అగ్ర నిర్మాణ సంస్థ.. రెబల్‌ స్టార్‌తో బిగ్ డీల్.. ఏకంగా మూడు భారీ ప్రాజెక్టులు! | Hombale Films Big Deal With Rebal Star Prabhas For Upcoming Projects | Sakshi
Sakshi News home page

Prabhas: ప్రభాస్‌తో బిగ్ డీల్... నాలుగేళ్ల వరకు వదిలే ప్రసక్తే లేదు!

Published Fri, Nov 8 2024 1:52 PM | Last Updated on Fri, Nov 8 2024 2:59 PM

Hombale Films Big Deal With Rebal Star Prabhas For Upcoming Projects

రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది కల్కి సినిమాతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ మూవీలో దీపికా పదుకొణె, దిశా పటానీ, అమితాబ్ బచ్చన్‌ లాంటి స్టార్స్‌ నటించారు. ఈ చిత్రంలో భైరవ పాత్రలో ప్రభాస్ మెప్పించారు.

అయితే గతేడాది డిసెంబర్‌ సలార్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు.

వరుసగా మూడు ప్రాజెక్టులు

అయితే తాజాగా భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోన్న నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఈ బ్యానర్‌లోనే ప్రభాస్ సలార్‌-2 త్వరలోనే పట్టాలెక్కనుంది. అంతే కాకుండా రెబల్‌ స్టార్‌తో మరో రెండు ప్రాజెక్టులు చేయనున్నట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. ప్రభాస్‌తో వరుసగా 2026,2027,2028 సంవత్సరాల్లో మూడు చిత్రాలు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

బిగ్‌ డీల్‌

ఈ లెక్కన ప్రభాస్‌తో భారీ డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. ఒక్కో సినిమాకు రూ.150 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ తీసుకునే ప్రభాస్‌,.. ఏకంగా మూడు చిత్రాలకు దాదాపు రూ.450 కోట్లకు పైగానే పారితోషికం తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్‌తో రాబోయే మూడు సినిమాలకు రెబల్ స్టార్‌ బిగ్‌ డీల్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. 

కాగా.. ప్రభాస్ ‍టాలీవుడ్‌లో ది రాజాసాబ్‌ మూవీలో నటిస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో థియేటర్లలో సందడి చేయనుంది. ఆ తర్వాత యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్‌ మూవీ చేయనున్నారు. ఈ చిత్రంలో తొలిసారి పోలీసు పాత్రలో కనిపించనున్నారు. ఆ తర్వాతే సలార్‌-2 సెట్స్‌పైకి వెళ్లే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement