rebal
-
అగ్ర నిర్మాణ సంస్థ.. రెబల్ స్టార్‌తో బిగ్ డీల్.. ఏకంగా మూడు భారీ ప్రాజెక్టులు!
రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ నటించారు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ మెప్పించారు.అయితే గతేడాది డిసెంబర్ సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.వరుసగా మూడు ప్రాజెక్టులుఅయితే తాజాగా భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్. ఈ బ్యానర్లోనే ప్రభాస్ సలార్-2 త్వరలోనే పట్టాలెక్కనుంది. అంతే కాకుండా రెబల్ స్టార్‌తో మరో రెండు ప్రాజెక్టులు చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రభాస్‌తో వరుసగా 2026,2027,2028 సంవత్సరాల్లో మూడు చిత్రాలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.బిగ్ డీల్ఈ లెక్కన ప్రభాస్‌తో భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్,.. ఏకంగా మూడు చిత్రాలకు దాదాపు రూ.450 కోట్లకు పైగానే పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్‌తో రాబోయే మూడు సినిమాలకు రెబల్ స్టార్ బిగ్ డీల్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రభాస్ టాలీవుడ్లో ది రాజాసాబ్ మూవీలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రంలో తొలిసారి పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఆ తర్వాతే సలార్-2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
వెయిటింగ్ ఇజ్ ఓవర్.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, బుజ్జి టీజర్ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇటీవలే భారీస్థాయిలో ఈవెంట్ నిర్వహించిన మేకర్స్.. బుజ్జిని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఎప్పుడెప్పుడా అని రెబల్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తోన్న కల్కి 2898ఏడీ ట్రైలర్ రానే వచ్చింది. ఇవాళ కల్కి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తే యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. మీరు కూడా కల్కి ట్రైలర్‌ను చూసేయండి. కాగా.. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. కాగా.. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్ రెబల్ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ట్రైలర్లో బ్యాగ్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా థియేటర్స్‌లో కల్కి ట్రైలర్ ప్రదర్శించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, తిరువనంతపురం, నార్త్ ఇండియా మెయిన్ సిటీస్‌లోని థియేటర్స్‌లో కల్కి ట్రైలర్‌ను ప్రదర్శించారు. -
సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రూ. 40 కోట్ల సినిమా
మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. ఈ సినిమాతో తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఆమె రేంజ్ మారిపోయింది. ప్రేమలు సినిమా తర్వాత కోలీవుడ్‌లో ఈ బ్యూటీ నటించిన రెబల్ మార్చి 22న విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లో 'రెబెల్' అనే సినిమాను తమిళ్లో నిర్మించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'రెబల్' చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా రెబల్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తమళ్, తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉంది. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కడంతో ఫర్వాలేదు అనిపించింది. ఈ వీకెండ్లో మంచి టైమ్‌పాస్ కలిగించే సినిమాగా రెబల్ ఉంటుందని చెప్పవచ్చు. View this post on Instagram A post shared by Studio Green (@studiogreen_official) -
ప్రేమలు బ్యూటీ 'మమితా బైజు'కు రెబల్ షాక్
మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. తెలుగులో కూడా ప్రేమలు పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా భారీగానే ప్రేక్షకులను మెప్పించింది. కానీ మార్చి 22 ఈ బ్యూటీ నటించిన మరో సినిమా విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్లో 'రెబెల్' అనే సినిమాను కోలీవుడ్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపిస్తోంది. రెండు విద్యార్ధి వర్గాల మధ్య మొదలైన సంఘర్షణ రాష్ట్ర రాజకీయాల దాకా విస్తరించడం. ఆపై ర్యాగింగ్, కుల వివక్ష, పొలిటిక్స్ ఇలా అన్ని అంశాలు తెరపై కనిపించడం అయితే బాగుంది కానీ అందుకు తగ్గట్లు నికేష్ ఆర్ఎస్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో మమితా బైజు పాత్రకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రెబెల్ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగలడం దాదాపు ఖాయం అని అప్పుడు కొందరు లెక్కలేస్తున్నారు. రెబల్ మొదటిరోజు కలెక్షన్స్ తమిళనాడులో రూ. 1.5 కోట్లు,కన్నడలో రూ. 75 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలోనే ఇంత పేలవంగా కలెక్షన్స్ ఉంటే ఫైనల్‌గా దారుణమైన నష్టాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు. -
సౌత్ టు నార్త్.. దూసుకెళ్తోన్న జీవీ.ప్రకాశ్
తమిళసినిమా: ఇప్పుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ స్థాయి మామూలుగా లేదు. నటుడిగా, సంగీత దర్శకుడిగా రెండు పడవలపైనా సక్సెస్‌ఫుల్‌గా పయనిస్తున్నారు. ఈ రెండు శాఖల్లోనూ బిజీగా ఉంటున్నారు. ఈయన తాజాగా కథానాయకుడిగా నటించిన రెబల్ చిత్రం ఈనెల 22న తెరపైకి రానుంది. నికేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. కాగా తాజాగా ఈయన బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అవుతున్నారనే టాక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించనున్న బహుభాషా (హిందీ,తమిళం) చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. దీన్ని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా అనురాగ్ కశ్యప్ కోలీవుడ్ ప్రేక్షకులకు నటుడిగా పరిచయమే. ఇమైకా నొడిగల్ చిత్రంలో ఈయన విలన్‌గా నటించి మెప్పించారు. ఇకపోతే ఈయన జీవీ ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్న ఈ క్రేజీ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దర్శకుడిగా పరిచయం కానున్నారన్న మాట. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా ఇప్పుటికే నటుడు ధనుష్, విజయ్‌సేతుపతి వంటి నటులు బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. -
AP: ఫిరాయింపులపై ఇక స్పీకర్‌దే నిర్ణయం!
ఎమ్మెల్యేల వ్యవహారశైలిపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ విచారణకు మళ్ళీ డుమ్మా కొట్టిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 4 గంటల వరకు సమయం ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్ మోషేన్ రాజు మరికొంత సమయం కావాలంటూ స్పీకర్‌కు లెటర్ రాసిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు న్యాయపరమైన అంశాలపై చర్చించేందుకు సిద్దమైన స్పీకర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం అనర్హత పిటిషన్లపై ఏ క్షణమైనా నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలకు సంబంధించిన రెబల్ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీల ‘అనర్హత’పై ఉత్కంఠ కొనసాగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్లు ‘తుది’ నోటీసులు అందుకున్న ఆయా సభ్యులు ఇవాళ విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాము విచారణకు హాజరు కాలేమని వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన నలుగురు ఎమ్మెల్యేలు బదులు పంపినట్లు తెలుస్తోంది. నోటీసుల ప్రకారం.. ఇవాళ మధ్యాహ్నాం తొలుత టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విచారణ జరగాల్సి ఉంది. ఆ తర్వాత వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయింపుల విచారణ ఉంది. అయితే.. విచారణకు హాజరుకాలేమంటూ ఆనం రామనారాయణరెడ్డి బదులు పంపినట్లు తెలుస్తోంది. తమ అనర్హత పిటిషన్‌కు సంబంధించి.. పిటిషనర్ సమర్పించిన వీడియో ఆధారాలు ఒరిజినల్ అని నిరూపించాల్సిన అవసరం ఉందంటూ పాత పాటే పాడారు వాళ్లు. తాము మాట్లాడిన వీడియోలకు సంబంధించి ఆయా సంస్థల సర్టిఫైడ్ కాపీలు కావాలని స్పీకర్‌ను ఆనం కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాము విచారణకు రాలేమని ఆయన బదులు పంపారు. అలాగే.. మేకపాటి, శ్రీదేవి కూడా మరింత సమయం కావాలని కోరినట్లు సమాచారం. వైఎస్సార్సీపీ నుంచి నెగ్గి.. టీడీపీలోకి పార్టీ ఫిరాయించారు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉండవల్లి శ్రీదేవీలు. అలాగే మండలిలోనూ ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణలు పార్టీ ఫిరాయించారు. వైఎస్సార్సీపీ నుంచి ఫిరాయించిన వీళ్లపై అనర్హత వేటు వేయాలంటూ అసెంబ్లీలో చీఫ్‌విప్ మదునూరి ప్రసాదరాజు, మండలిలో చీఫ్‌విప్ మేరిగ మురళీధర్.. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌లకు ఫిర్యాదులు చేశారు. వీళ్లతో పాటు టీడీపీ తరఫు నుంచి కూడా అనర్హత ఫిర్యాదు నమోదు అయ్యింది. .. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నుంచి వివరణ తీసుకున్న తర్వాతే.. వాళ్లపై నమోదు అయిన అనర్హత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ.. స్పీకర్, మండలి చైర్మన్లు ఆయా సభ్యుల్ని ప్రశ్నిస్తూ నోటీసులు పంపిస్తూ వచ్చారు. అయితే వీళ్లలో కొందరు అరకోరగా విచారణకు హాజరయ్యారు. మూడుసార్లు నోటీసులు ఇస్తే.. రకరకాల కారణాలతో వాళ్లు విచారణకు గైర్హాజరు అవుతూ వస్తున్నారు. సాంకేతిక-వ్యక్తిగత కారణాల్ని సాకుగా చూపిస్తూ.. పూర్తిస్థాయి విచారణలో పాల్గొనకుండా సాగదీస్తూ వస్తున్నారు ఈ నలుగురు. దీంతో.. ఇవాళ (19వ తేదీన) విచారణకు హాజరుకావాల్సిందేనని స్పీకర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. స్పీకర్ కార్యాలయంలో వీళ్ల విచారణ జరగాల్సి ఉంది. అలాగే.. అనర్హత పిటిషన్లు వేసిన ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు, మేరిగ మురళీధర్(మండలి) సమక్షంలోనే విచారణ జరగాలి గనుక ఆయనకు కూడా నోటీసులు జారీ చేసింది స్పీకర్ కార్యాలయం.ఒకవేళ.. హాజరు కాకపోతే ఇప్పటిదాకా జరిగిన విచారణ ఆధారంగా నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందంటూ ఇదివరకే నోటీసుల్లో స్పీకర్, చైర్మన్లు స్పష్టం చేశారు. దీంతో రాలేమంటూ లేఖ పంపిన నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం ఉండనుందా? అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇంకోవైపు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల విషయంలోనూ విచారణాంతరం నిర్ణయం ప్రకటించాల్సి ఉంటుంది. వీళ్లను కూడా ఇవాళే విచారణకు రావాల్సిందిగా స్పీకర్, మండలి చైర్మన్లు నోటీసులు పంపించారు. -
యదార్థ సంఘటన ఆధారంగా వస్తోన్న 'రెబెల్'!
తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రెబెల్. నటి మమితా బైజూ నాయకిగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. నికేశ్ ఆర్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న రెబల్ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా ఈ చిత్ర ఫస్ట్ పోస్టర్‌ను హీరో శింబు విడుదల చేశారు. ఈ సినిమాను 1980 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించినట్లు చిత్ర దర్శకుడు నికేష్ ఆర్ఎస్ తిరుపతి తెలిపారు. కాలేజీ నేపథ్యంలో సాగే రాజకీయాలను ఆవిష్కరించే కథా చిత్రంగా ఉంటుందన్నారు. పూర్తి కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా రెబల్ చిత్రం ఉంటుందన్నారు. ఇది జీవీ ప్రకాష్ కుమార్ సినీ కెరియర్లో ముఖ్యమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే రిలీజ్ చేసిన చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌కు సినీ వర్గాలు, ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిందన్నారు. రెబల్ చిత్రాన్ని త్వరలోనే తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా చెప్పారు. ఈ చిత్రంలో కరుణాస్, సుబ్రహ్మణ్య శివ, షాలు రహీం, వెంకటేష్, దీప్తీ ఆదిత్య భాస్కర్, కల్లూరి వినోద్, అదిరా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. #rebel first look is here … a super promising script from a debutant director @NikeshRs …. Joining hands wit my fav @StudioGreen2 after the success of #darling amd #trishaillananayanthara @kegvraja @NehaGnanavel @Dhananjayang #rebel @arunkrishna_21 pic.twitter.com/RK0Ok1NQNX — G.V.Prakash Kumar (@gvprakash) October 26, 2023 -
‘రెబల్’గా వస్తోన్న జీవీ ప్రకాష్
సంగీత దర్శకుడిగా, కథానాయకుడిగా యమా బిజీగా ఉన్నాడు నటుడు జీవీ ప్రకాష్ కుమార్. ప్రస్తుతం ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న కెప్టెన్ మిల్లర్, విక్రమ్ హీరోగా నటిస్తున్న తంగలాన్, టాలీవుడ్ నటుడు రవితేజ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు చిత్రాలకు సంగీతాన్ని అందిస్తున్నారు. అదేవిధంగా తాజాగా కథానాయకుడిగా కనిపించిన అడియే చిత్రం ప్రేక్షకుల మధ్య మంచి ఆదరణ పొందింది. తాజాగా జీవీ ప్రకాష్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం రెబెల్. కేజీ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా నికేష్ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ జీవీ ప్రకాష్ కుమార్ మంగళవారం తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అందులో తమిళ సినీ పరిశ్రమలో ఇది గేమ్ చేంజ్ కథా చిత్రంగా ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నవ దర్శకుడు ఎంతో నమ్మకంగా రెబల్ చిత్రాన్ని తెరకెక్కించారని పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం పేరు వింటేనే ఇది యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందని పిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ కమర్షియల్ ఎంటర్ టెయినర్ కథాచిత్రాల్లో నటించి చాలా కాలమే అయ్యింది. దీంతో ఈ చిత్రం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. It’s a wrap for #rebel . Will be a game changer in tamil cinema . One promising director is on his way … thanks @kegvraja sir @NikeshRs @Arunkrishna_21 @NehaGnanavel @Dhananjayang @StudioGreen2 pic.twitter.com/A53pTsnRzs — G.V.Prakash Kumar (@gvprakash) October 2, 2023 -
సర్జరీ చేయించుకోనున్న యంగ్ రెబల్ స్టార్.. కారణం అదే!
యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ సలార్, కల్కి సినిమాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ప్రభాస్ సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: జైలర్‌కు తెలుగులో ఈ రేంజ్ కలెక్షన్సా? అప్పుడే మూడు రెట్ల లాభాలు!) త్వరలోనే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మోకాలికి శస్త్ర చికిత్స చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న రెండు సినిమాల షూటింగ్ తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నందువల్లే మోకాలి సర్జరీకి కారణమని భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సలార్ సెప్టెంబరు 28వ తేదీన రిలీజ్ కానుంది. ఆ తర్వాత కల్కి -2898 ఏడీ 2024 సంక్రాంతికి రోజు విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా సలార్, కల్కి చిత్రాల షూటింగ్ పూర్తి చేయనున్నారు. వీటి తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తున్న ఓ చిత్రం, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. (ఇది చదవండి: భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్) -
సలార్‌లో కేజీఎఫ్ హీరో యశ్.. ఫ్యాన్స్‌కు ఇక పండగే..!
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ‘సలార్’. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో జగపతిబాబు, పృథ్వీరాజ్ కీ రోల్ ప్లే చేయనున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో కేజీఎఫ్ హీరో యశ్ నటించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాలో యశ్ అతిథి పాత్రలో కనిపించనున్నారని టాక్. అయితే ఇప్పటికే ఈ విషయంపై ప్రశాంత్ నీల్.. యశ్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఇంతవరకు ఈ వార్తలపై చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. -
హిట్ కోసం ప్రభాస్ సూపర్ ప్లాన్
-
ప్రభాస్ కి ఎంతమాత్రం కలిసిరాని 2022 ..!
-
కడసారి చూపునకు నోచుకోలేకపోయా: రాఘవ లారెన్స్ ఎమోషనల్
రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతిపట్ల ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో ఆయన కృష్ణంరాజు, ప్రభాస్‌లతో కలిసి ‘రెబల్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు మృతి నేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తాను కృష్ణంరాజు గారిని మిస్ అవుతున్నానని ఆయన సెట్లో ప్రతి ఒక్కరిని తన పిల్లలలాగే చాలా కేర్ తీసుకుంటారని అన్నారు. (చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్స్‌లో సందడి చేసే చిత్రాలివే) ఒక తల్లి పిల్లలకు ఎలా అయితే ఆలనా పాలనా చూస్తుందో ఆయన కూడా సెట్లో ప్రతి ఒక్కరు తిన్నారా లేదా అనే విషయాన్ని చూస్తూ ఉంటారని, తినని వారికి తల్లి లాగే కొసరి కొసరి తినిపిస్తారని చెప్పుకొచ్చారు. తాను ఆ ప్రేమను, కేర్ ని మిస్ అవుతున్నానని రాఘవ లారెన్స్ పేర్కొన్నారు. అయితే తాను ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండటం తన దురదృష్టం అని అందుకే ఆయనను కడసారి చూసుకోలేకపోయాను అని లారెన్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆయన లెగసీ ప్రభాస్ గారి ద్వారా కొనసాగుతుందని తాను ఆశిస్తున్నట్లు రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చారు. I miss my Rebel star Krishnam Raju Garu. He takes care of everyone like his own child and serves them food like a mother. I miss that love and care. My bad luck, I wouldn't pay my last respect for him as I’m not in town. His legacy will always live through prabhas. 🙏🏼🙏🏼 pic.twitter.com/Sg16fqIvNI — Raghava Lawrence (@offl_Lawrence) September 13, 2022 -
లాఠీ దెబ్బలు తిన్నా, రక్తం చిందించినా.. టికెట్ రాకపాయే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సామాన్యుడి కడుపు రగిలింది.. లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించి సాధించిన తెలంగాణ ఈనెగాసి నక్కల పాలైపోతోందని ఓ కార్యకర్త గుండె గాయపడింది. కార్యకర్తలు బలిపశువులై, బలిదానాలు చేసి బతికించుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ ఇవాళ బలిసినోళ్ల జాగీరు అయిందని ఆ గుండె మండింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. ఆత్మాభిమానం పొంగింది. అభిమాన నేత పేరును రక్తంతో రాసిన ఆ చెయ్యే తిరుగుబాటు జెండా ఎగరేసింది. నవ తెలంగాణ పున ర్నిర్మాణం అంటే ఇదేనా అని నిలదీసింది. ఇంతకాలం ఆత్మ గౌరవ పోరాటం చేసింది ఆత్మాభిమానం చంపుకోవటానికేనా? అని ప్రశ్నించింది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీరయ్య యాదవ్ ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. మెదక్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఆయన కేసీఆర్‌పై రెబల్‌గా బరిలోకి దిగారు. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే పనిచేసిన ఆయన వయసు, పైసా ఉద్యమంలో కరిగిపోయాయి. 1986 యుక్త వయసులో గొల్ల కుర్మ సంఘం నేతగా, సామాజిక ఉద్యమకారునిగా జిల్లాలో ఓ వెలుగు వెలిగిన ఆయన 1997లో సమాజ్‌వాది పార్టీ తరఫున మెదక్ ఎంపీ పోటీ చేసి 35 వేల ఓట్లు తెచ్చుకున్నారు. 2001లో టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత సంగారెడ్డి నియోజకవర్గంలో ఆ పార్టీకి పెద్ద దిక్కయ్యారు. ఈ 14 ఏళ్ల కాలంలో ఉద్యమానికి అండగా నిలబడ్డారు. ఉద్యమకారులకు ఊతకర్రయ్యారు. 2005-06 కాలంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసీఆర్‌పై తిరుగుబాటు చేసిన సమయంలో బీరయ్య పార్టీకి అండగా నిలబడ్డారు. చెల్లాచెదురైన కార్యకర్తలను పోగేసి ఉద్యమం నడిపించారు. ఉద్యమానికి ఆర్థికంగా సహాయపడ్డారు. 2004, 2009 ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి మాట తప్పారు. తెలంగాణ సాధన తప్ప మరో పదవీకాంక్ష వ్యక్తం చేయని బీరయ్య.. తెలంగాణ ఆకాంక్ష నెరవేరిన తర్వాత తన భార్యకు జెడ్పీటీసీ టికెట్ ఇచ్చి జెడ్పీ చైర్మన్ చేయాలని కేసీఆర్‌ను కోరారు. చిరునవ్వుతో కేసీఆర్ ఒప్పుకున్నారు. బీరయ్య జెడ్పీటీసీ బీఫారం ఇవ్వాలని అక్కడే ఉన్న నియోజకవర్గం నాయకులు చింతా ప్రభాకర్, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణను ఆదేశించినట్లు బీరయ్య చెప్తున్నారు. తీరా బీ ఫారం ఇచ్చే సమయంలోనే తనకు ఉత్తి చేతులు చూపించడంతో ఆయన మనుసు గాయపడింది. నేరుగా కేసీఆర్‌కు లేఖ రాసి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది అవమానించడమే అని బాధపడ్డారు. ఆయినా ఆయన నుంచి స్పందన రాలేదు. కేసీఆర్ నామినేషన్ వేయడానికి సంగారెడ్డి పట్టణానికి వస్తే బీరయ్య ఎదురుపోయి నమస్కరించారు. అయినా కేసీఆర్ నుంచి పలకరింపు లేదు. బీరయ్య ఆత్మాభిమానం దెబ్బతింది. రగుల్జెండా చేతపట్టింది. ఆ తర్వాత ఏమైందో బీరయ్య యాదవ్ మాటల్లోనే.. ‘కేసీఆర్ అగ్రకులం భావజాలం ఉన్న నాయకుడు. కేసీఆర్ ఎజెండా బయటపెట్టాలని 2001లోనే నేను డిమాండ్ చేశా. అప్పుడు వారం రోజుల్లోనే ఎజెండా ప్రకటించారు. చిన్న రాష్ట్రాల వల్ల చిన్న సమూహాలకు రాజ్యాధికారం వస్తుంది. పరిపాలన సౌలభ్యం జరుగుతుంది, అధికార వికేంద్రీకరణ జరుగుతుంది’ అని అంబేద్కర్ మాటలను కేసీఆర్ చెప్పారు. ఆ మాటలతోనే నేను టీఆర్ఎస్ ఉద్యమంలోకి వచ్చాను. ఇప్పటివరకు సుమారు కోటి రూపాయలు, విలువైన నా వయసును ఖర్చు చేశాను. లాఠీ దెబ్బలు తిన్నా... జైలుకు పోయినా.. రాజకీయ పాఠాలు చెప్పా.. సమ్మెలు చేసినా.. ఇల్లు అమ్ముకున్న. తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో నా రక్తం, నా చెమట, నా కష్టం ఉంది. మొన్న కూడా దానం నాగేందర్ మనుషులు వచ్చి కొడితే నరాలు చితికిపోయి చేతులు వణుకుతున్నాయి. పోలీసులు తొక్కితే మూడు రోజులు కడుపులోంచి రక్తం పడింది. ఉద్యమకారునికి ఇది మామూలే అని నా మనుసుకు సర్ది చెప్పుకున్న. వెనుకటికి ఉడుము మూతికి తేనె పూసి దొంగలు కోటలు ఎక్కేవారట. మా మెదడుకు మేం పూసుకున్న జై తెలంగాణ సెంటిమెంటుతో ఉరికాం. కార్యకర్తలం బలి పశువులం అయ్యాం. ఇప్పుడు బలిసినోళ్లు వచ్చి టికెట్లు తీసుకుంటున్నారు. ఇదే కేసీఆర్‌ను నేను అడుగుతున్నా ఉద్యమం చేసిన వాళ్లకు ఎంత మందికి టికెట్లు ఇచ్చారో చెప్పండి. అందరికి ఎమ్మెల్యే పదవులే ఇవ్వాల్సిన పని లేదు. కనీసం ఎంపీటీసీలు, జెడ్పీటీసీ పదవులైనా నిఖార్సుగా ఉద్యమంలో నడిచిన వారికే ఇచ్చారో చెప్పండి చాలు. ఆయారం గయారంలు డబ్బులు చేతిలో పెట్టుకొని రావడం, టికెట్లు తీసుకోవడం, చిన్న చిన్న పదవులు వాళ్ల భజన పరులకు ఇచ్చుకోవడం తప్పితే మాలాంటి వాళ్లకు అవకాశం ఏది? నేను జెడ్పీటీసీ అడిగాను, కేసీఆరే ఇస్తామని చెప్పారు. ఎందుకు ఇవ్వలేదు. నా ఉద్యమ జీవితం కనీసం జెడ్పీటీసికి కూడా పనికి రాదా? పోని నాకంటే గొప్ప ఉద్యమకారుడు ఇప్పుడు మీ పార్టీలో టికెట్లు ఇచ్చిన వాళ్లలో ఉన్నారా? నాలాగే అన్యాయానికి గురైన బీరయ్య యాదవ్‌లు తెలంగాణ రాష్ర్టంలో చాలా మంది ఉన్నారు. అంతెందుకండీ నా కళ్లముందే దాదాపు 100 మందికి ఎమ్మెల్సీ పదవులు ఇస్తానని కేసీఆర్ నచ్చజెప్పారు. నిజానికి ఎమ్మెల్సీ పదవులు ఎన్ని ఉంటాయి. ఇలాంటి మాటలతో మోసం చేయొద్దనే నా నిరసన తెలియజేయడానికే కేసీఆర్‌పై రెబల్‌గా పోటీ చేశాను. తుది వరకు పోరాడుతా? గెలపు ఓటములు నాకు ముఖ్యం కాదు. జరుగుతున్న అన్యాయాన్ని నలుగురి చెప్పడమే నా లక్ష్యం.’ అంటూ కన్నీరు పెట్టుకున్నాడు బీరయ్య. -
రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి కుమార్తె
నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి సెగలు తారాస్థాయికి చేరాయి. సీపీఐతో పొత్తుకు కాంగ్రెస్ శ్రేణులు సహకరించటం లేదు. దాంతో మునుగోడులో రెబల్ అభ్యర్థిగా ఎంపీ పాల్వాయి గోవర్థన్ రెడ్డి కుమార్తె స్రవంతి బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ....కుటుంబానికి ఒకే సీటు అనే వాదన తెరపైకి రావడంతో ఆశావాహులకు నిరాశే ఎదురైంది. గతంలో పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి పలుమార్లు మునుగోడు టిక్కెట్ స్రవంతిదేనని ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా మునుగోడును అంటుపెట్టుకోని అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ పార్టీని ముందుకు నడిపించారు. మరోవైపు దేవరకొండలో రెబల్ బరిలో ఎమ్మెల్యే బాలూ నాయక్, మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. ఇక ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గానికి అభ్యర్థిగా ఖరారైన గుడిపాటి నర్సయ్యను మార్చి ఆయన స్థానంలో అద్దంకి దయాకర్‌కు టికెట్ ఖరారు చేయటంతో పార్టీ నేతలు అలకబూనారు.