knee surgery
-
సర్జరీ సక్సెస్.. హైదరాబాద్‌కు తిరిగొచ్చిన ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. మోకాలి సర్జరీ కోసం యూరప్ వెళ్లిన ఆయన దాదాపు రెండు నెలల తర్వాత తిరిగి హైదరాబాద్‌లో అడుగుపెట్టాడు. హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్తున్న ప్రభాస్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మోకాలి సర్జరీ కోసమే యూరప్ వెళ్లిన ప్రభాస్.. సర్జరీ అనంతరం అక్కడే నెల రోజుల పాటు ఉండి విశ్రాంతి తీసుకున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చాడు. పుట్టిన రోజు (అక్టోబర్ 23)నాడు కూడా అందుబాటులో లేకపోవడం.. రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నా.. ‘సలార్’ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అసంతృప్తిలో ఉన్న ఫ్యాన్స్‌కి..ప్రభాస్ తిరిగొచ్చారనే వార్త కాస్త ఉపశమనం కలిగించింది. నిర్లక్ష్యం ఎందుకు? ప్రశాంత్ నీల్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది. అంటే సినిమా విడుదలకు ఇంకా 44 రోజులు మాత్రమే ఉంది. అయినా ఇంతవరకు ప్రమోషన్స్ ప్రారంభించలేదు. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకే దాదాపు రెండు నెలల ముందుగా ప్రమోషన్స్ ని స్టార్ట్ చేశాడు రాజమౌళి. కానీ సలార్ టీమ్ మాత్రం ఇంకా మేలుకోవడం లేదు. కంటెంట్‌పై ఎంత నమ్మకం ఉన్నా.. వెనుకాల ప్రభాస్ లాంటి స్టార్ హిరో ఉన్నప్పటికీ.. విడుదలకు ముందు సరైన ప్రమోషన్ ఉంటేనే సినిమాకు హైప్ వస్తుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైన మించి పోయిందేమి లేదని, త్వరగా ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తే..సినిమాకు కలిసొస్తుందని అంటున్నారు. ప్రభాస్ బిజీ బిజీ యూరప్ నుంచి తిరిగొచ్చిన ప్రభాస్.. త్వరలోనే ‘సలార్’ ప్రమోషన్స్‌లో పాల్గొనబోతున్నారట. ముంబై, హైదరాబాద్, చెన్నై లాంటి నగరాల్లో ఈవెంట్స్ చేసేందుకు సలార్ టీమ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రతి ఈవెంట్లో పాల్గొని, ఫ్యాన్స్‌ని పలకరించబోతున్నాడట. అలాగే దీపావళి కానుకగా ట్రైలర్‌ను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ఈ రోజే హైదరాబాద్ తిరిగొచ్చాడు. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మొదటగా సలార్ ప్రమోషన్స్‌కే సమయం కేటాయిస్తారట. ఆ తర్వాత మారుతి సినిమాతో పాటు నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’ చిత్రం షూటింగ్లో పాల్గొంటారు. -
సర్జరీ చేయించుకోనున్న యంగ్ రెబల్ స్టార్.. కారణం అదే!
యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం సలార్, కల్కి సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది జూన్ 16న రిలీజైన ఆదిపురుష్ అభిమానులకు తీవ్ర నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ఔం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ప్రభాస్ సలార్, కల్కి సినిమాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే తాజాగా ప్రభాస్ సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: జైలర్‌కు తెలుగులో ఈ రేంజ్ కలెక్షన్సా? అప్పుడే మూడు రెట్ల లాభాలు!) త్వరలోనే రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా షూటింగ్‌లకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన మోకాలికి శస్త్ర చికిత్స చేసుకోబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న రెండు సినిమాల షూటింగ్ తర్వాత అమెరికాలోని న్యూయార్క్‌లో ఓ ప్రముఖ ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నందువల్లే మోకాలి సర్జరీకి కారణమని భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం ఆయన నటిస్తున్న సలార్ సెప్టెంబరు 28వ తేదీన రిలీజ్ కానుంది. ఆ తర్వాత కల్కి -2898 ఏడీ 2024 సంక్రాంతికి రోజు విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ప్రభాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత ఏడాదిపాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా సలార్, కల్కి చిత్రాల షూటింగ్ పూర్తి చేయనున్నారు. వీటి తర్వాత మారుతి దర్శకత్వంలో చేస్తున్న ఓ చిత్రం, సందీప్ వంగా దర్శకత్వంలో స్పిరిట్, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో సినిమాలు చేయాల్సి ఉంది. (ఇది చదవండి: భోళా ఎఫెక్ట్.. ముక్కు పిండి వసూలు చేస్తున్న చిరంజీవి? క్లారిటీ ఇచ్చిన బేబి డైరెక్టర్) -
ధోని మోకాలి ఆపరేషన్ సక్సెస్
చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్ర సింగ్ ధోని మోకాలికి ఇవాళ (జూన్ 1) జరిగిన శస్త్ర చికిత్స విజయవంతమైందని సీఎస్కే సీఈఓ కాశీ విశ్వనాథ్ వెల్లడించారు. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో నేటి ఉదయం ధోనికి సర్జరీ జరిగిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ధోని ఫిట్‌గా ఉన్నాడని, మరో రెండు రోజుల పాటు అతను ఆసుపత్రిలోనే ఉంటాడని పేర్కొన్నారు. సర్జరీ అనంతరం తాను ధోనితో మాట్లాడానని.. శస్త్రచికిత్స గురించి వివరించలేను కానీ అది కీ-హోల్ ఆపరేషన్ అని మాత్రం చెప్పగలనని వివరించారు. మొత్తంగా ధోనికి జరిగిన ఆపరేషన్ సక్సెస్ అయ్యిందని తెలిపారు. కాగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్-2023లో మహీ మోకాలి సమస్యతో బాధపడిన విషయం తెలిసిందే. సీఎస్కే టైటిల్ గెలిచిన 48 గంటల్లోనే ధోని ఆసుపత్రిలో చేరాడు. తాజాగా శస్త్ర చికిత్స సైతం విజయవంతంగా పూర్తి చేసుకుని మరో రెండు మూడు రోజుల్లో డిశ్చార్జ్ కానున్నాడు. గతంలో టీమిండియా యువ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు ఆపరేషన్ చేసిన స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ దిన్షా పార్దివాలానే ధోని సైతం (41) సర్జరీ చేశారు. ఆసుపత్రిలో ధోనితో పాటు అతని భార్య సాక్షి ఉన్నారు. ఇదిలా ఉంటే, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఐపీఎల్ 2023 ఫైనల్స్‌లో ధోని సేన 5 వికెట్ల తేడాతో విజయం సాధించి, ఐదో ఐపీఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. సాహా (54), సాయి సుదర్శన్ (96) విజృంభించడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేయగా.. ఛేదనలో సీఎస్కే 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసి డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో విజయం సాధించింది. రుతురాజ్ (26), కాన్వే (47), శివమ్ దూబే (32 నాటౌట్), రహానే (27), రాయుడు (19), జడేజా (15 నాటౌట్) తలో చేయి వేసి సీఎస్కేను గెలిపించారు. చదవండి: ప్రపంచంలోకెల్లా సంపన్నమైన క్రికెట్ బోర్డు.. జెర్సీ స్పాన్సర్ చేసే నాథుడే లేడా..? -
రిషభ్ పంత్ మోకాలి సర్జరీ సక్సెస్.. కానీ!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. పంత్ ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో పంత్‌కు శుక్రవారం శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కోకిలాబెన్ ఆసుపత్రిలోనే అతడి మోకాలి లిగమెంట్లకు సర్జరీ చేయించినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా పంత్ ఆరోగ్యం కాస్త కుదుటపడ్డాక లండన్‌లో సర్జరీ చేయంచాలని తొలుత బీసీసీఐ భావించింది. కానీ ఇప్పడు ముంబైలోనే చేయించినట్లు సమాచారం. "రిషభ్ పంత్ మోకాలి లిగమెంట్ల శస్త్రచికిత్స శుక్రవారం విజయవంతమైంది. ప్రస్తుతం అతడు వైద్యుల పరిశీలనలో ఉంచారు. తదుపరిగా ఏం చేయాలో, పునరావాసం(రిహాబిలిటేషన్)కు ఎప్పుడు పంపించాలో డాక్టర్ దిన్షా పార్ధీవాలా నేతృత్వంలోని వైద్యబృందం తెలియజేస్తుంది. అదేవిధంగా ఈ వైద్య బృందం, బీసీసీఐ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ టీంతో నిరంతరం టచ్‌లో ఉంటుంది" అని బీసీసీఐ అధికారి ఒకరు పీటీఐతో పేర్కొన్నారు. అయితే పంత్ మాత్రం పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధించడానికి దాదాపు 7 నుంచి 9 నెలల సమయం పట్టనున్నట్లు సమాచారం. దీంతో అతడు స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌కు కూడా దూరమయ్యే ఛాన్స్ ఉంది. చదవండి: IPL 2023: ఐపీఎల్ వేలానికి ముందు ఈ సిరీస్ జరిగి ఉంటేనా! కానీ పాపం.. -
FIFA World Cup: పాల్ పోగ్బా దూరం.. ఫ్రాన్స్ ఆశలు ఆవిరేనా!
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్ ఉన్న సాకర్ సమరానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలిఉంది. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 18 వరకూ జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ మెగా టోర్నీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 2018లో అంచనాలకు భిన్నంగా ఫేవరెట్ టీమ్స్‌కు చెక్ పెడుతూ టైటిల్ చాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్ ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. గత ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ విజేతగా నిలవడంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు, మిడ్‌ఫీల్డర్ పాల్ పోగ్బాది కీలకపాత్ర. అయితే ఈసారి మాత్రం ఫ్రాన్స్ ఆశలు ఆవిరయ్యేలాగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే స్టార్ ప్లేయర్ ఎన్గోలో కాంటే గాయంతో ఫిఫా వరల్డ్‌కప్‌కు దూరం కాగా.. తాజాగా పోల్ పోగ్బా కూడా సాకర్ సమరం నుంచి వైదొలిగాడు. సెప్టెంబర్‌లో మోకాలికి సర్జరీ చేయించుకున్న పోగ్బా ఇంకా పూర్తిగా కోలుకోలేదని అతని ఏజెంట్ రఫేలా పిమెంటా చెప్పింది. నిజానికి వరల్డ్‌కప్‌కు ముందే అతడు తన క్లబ్ టీమ్ జువెంటస్‌కు అందుబాటులో ఉంటాడని భావించారు. కానీ 29 ఏళ్ల పోగ్బా కోలుకోవడానికి మరింత సమయం పట్టనుంది. సోమ, మంగళవారాల్లో జరిపిన మెడికల్ రివ్యూలను బట్టి చూస్తే పోగ్బా తన మోకాలి సర్జరీ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తేలినట్లు చెప్పింది. పాల్ పోగ్బాకు రీహ్యాబిలిటేషన్ అవసరం ఉందని రఫేలా పేర్కొంది. 2022లోనూ టైటిల్‌పై కన్నేసిన ఫ్రాన్స్‌కు ఇది నిజంగా పెద్ద దెబ్బే. ఖతార్‌లో జరగనున్న ఈ వరల్డ్‌కప్‌కు పోగ్బా అందుబాటులో లేకపోవడం ఫ్రాన్స్ విజయావకాశాలను తీవ్రంగా ప్రభావితం చేయనుంది. చదవండి: ఇంగ్లండ్ విజయాలను శాసిస్తున్న చివరి ఆరు ఓవర్లు -
అడుగులో అడుగు వేస్తున్న జడ్డూ.. వీడియో వైరల్
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం బెంగళూరులోని ఎన్సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలీ సర్జరీ అనంతరం ఎన్సీఏ క్యాంప్‌లో కోలుకునే పనిలో ఉన్నాడు. కాగా కుడి మోకాలికి బ్యాండేజీతో ఉన్న జడేజా ఫిట్నెస్ రూంలో మెళ్లిగా అడుగులు వేస్తూ కనిపించాడు. అయితే మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడకూడదన్న ఉద్దేశంతో అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా నడిచాడు. దీనికి సంబంధించిన వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా షేర్ చేసిన రవీంద్ర జడేజా ''పాపా-పగిలి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు. ఇక మోకాలి గాయంతో రవీంద్ర జడేజా అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే ఆసీస్, సౌతాఫ్రికాలతో టి20 సిరీస్‌లకు దూరమైన జడేజా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పట్టనుండడంతో ప్రపంచకప్ తర్వాత సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. కాగా జడేజా లేని లోటును అక్షర్ పటేల్ తీరుస్తున్నాడు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన అక్షర్ పటేల్.. రానున్న టి20 ప్రపంచకప్‌లో కీలకం కానున్నాడు. View this post on Instagram A post shared by Ravindrasinh jadeja (@ravindra.jadeja) చదవండి: దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. శ్రీలంక లెజెండ్స్ విజయం షమీకి పెరుగుతున్న మద్దతు.. అక్టోబర్ 9న డెడ్‌లైన్! -
11 ఏళ్లుగా నొప్పిని భరిస్తూ.. ఎట్టకేలకు
పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఎమెషనల్ వీడియోతో అభిమానుల ముందుకు వచ్చాడు. ఇటీవలే మోకాలి సర్జరీ కోసం అక్తర్ ఆస్ట్రేలియాకు వెళ్లాడు. మెల్బోర్న్లోని ఒక ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్న అక్తర్ కోలుకుంటున్నాడు. కాగా అక్తర్ గత 11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. ఒక రకంగా అక్తర్ క్రికెట్ నుంచి వైదొలగడానికి పరోక్షంగా ఇది కూడా ఒక కారణం. మొత్తానికి ఇన్నేళ్లకు మోకాలీ సర్జరీ చేయించుకున్న అక్తర్ కాస్త రిలీఫ్ అయ్యాడు. ఈ సందర్భంగా అక్తర్ మాట్లాడుతూ.. ''11 ఏళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నా. వాస్తవానికి క్రికెట్ నుంచి రిటైర్ అవ్వడానికి కూడా ఇదే ప్రధాన కారణం. అయితే మోకాలి నొప్పితో మరో నాలుగైదేళ్లు ఆడి ఉంటే మాత్రం కచ్చితంగా వీల్‌చైర్‌కు పరిమితమయ్యేవాడిని. ఎలాగోలా ఇన్నేళ్లకు సర్జరీ చేయించుకున్నా. కాస్త నొప్పిగా ఉంది. మీ ప్రార్థనలు నేను తొందరగా కోలుకునేలా చేస్తాయని ఆశిస్తున్నా. ఇదే నా చివరి సర్జరీ కూడా కావాలని కోరుకుంటున్నా'' అంటూ తెలిపాడు. ప్రస్తుతం షోయబ్ అక్తర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక షోయబ్ అక్తర్ పాకిస్తాన్ తరపున అన్ని ఫార్మాట్లు కలిపి 224 మ్యాచ్‌లాడి 444 వికెట్లు పడగొట్టాడు. Alhamdolillah, surgery went well. It will take some time to recover. Need your prayers. A special thanks to @13kamilkhan as well, he's a true friend who is looking after me here in Melbourne. pic.twitter.com/jCuXV7Qqxv — Shoaib Akhtar (@shoaib100mph) August 6, 2022 చదవండి: Kieron Pollard: చరిత్ర సృష్టించిన కీరన్ పొలార్డ్.. ఎవరికి అందనంత ఎత్తులో -
యాదన్నా.. ఓసారి నడువన్నా
సాక్షి, సిద్దిపేట: ‘యదన్నా.. బాగున్నవా, మంచిగ నడుస్తున్నవా.. ఓసారి నడువన్నా’అంటూ మోకాలు చిప్పలమార్పిడి ఆపరేషన్ చేయించుకున్న పుల్లూర్వాసి దేశెట్టి యాదగిరిని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖల మంత్రి టి.హరీశ్‌రావు పలకరించారు. ఆయనను నడిపించి ఆత్మవిశ్వాసం నింపారు. ‘ఎలాంటి నొప్పి లేకుండా నడుస్తున్నా’అంటూ యాదగిరి ఆనందం వ్యక్తం చేశారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల తర్వాత రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో మోకాలు చిప్ప ఆపరేషన్లు నిర్వహించారు. రెండు నెలల క్రితం సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో జరిగిన క్యాంప్‌లో 72 మందికి ఈ తరహా ఆపరేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. వీరిలో ముగ్గురికి ఇటీవల ఆపరేషన్లు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు మంగళవారం యాదయ్యతోపాటు సిద్దిపేట పట్టణానికి చెందిన బాపన్న, మందపల్లికి చెందిన మరోవ్యక్తిని పరామర్శించారు. వారితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించిన అనంతరం మంత్రి మాట్లాడుతూ... ఈ మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రారంభిస్తామన్నారు. డబ్బులు ఉన్నవాళ్లు మాత్రమే చేసుకునే ఈ సర్జరీని ఇప్పుడు పేదవాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం ప్రసవాలు జరిగితే, ఇప్పుడవి 56 శాతానికి పెరిగాయని వివరించారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం వల్లే సర్జరీలు సాధ్యం అవుతున్నాయని తెలిపారు. -
ఫ్రెంచ్ ఓపెన్‌కు ఫెడరర్ దూరం
బాసెల్ (స్విట్జర్లాండ్): కుడి మోకాలికి శస్త్ర చికిత్స జరగడంతో... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ నాలుగు నెలలపాటు ఆటకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో 38 ఏళ్ల ఫెడరర్ వచ్చే నాలుగు నెలల్లో జరిగే దుబాయ్ ఓపెన్, ఇండియన్ వెల్స్ ఓపెన్, బొగోటా ఓపెన్, మయామి ఓపెన్ టోర్నీలతో సహా మే 24 నుంచి జూన్ 7 వరకు జరిగే ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీకిఅందుబాటులో ఉండటం లేదు. -
త్వరలోనే మళ్లీ రాకెట్ పట్టుకుంటా: సైనా
హైదరాబాద్: వచ్చే నెలాఖర్లో రాకెట్ పట్టుకొని బ్యాడ్మింటన్ కోర్టులోకి దిగుతానని భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తెలిపింది. తద్వారా నవంబర్‌లో పోటీలకు అందుబాటులో ఉండాలని ఆమె భావిస్తోంది. గత నెల ముంబైలో కుడి మోకాలికి శస్త్రచికిత్స చేయి0చుకున్న ఆమె ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నట్లు చెప్పింది. ‘అక్టోబర్ చివరికల్లా పూర్తిగా కోలుకోవచ్చు. అప్పటిదాకా ఏ టోర్నీ బరిలోకి దిగే అవకాశమే లేదు. ప్రస్తుతం ప్రపంచ ర్యాంకింగ్‌సలో 8వ స్థానంలో ఉన్న నేను త్వరలోనే ప్రాక్టీస్ మొదలుపెడతాను. ఇప్పటికే ఆరు వారాలు విశ్రాంతి తీసుకున్నా... ఇంకా ఐదారు వారాల్లో పూర్తి ఫిట్నెస్ సాధించవచ్చని భావిస్తున్నా’ అని 26 ఏళ్ల సైనా తెలిపింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన ఆమె రియో ఒలింపిక్స్‌లో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. భారత్‌లో బ్యాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతోందని... అకాడమీలు, కోచ్‌లు క్రీడాకారులను ఆ విధంగా తీర్చిదిద్దుతున్నారని ఆమె చెప్పింది. ఈ సందర్భంగా రియోలో రజతం ఎగ్గిన తన సహచర క్రీడాకారిణి పి.వి. సింధును ఆమె మరోసారి అభినందించింది. -
అభిమానులారా నన్ను క్షమించండీ!
రియో ఒలింపిక్స్‌కు ముందు విశ్రాంతి కోసం కెనడా మేజర్ ఈవెంట్ టొరంటో మాస్టర్స్ టైటిల్ నుంచి టాప్ సీడెడ్ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా వైదొలిగారు. ఇందులో స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ పెదరర్ కూడా ఉన్నాడు. విశ్రాంతి తీసుకున్నా గాయాల నుంచి ఫెదరర్ కోలుకోలేదు. దీంతో తాను రియోలో తాను పాల్గొనడం లేదని 17 గ్రాండ్ స్లామ్ విజేత ఫెదరర్ తన వ్యక్తిగత ఫేస్ బుక్ ద్వారా తెలిపాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎఫ్బీ పోస్ట్‌లో పేర్కొన్నాడు. 'అభిమానులారా ఈ విషయాన్ని చెప్పేందుకు చాలా బాధగా ఉంది. రియో ఒలింపిక్స్ లో స్విట్జర్లాండ్ కు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నాను. డాక్టర్లు, ఇతర వ్యక్తిగత సిబ్బందితో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఫిబ్రవరిలో సర్జరీ చేయించుకున్నాను. అయితే మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు. రియోతో పాటు దాదాపు ఈ ఏడాది ఏ టోర్నీలోనూ పాల్గొనను. వచ్చే ఏడాది నూతన ఉత్సాహంతో రంగంలోకి దిగుతాను. కెరీర్ లో తక్కువ గాయాలతో కేవలం కొన్ని టోర్నమెంట్లకు మాత్రమే దూరమయ్యాను, ఎందుకంటే.. టెన్నిస్‌పై నాకు ఉన్న ప్రేమ అలాంటిది. అభిమానుల ఆశీర్వాదంతో పూర్తిగా కోలుకుని 2017లో రీ ఎంట్రీ ఇస్తాను' అని స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ ఈ విషయాలను ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించాడు. -
సచిన్ కు ఆపరేషన్, అభిమానులకు షాక్
లండన్: రిటైర్మెంట్ తర్వాత కూడా గాయాల బాధ తప్పడం లేదని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. లండన్ లో తన మోకాలికి ఆపరేషన్ చేయించుకున్నట్టు 'లిటిర్ మాస్టర్' ట్విటర్ ద్వారా వెల్లడించారు. శస్త్ర చికిత్స జరిగిన తన ఎడమ కాలి ఫొటో కూడా ట్విటర్, ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు. త్వరలోనే కోలుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశాడు. 'కొన్ని గాయాలు రిటైర్మెంట్ తర్వాత కూడా బాధ పెడుతుంటాయి. నా మోకాలికి ఆపరేషన్ జరిగింది. త్వరగా కోలుకుని మళ్లీ మామూలుగా తిరుగుతానని ఆశిస్తున్నా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నా'నని సచిన్ ట్వీట్ చేశాడు. ఇది పోస్ట్ చేసిన కొద్ది సేపటికే 34 వేల మందిపైగా అభిమానులు స్పందించారు. సచిన్ కు ఆపరేషన్ జరగడం పట్ల ఆశ్చర్యం, సానుభూతి వ్యక్తం చేశారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Some injuries trouble even after retirement, Will be back soon doing things I enjoy. Had a knee operation & resting. pic.twitter.com/k2wQT64dJI — sachin tendulkar (@sachin_rt) 6 July 2016 -
వివాదాస్పదంగా మారిన మంత్రిగారి ఆర్భాటం
-
జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదా?
-
మంత్రిగారికి జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదా?
మంత్రి కామినేని శ్రీనివాస్ కీళ్ల మార్పిడి ఆపరేషన్ తీరిది కార్పొరేట్ వైద్యులతో శస్త్రచికిత్స ఆపరేషన్ అయ్యాక వైద్య పరికరాలు మాయం మండిపడుతున్న వైద్యులు, రోగులు ‘జీజీహెచ్‌పై నమ్మకం కలిగించేందుకే మంత్రిఆపరేషన్ ఇక్కడ చేయించుకున్నారట. అయితే, ఆయనకు జీజీహెచ్ వైద్యులపై నమ్మకం లేదు. అందుకే కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వైద్యులను పిలిపించుకుని మరీ ఆపరేషన్ చేయించుకున్నారు. వైద్య పరికరాలు సైతం కార్పొరేట్ వైద్యశాలల నుంచి తెప్పించుకుని ఆపరేషన్ అయిపోగానే తిరిగి పంపించేశారు. ఆర్ధోపెడిక్ విభాగంలో ఆపరేషన్ థియేటర్‌ను సిద్ధం చేయకుండా గుండె జబ్బుల విభాగంలోని సీటీఎస్ శస్త్రచికిత్స విభాగంలో మంత్రికి ఆపరేషన్ నిర్వహించారు.’ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కీళ్లమార్పిడి శస్త్రచికిత్స అనంతరం శుక్రవారం గుంటూరు జీజీహెచ్‌లో వినిపించిన గుసగుసలివీ.. గుంటూరు : గత ఏడాది జీజీహెచ్‌లోని శిశు శస్త్రచికిత్స విభాగంలో ఓ పసికందు ఎలుకల దాడిలో మృతిచెందిన సంఘటన సంచలనం కలిగించింది. ఈ ఘటన నేపథ్యంలో ఇక్కడి వైద్యుల పనితీరు మెరుగుపరిచి, కనీసం వైద్య పరికరాలు, వసతులు కల్పించి జీజీహెచ్‌కు వచ్చే రోగులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ రాత్రి నిద్రలు, ఆసుపత్రిలో స్వయంగా శస్త్రచికిత్స చేయించుకోవడం వంటి వాటితో ప్రజల్లో నమ్మకం కలిగిస్తానంటూ ప్రకటనలు చేశారు. అయితే, శుక్రవారం మంత్రి కామినేని కుడికాలుకు జీజీహెచ్‌లో కీళ్ల మార్పిడి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. ఈ ఆపరేషన్‌ను కేర్ ఆస్పత్రి వైద్యుడు బీఎన్ ప్రసాద్, గుంటూరు సాయిభాస్కర్ ఆసుపత్రి వైద్యుడు బూసిరెడ్డి నరేంద్రరెడ్డి నిర్వహించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి సైతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మంత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారో అది తీవ్ర విమర్శల పాలవుతోంది. మంత్రి మెప్పు కోసమే.. మంత్రికి ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసి జీజీహెచ్‌కు కీళ్ల మార్పిడి ఆపరేషన్ కోసం ఎవరైనా వస్తే చేసేందుకు వైద్యులు లేరు. ఆపరేషన్ థియేటర్ లేదు. వైద్య పరికరాలు, సరైన వసతులు ఇక్కడ కనిపించవు. కానీ, మంత్రిగారి ఆపరేషన్ కోసం ఆసుపత్రికి సున్నాలు, మరమ్మతులు పూర్తయ్యాయి. ప్రత్యేకంగా ఐసీయూ బెడ్ కొనుగోలు చేశారు. ప్రైవేటు వైద్యశాలల్లో ప్రభుత్వ ఉద్యోగులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద వేలకొద్దీ కీళ్ల మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నప్పటికీ జీజీహెచ్‌లో ఈ ఆపరేషన్ నిర్వహించేందుకు కనీస ప్రయత్నం జరగకపోవడం శోచనీయం. అంతా ఆర్భాటమే.. 2002లోనే జీజీహెచ్‌లో అప్పటి వైద్యులు మోకాళ్లచిప్ప మార్పిడి ఆపరేషన్ కంటే కష్టమైన తొంటి మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడంతో పద్నాలుగేళ్లుగా ఆపరేషన్లు నిర్వహించిన దాఖలాలు లేవు. ఆసుపత్రికి వచ్చే నిరుపేదలకు సరైన వైద్య సేవలు అందించాల్సిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రే ఆర్భాటాల కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడడంపై జీజీహెచ్ వైద్యులు, ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మంత్రి ఆపరేషన్ చేయించుకున్న తీరు చూస్తుంటే ఆసుపత్రి కేవలం గదులు అద్దెకు ఇచ్చేందుకు మాత్రమే పనికొస్తుందనే అపోహ కలుగుతోందని వైద్య నిపుణులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. -
షారుక్ ఖాన్‌కు శస్త్రచికిత్స
ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ముంబైలోని బ్రీంచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేశారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా షారుక్‌కు సూచించారు. కొన్ని నెలలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న షారుక్ ఇటీవల ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. షారుక్ కోలుకున్నారని, శనివారం డిశ్చార్జి చేయవచ్చని వైద్యులు తెలిపారు. తనకు అండగా నిలిచిన అభిమానులకు షారుక్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలియజేశారు.