సౌత్ టు నార్త్.. దూసుకెళ్తోన్న జీవీ.ప్రకాశ్‌ | GV Prakash's Bollywood Debut Movie Update | Sakshi
Sakshi News home page

సౌత్ టు నార్త్.. దూసుకెళ్తోన్న జీవీ.ప్రకాశ్‌

Published Wed, Mar 20 2024 8:39 AM | Last Updated on Wed, Mar 20 2024 9:06 AM

GV Prakash Bollywood Movie Update - Sakshi

తమిళసినిమా: ఇప్పుడు జీవీ.ప్రకాశ్‌కుమార్‌ స్థాయి మామూలుగా లేదు. నటుడిగా, సంగీత దర్శకుడిగా రెండు పడవలపైనా సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్నారు. ఈ రెండు శాఖల్లోనూ బిజీగా ఉంటున్నారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన రెబల్‌ చిత్రం ఈనెల 22న తెరపైకి రానుంది. నికేశ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించారు.

కాగా తాజాగా ఈయన బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారనే టాక్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు, నటుడు అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించనున్న బహుభాషా (హిందీ,తమిళం) చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. దీన్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అనురాగ్‌ కశ్యప్‌ కోలీవుడ్‌ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమే.

ఇమైకా నొడిగల్‌ చిత్రంలో ఈయన విలన్‌గా నటించి మెప్పించారు. ఇకపోతే ఈయన జీవీ ప్రకాశ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించనున్న ఈ క్రేజీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం కానున్నారన్న మాట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఇప్పుటికే నటుడు ధనుష్‌, విజయ్‌సేతుపతి వంటి నటులు బాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement