షారుక్ ఖాన్కు శస్త్రచికిత్స | Shah Rukh Khan undergoes knee surgery, thanks fans for support | Sakshi
Sakshi News home page

షారుక్ ఖాన్కు శస్త్రచికిత్స

Published Fri, May 22 2015 10:18 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

షారుక్ ఖాన్కు శస్త్రచికిత్స - Sakshi

షారుక్ ఖాన్కు శస్త్రచికిత్స

ముంబై: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ఎడమ మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ముంబైలోని బ్రీంచ్ కాండీ ఆస్పత్రి వైద్యులు ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ చేశారు. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా షారుక్కు సూచించారు.  

కొన్ని నెలలుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న షారుక్ ఇటీవల ఓ సినిమా షూటింగ్లో పాల్గొన్నారు. నొప్పి తీవ్రం కావడంతో ఆస్పత్రిలో చేరారు. వైద్యుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకున్నారు.  షారుక్ కోలుకున్నారని, శనివారం డిశ్చార్జి చేయవచ్చని వైద్యులు తెలిపారు. తనకు అండగా నిలిచిన అభిమానులకు షారుక్ ట్విటర్లో కృతజ్ఞతలు తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement