టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిటేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మోకాలీ సర్జరీ అనంతరం ఎన్‌సీఏ క్యాంప్‌లో కోలుకునే పనిలో ఉన్నాడు. కాగా కుడి మోకాలికి బ్యాండేజీతో ఉన్న జడేజా ఫిట్‌నెస్ రూంలో మెళ్లిగా అడుగులు వేస్తూ కనిపించాడు. అయితే మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడకూడదన్న ఉద్దేశంతో అడుగులో అడుగు వేస్తూ జాగ్రత్తగా నడిచాడు. దీనికి సంబంధించిన వీడియోనూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా షేర్ చేసిన రవీంద్ర జడేజా ''పాపా-పగిలి'' అంటూ క్యాప్షన్ జత చేశాడు.
ఇక మోకాలి గాయంతో రవీంద్ర జడేజా అక్టోబర్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే ఆసీస్, సౌతాఫ్రికాలతో టి20 సిరీస్‌లకు దూరమైన జడేజా కోలుకోవడానికి ఆరు వారాల సమయం పట్టనుండడంతో ప్రపంచకప్ తర్వాత సౌతాఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యాడు. కాగా జడేజా లేని లోటును అక్షర్ పటేల్ తీరుస్తున్నాడు. తన వైవిధ్యమైన బౌలింగ్‌తో ఆస్ట్రేలియాతో టి20 సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచిన అక్షర్ పటేల్.. రానున్న టి20 ప్రపంచకప్‌లో కీలకం కానున్నాడు.
చదవండి: దిల్షాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శన.. శ్రీలంక లెజెండ్స్ విజయం
Comments
Please login to add a commentAdd a comment