మలయాళంలో విజయవంతమైన ‘ప్రేమలు’ సినిమాతో మమితా బైజు పేరు బాగా వైరల్ అయింది. తెలుగులో కూడా ప్రేమలు పేరుతో రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో విడుదల చేశారు. ఇక్కడ కూడా భారీగానే ప్రేక్షకులను మెప్పించింది. కానీ మార్చి 22 ఈ బ్యూటీ నటించిన మరో సినిమా విడుదలైంది. ప్రముఖ నిర్మాతలు కేఈ జ్ఞానవేల్ రాజా, నేహా జ్ఞానవేల్ రాజా నిర్మాణంలో పాన్ ఇండియా రేంజ్‌లో 'రెబెల్' అనే సినిమాను కోలీవుడ్‌లో నిర్మించారు.
ఈ చిత్రంలో మమితా బైజు- జీవీ.ప్రకాశ్‌కుమార్ జోడీగా నటించారు. సంగీత దర్శకుడిగా, నటుడిగా సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు జీవీ.ప్రకాశ్‌కుమార్‌కు ఉన్న విషయం తెలిసిందే. రెబెల్ సినిమా విషయానికి వస్తే.. 1980లలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు అరుణ్ కృష్ణ, రాధాకృష్షన్, వెట్రే క్రిష్ణనమ్ లాంటి టాప్ మోస్ట్ టెక్నిషియన్స్ పనిచేశారు. దీంతో ఈ సినిమా కోసం సుమారుగా రూ. 40 కోట్ల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రెబల్ సినిమాకు విడుదలైన మొదటి ఆటతోనే మిశ్రమ స్పందన వినిపిస్తోంది.
రెండు విద్యార్ధి వర్గాల మధ్య మొదలైన సంఘర్షణ రాష్ట్ర రాజకీయాల దాకా విస్తరించడం. ఆపై ర్యాగింగ్, కుల వివక్ష, పొలిటిక్స్ ఇలా అన్ని అంశాలు తెరపై కనిపించడం అయితే బాగుంది కానీ అందుకు తగ్గట్లు నికేష్ ఆర్ఎస్ స్క్రీన్ ప్లే సరిగ్గా లేదని చెప్పవచ్చు. ఈ చిత్రంలో మమితా బైజు పాత్రకు కూడా పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు. దీంతో రెబెల్ సినిమా భారీ డిజాస్టర్‌గా మిగలడం దాదాపు ఖాయం అని అప్పుడు కొందరు లెక్కలేస్తున్నారు. రెబల్ మొదటిరోజు కలెక్షన్స్ తమిళనాడులో రూ. 1.5 కోట్లు,కన్నడలో రూ. 75 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ. 30 లక్షలు మాత్రమే వసూలు చేసిందని అంచనా వేస్తున్నారు. ప్రారంభంలోనే ఇంత పేలవంగా కలెక్షన్స్ ఉంటే ఫైనల్‌గా దారుణమైన నష్టాలు రావడం ఖాయం అని చెప్పవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment