సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రూ. 40 కోట్ల సినిమా | Mamitha Baiju Movie Streaming Now OTT | Sakshi
Sakshi News home page

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రూ. 40 కోట్ల సినిమా

Published Sat, Apr 6 2024 7:58 AM | Last Updated on Sat, Apr 6 2024 10:51 AM

Mamitha Baiju Movie Streaming Now OTT - Sakshi

మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్‌ అయింది. ఈ సినిమాతో తెలుగు,తమిళ ఇండస్ట్రీలో ఆమె రేంజ్‌ మారిపోయింది. ప్రేమలు సినిమా తర్వాత కోలీవుడ్‌లో ఈ బ్యూటీ నటించిన రెబల్‌ మార్చి 22న విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్‌ ఇండియా రేంజ్‌లో 'రెబెల్‌' అనే సినిమాను తమిళ్‌లో నిర్మించారు. ప్రస్తుతం ఎలాంటి ప్రకటన లేకుండా సడెన్‌గా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 

'రెబల్‌' చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు.  సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా రెబల్‌ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన లేకుండానే సడెన్‌గా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతుంది. తమళ్‌, తెలుగులో ఈ సినిమా అందుబాటులో ఉంది.

రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన‌ట్లు మేక‌ర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్‌ అయినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి. రెబల్‌ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కడంతో ఫర్వాలేదు అనిపించింది. ఈ వీకెండ్‌లో మంచి టైమ్‌పాస్‌ కలిగించే సినిమాగా రెబల్‌ ఉంటుందని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement