Kuldeep Yadav 4 Wickets West Indies 114 Runs All Out vs Ind 1st ODI - Sakshi
Sakshi News home page

WI Vs IND 1st ODI: కుల్దీప్‌ యాదవ్‌ సంచలన స్పెల్‌.. వెస్టిండీస్‌ 114 ఆలౌట్‌

Published Thu, Jul 27 2023 9:14 PM | Last Updated on Thu, Jul 27 2023 9:27 PM

Kuldeep Yadav 4 Wickets-West Indies 114 Runs-All-out Vs IND 1st ODI - Sakshi

ఇటీవలే టెస్టు సిరీస్‌లో దారుణ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకున్న వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌లోనూ అదే తరహా ఆటతీరును ప్రదర్శించింది. ఈ సిరీస్‌ను టీమిండియా వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఉపయోగించుకోవాలనుకున్నా విండీస్‌ కనీసం 30 ఓవర్లు కూడా బ్యాటింగ్‌ చేయలేకపోయింది. అసలు ఆడుతుంది వన్డేనా లేక టి20 మ్యాచ్‌ అన్న అనుమానం కలిగింది.

విషయంలోకి వెళితే.. గురువారం బార్బడోస్‌ వేదికగా తొలి వన్డేలో వెస్టిండీస్ 23 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. కనీసం పోరాడే ప్రయత్నం చేయని విండీస్‌ బ్యాటర్లలో షెయ్‌ హోప్‌ ఒక్కడే 43 పరుగులతో కాస్త పర్వాలేదనిపించాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ సంచలన స్పెల్‌తో మెరిశాడు. మూడు ఓవర్లలో రెండు మెయిడెన్లు సహా కేవలం ఆరు పరుగలిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. జడేజా మూడు వికెట్లు పడగొట్టగా.. హార్దిక్‌, శార్దూల్‌, ముకేశ్‌ కుమార్‌లు తలా ఒక వికెట్‌ తీశారు. 

చదవండి: WI Vs IND 1st ODI: టాస్‌ గెలిచిన టీమిండియా.. ఇషాన్‌ కిషన్‌ వైపే మొగ్గు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement