిస్తున్నారు. 

 అయ్యన్ ప్రణతి నాన్నగారు కూడా సంగీతకారుడు కావడం, ఇండియన్ ఐడల్ స్టేజ్ పై ఆయన ప్రదర్శన చూసి షో జడ్జ్ మరియు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఆయనతో కలిసి పనిచేస్తానని చెప్పడం ఆశ్చర్యకరమైన విషయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement