Prabhas To Undergo Knee Surgery In New York - Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్ మోకాలికి సర్జరీ.. ఆ రెండు సినిమాల తర్వాతే!

Published Mon, Aug 14 2023 2:32 PM | Last Updated on Mon, Aug 14 2023 2:50 PM

Young Rebal Star Prabhas Going To Knee Surgery In New York - Sakshi

యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ సలార్, కల్కి సినిమాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు.  అయితే తాజాగా ప్రభాస్ సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. 

(ఇది చదవండి: జైలర్‌కు తెలుగులో ఈ రేంజ్‌ కలెక్షన్సా? అప్పుడే మూడు రెట్ల లాభాలు!)

త్వరలోనే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మోకాలికి శస్త్ర చికిత్స చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న రెండు సినిమాల షూటింగ్‌ తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నందువల్లే మోకాలి సర్జరీకి కారణమని భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సలార్ సెప్టెంబరు 28వ తేదీన రిలీజ్ కానుంది. ఆ తర్వాత కల్కి -2898 ఏడీ 2024 సంక్రాంతికి రోజు విడుదలకు సిద్ధమవుతోంది. 

అయితే ప్రభాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా సలార్, కల్కి చిత్రాల షూటింగ్  పూర్తి చేయనున్నారు. వీటి తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తున్న ఓ చిత్రం, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది.

(ఇది చదవండి: భోళా ఎఫెక్ట్‌.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement