టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలో రీహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ఈ లక్నో కెప్టెన్ మోకాలి గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. భార్య అతియా శెట్టితో కలిసి జర్మనీకి వెళ్లి మోకాలికి సర్జరీ చేయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి వచ్చిన అనంతరం రీహాబిలిటేషన్ పేరుతో బీసీసీఐ బెంగళూరు ఎన్‌సీఏ అకాడమీకి పంపింది. ప్రస్తుతం ఫిట్‌నెస్ సాధించే పనిలో ఉన్న కేఎల్ రాహుల్ అందుకు తగ్గట్టుగా జిమ్ వర్కౌట్స్ చేస్తు చెమటలు కక్కాడు.ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోను రాహుల్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు. రాహుల్ పెట్టిన ఫోటోలపై అభిమానులు స్పందించారు.
టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ సైతం రాహుల్ పోస్టుకు స్పందిస్తూ సరదాగా టీజ్ చేశాడు. ''ఏంటి మిస్టర్ రజనీ(కేఎల్ రాహుల్) చాలా ఎక్స్‌ట్రాలు చేస్తున్నావ్.. చూడలేకపోతున్నాం'' అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇక గాయం కారణంగా డబ్ల్యూటీసీకి దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను బీసీసీఐఘ ఎంపిక చేసింది. కానీ ఫైనల్ మ్యాచ్‌కు అతను బెంచ్‌కే పరిమితమయ్యాడు.
ప్రస్తుతం ఇషాన్ కిషన్ కూడా బెంగళూరులోని ఎన్‌సీఏ అకాడమీలోనే ఉన్నాడు. విండీస్ టూర్‌కు ఎంపిక కావడంతో బ్యాటింగ్‌లో టెక్నిక్స్ మెరుగుపరుచుకునేందుకు ఇషాన్ ఎన్‌సీఏలో శిక్షణ తీసుకుంటున్నాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బెంచ్‌కే పరిమితమైన ఇషాన్ విండీస్ గడ్డపై పరుగుల వరద పారించేందుకు తహతహలాడుతున్నాడు.
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. మొదటి టెస్టు జూలై 12-16 తేదీల్లో విండ్సర్ పార్క్ స్టేడియంలో, రెండో టెస్టు 20-24 మధ్య క్వీన్స్ పార్ట్ ఓవల్ వేదికగా జరగనున్నాయి. వన్డే సిరీస్ జూలై 27న మొదలు కానుంది. మొదటి వన్డేకు కింగ్‌స్టన్ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. రెండో వన్డే జూలై 29న అదే స్టేడియంలో జరగనుంది. భారత్, వెస్టిండీస్ జట్లు ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ అకాడమీలో మూడో వన్డే ఆడతాయి. ఐదు టీ 20ల సిరీస్ ఆగష్టు 3న ప్రారంభమవుతుంది. ఆగష్టు 6, 8, 12, 13న మిగతా టి20 మ్యాచ్‌లు ఉన్నాయి.
చదవండి: 'మెక్‌కల్లమ్ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
Comments
Please login to add a commentAdd a comment